loader

డబ్బు పంపారా? ఈ నంబర్కు కాల్ చేయండి!

గూగుల్ పే, ఫోన్‌పే, BHIM వంటి యాప్‌ల ద్వారా డబ్బులు తప్పు వ్యక్తికి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఆందోళన చెందకుండా ఈ నంబర్లకు కాల్ చేసి, సమస్యను పూర్తి వివరాలతో తెలియజేస్తే సంబంధిత సంస్థలు వెంటనే చర్యలు తీసుకుని డబ్బు తిరిగి అకౌంట్‌కు వచ్చేలా ప్రయత్నిస్తాయి. గూగుల్ పే : 18004190157, ఫోన్‌పే : 08068727374, 22 01204456456 , BHIM : 18001201740 స్టమర్ కేర్ ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే, వినియోగదారులుhttps://www.npci.org.in/ అధికారిక […]

కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ వేటు

కల్తీ మద్యం తయారు చేస్తున్న టీడీపీ నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు చేపట్టారు. దాసరిపల్లి జయచంద్ర రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు వేశారు. వారిపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా ఈ డంప్ రహస్యంగా నడుస్తోంది. టీడీపీ నేతలు స్థానికంగా రా మెటీరియల్స్‌ను సేకరించుకుని, ఆధునిక యంత్రాలతో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు.

ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కేంద్రంగా ఉన్న ‘ఇన్వర్షన్’ సంస్థ అంతరిక్ష రంగంలో కొత్త అడుగు వేసింది. ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్ ‘ఆర్క్’ ను ఆవిష్కరించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ వాహనం ద్వారా అంతరిక్షం నుంచి భూమిపై ఏ ప్రాంతానికైనా ఒక గంటలోపు వస్తువులను డెలివరీ చేయగల సామర్థ్యం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ‘ఆర్క్’ (RK) వాహనం పొడవు 8 అడుగులు, వెడల్పు 4 అడుగులు ఉండి పెద్ద టేబుల్‌టాప్ పరిమాణంలో ఉంటుంది.

మరోసారి మా జోలికి వస్తే దెబ్బకు దెబ్బే.. పాక్ మంత్రి హెచ్చరికలు

మరోసారి తమపైకి సైనిక దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారతదేశానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు వెలువరించారు. పాకిస్థాన్‌తో సైనిక దుస్సాహాసానికి దిగితే తాము ఈసారి ఘాటైన రీతిలో జవాబు ఇచ్చి తీరుతామని ఆయన ఆదివారం ప్రకటించారు. ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇటీవలే భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైనిక దళాల చీఫ్ ద్వివేదిలు వేర్వేరుగా పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ రెండో దశ ఉంటుందని ప్రకటించారు.

ఏపీలో కొనసాగుతున్న వర్షాలు… రేపు ఈ జిల్లాలకు అలర్ట్.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో రానున్న మూడు, నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం (అక్టోబర్ 6) రోజున ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. రాష్ట్రంలోని ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నేను చెప్పినట్టు చేయకపోతే.. హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ వార్నింగ్

ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు మరి కొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ హమాస్‌కు తుది హెచ్చరిక చేశారు. తాను సూచించినట్టు గాజాపై హమాస్ తన అధికారాన్ని వదులుకోకపోతే భూమ్మీద లేకుండా పోతుందని హెచ్చరించారు. గాజాపై దాడుల నిలిపివేతకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ సిద్ధంగానే ఉన్నారని అన్నారు. అమెరికా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేందుకు ఆయన సిద్ధమేనని చెప్పారు.

వాటికి ఆధార్‌ సాక్ష్యం కాదు.. అప్పటికల్లా బిహార్ ఎన్నికలు పూర్తి చేస్తాం: సీఈసీ

సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల సంఘం బృందం బీహార్‌లో పర్యటించింది.ఒకట్రెండు దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని పొలిటికల్‌ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించాలని జేడీయూ కోరింది. నవంబర్‌ 22 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. తొలిసారి ఈవీఎం బ్యాలెట్‌ షీట్‌పై అభ్యర్థుల ఫోటోలు, ఎన్నికల గుర్తును కలర్‌ ఫోటోలతో పాటు, అభ్యర్థుల సీరియల్‌ నెంబర్లను పెద్దగా ముద్రిస్తామన్నారు. పౌరసత్వం, డేటా ఆఫ్‌ బర్త్‌కు ఆధార్‌ సాక్ష్యం కాదని స్పష్టం చేశారు.

కడపలో వెలుగులోకి వచ్చిన భారీ స్కామ్

కడప జిల్లాలో భర్తలేని ఒంటరి మహిళలకు చేయూత ఇవ్వాలని ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఒక ఆశ్రమం రికార్డుల ప్రకారం ఆశ్రమంలో 99 మంది నిర్వాసిత మహిళలు ఉన్నట్లు చూపించారు. కానీ వాస్తవానికి అక్కడ ఒక్క మహిళా నిర్వాసితురాలూ లేకపోవడం ఈ స్కామ్‌ను వెలుగులోకి తెచ్చింది సరస్వతి అనే మహిళ ఈ ఆశ్రమాన్ని నడుపుతూ, ప్రభుత్వ సహాయం తీసుకుంటున్నట్లు రికార్డుల్లో ఉంది. ఈ అవకతవకలు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తనిఖీల్లో బయటపడ్డాయి.

పెనుకొండలో మహిళా హోం గార్డు ఆత్మహత్యాయత్నం కలకలం

పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల ప్రాంతంలో మహిళా హోం గార్డు ప్రియాంక ఆత్మహత్యాయత్నం ఆత్మహత్యకు ప్రయత్నించే ముందు ప్రియాంక ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన బాధను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ప్రియాంక తన వీడియోలో..షఫీ, మైనుద్దీన్ అనే క్యాబ్ డ్రైవర్లు తాను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. గోరంట్ల సీఐ శేఖర్ కూడా తనను వేధిస్తున్న వారికే వత్తాసు పలుకుతున్నారని వీడియోలో వెల్లడించింది.

ఎలోన్ మస్క్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ రూ.2 లక్షల కోట్ల నష్టం!

మస్క్, కొంతమంది నెట్‌ఫ్లిక్స్ లింగమార్పిడి సమస్యలను ప్రోత్సహిస్తోందని, ‘వోక్ ఎజెండా’ను ప్రచారం చేస్తోందని ఆరోపించారు పిల్లల మానసిక ఆరోగ్యం కోసం, నెట్‌ఫ్లిక్స్ చూడటం ఆపాలని మస్క్ అన్నారు మస్క్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత, నెట్‌ఫ్లిక్స్ షేర్లు పడిపోవడం ప్రారంభించాయి. ట్రేడింగ్ రోజులు గడిచేకొద్దీ కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లు తగ్గింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON