loader

జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ భేటీ..

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. నామినేట్ పోస్టులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల నేతలతో కలిసి పని చేయాలని సూచించారు. అభిప్రాయ బేధాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే స్థాయి నేతలు […]

కారు కూతలు కూస్తే చెప్పుతో కొడతా… తోపుదుర్తికి, పరిటాల సునీత వార్నింగ్

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పుతో కొడుతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హౌసింగ్ లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యే పరిటాల సునీత రూ.10 వేలు వసూలు చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిరుపేదలని కూడా చూడకుండా లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘ఒజి’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్.. నేహా శెట్టి సాంగ్ విడుదల

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఒజి’ సినిమా నిడివి కారణంగా నేహా శెట్టితో తీసిన ఐటమ్ సాంగ్‌ని చిత్రం నుంచి తొలగించారు. అయితే ప్రేక్షకుల నుంచి ‘ఒజి’కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సాంగ్‌ను మళ్లీ థియేటర్స్‌లో జత చేశారు. కిస్ కిస్.. బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ సాగే ఈ పాటకు శ్రీ జో సాహిత్యం అందించారు. సోహా, వాగ్దేవి, మధుబంతి బగ్చి ఈ గానాన్ని ఆలపించారు. అరబిక్ పాట స్టైల్‌లో ఈ పాటని తమన్ […]

ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్‌షాక్.. జంటనగరాల్లో పెరగనున్న బస్సు ఛార్జీలు.

హైదరాబాద్‌లో టీజీఎస్‌ ఆర్టీసీ హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సులకు ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. అన్ని రకాల బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంచనున్నారు. నాలుగో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసులో మొదటి స్టేజికి రూ.5 పెంచనుండగా.. రెండో స్టేజి నుంచి రూ. 10 అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు.పెంచిన ఈ ధరలు సోమవారం 6వ తేదీ నుంచి నుంచి […]

విశాఖలో దుర్గాదేవి మండపం వద్ద ఘోర ప్రమాదం… 16 మందికి గాయాలు

విశాఖపట్నం జిల్లా సీతంపేటలో పెనుప్రమాదం తప్పింది.బెల్లం గణపతి ఆలయం దుర్గాదేవి మండపం వద్ద జరిగిన ఒక దుర్ఘటనలో 16 మంది చిన్నారులకు గాయాలు అయ్యాయి. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు మరియు చిన్నారులు హాజరయ్యారు. అయితే వంట చేస్తున్న సమయంలో మరుగుతున్న వేడి గంజి ప్రమాదవశాత్తు వారిపై పడింది. దీంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అన్‌క్లెయిమ్డ్‌ సొత్తు రూ.1.84లక్షల కోట్లు : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ఎవరూ క్లెయిమ్‌ చేయకుండా ఉన్న నగదు బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద రూ.1.84లక్షల కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సదరు మొత్తం అర్హులకు అందేలా అధికారులు చూడాలన్నారు. కేంద్రమంత్రి గుజరాత్‌ గాంధీనగర్‌లో మూడులల పాటు జరిగే ‘మీ సొమ్ము-మీ హక్కు’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. బ్యాంకు డిపాజిట్లు, బీమా, ప్రావిడెండ్‌ ఫండ్‌, షేర్లు తదితర రూపాల్లో బ్యాంకులు, ఇతర నియంత్రణ సంస్థల వద్ద రూ.1.84 లక్షల కోట్ల నిధులు […]

మద్యంపై 20 శాతం ‘ఆవు పన్ను’.. బార్ బిల్లు ఫొటో వైరల్

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన వ్యక్తి తన ఫ్రెండ్స్‌తో కలిసి సెప్టెంబర్‌ 30న పార్క్ ప్లాజాలోని జియోఫ్రీ బార్‌కు వెళ్లాడు. ఆరు బీర్లు, మొక్కజొన్న వడలు ఆర్డర్‌ చేశాడు. ఆర్డర్ మొత్తం రూ. 2,650. అయితే జీఎస్టీ, వ్యాట్‌తోపాటు 20 శాతం ‘ఆవు పన్ను’తో కలిపి మొత్తం రూ. 3,262కు బిల్లు జారీ చేశారు. మద్యంపై Cow Cess On Liquor విధించడం చూసి ఆ కస్టమర్‌ షాక్‌ అయ్యాడు. ఈ బిల్లు ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ […]

మాట్లాడటానికి ఇంకేం లేదు.. మావోయిస్టులు లొంగిపోవాల్సిందే : అమిత్‌ షా

కేంద్రం ప్రభుత్వ ఒత్తిడి నేపథ్యంలో ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని, వాళ్లు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. లొంగిపోయేందుకు మావోయిస్టులు ముందుకు వస్తే తాము స్వాగతిస్తామని హోంమంత్రి అన్నారు. లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కోచింగ్ సెంటర్‌లో పేలుడు.. ఇద్దరు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో శనివారంనాడు మధ్యాహ్నం భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఒక కోచింగ్ సెంటర్‌లో జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.’ది సన్ క్లాసెస్ లైబ్రరీ’ కోచింగ్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పేలుడు సంభవించింది. పేలుడులో పలువురు పిల్లలు గాయపడ్డారు. ఐదుగురు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

ఉక్రెయిన్‌ ప్రయాణికుల రైలుపై రష్యా డ్రోన్ దాడి

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత తీవ్రం అవుతోంది. ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలోని ఒక రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యన్ దళాలు డ్రోన్‌లతో దాడి చేశాయి. ఈ దాడి సమయంలో కీవ్‌కు వెళ్తున్న ఒక ప్రయాణికుల రైలుపై బాంబులు పడ్డాయి. ఫలితంగా, రైల్‌లోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON