loader

అడిగిన కత్తి ఇవ్వలేదని, ఉద్యోగం నుంచి పీకేశారు..!

గత నెలలో డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్‌లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా.. కింగ్ చార్లెస్‌కు బహుమతిగా ఇవ్వడానికి లైబ్రరీలో ఉన్న ఒక ముఖ్యమైన చారిత్రక కత్తిని అందించాలని ట్రంప్ పరిపాలన కోరగా.. అందుకు లైబ్రరీ డైరెక్టర్ టాడ్ ఆరింగ్టన్ నిరాకరించారు. నిజమైన చారిత్రక కత్తిని ఇవ్వడానికి ఆరింగ్టన్ నిరాకరించడం ట్రంప్ పరిపాలనాధికారులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఉన్నతాధికారులు ఫోన్‌ చేసి రాజీనామా చేయాలని లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని తేల్చిచెప్పారు. దీంతో ఎట్టకేలకు ఆరింగ్టన్‌ రాజీనామా […]

అత్యాచార నిందితులను నడి రోడ్డుపై లాక్కెళ్లిన పోలీసులు

చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్ రేప్‌ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చిత్తూరు నగరంలోని నడి రోడ్డుపై నడిపించుకుంటూ నిందితులను కోర్టుకు పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని మురకంబుట్ట నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై ముగ్గురు యువకులు దాడి చేసి.. బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.

ప్రముఖ నవలా రచయిత ’లల్లాదేవి’ కన్నుమూత

’లల్లాదేవి’ పేరుతో పలు కథలు, నవలలు రాసిన పరుచూరి నారాయణాచార్యులు (80) శుక్రవారం తెల్లవారు ఝామున కన్నుమూశారు. 1980 దశకంలో తెలుగు సాహితీ రంగంలో సుప్రసిద్ధులైన రచయితల్లో లల్లాదేవి కూడా ఒకరు. ఆయన రాసిన పలు నవలలు ముందు సీరియల్స్‌గా వచ్చాయి. చారిత్రక, జానపద, సాంఘిక రచనలు చేయడంతో ఆయన దిట్ట. తెలుగు సినిమాలకు కూడా రచయితగా ఆయన పనిచేశారు. ‘శ్వేతనాగు’. ఆయన రాసిన ఈ సంచలన నవల ఆధారంగానే దివంగత నటి సౌందర్య 100వ చిత్రం […]

రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు వాడకండి.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు

మధ్యప్రదేశ్‌ చింద్వారా జిల్లాలో సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి 20 వ తేదీ మధ్య దాదాపు 15 రోజుల్లో కిడ్నీ వైఫల్యం కారణంగా 9 మంది మరణించారు. రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లాలో కూడా ఇలాంటి మరణాలే నమోదయ్యాయి. అయితే వారిలో ఐదుగురు Coldref, మరొకరు Nextro Syrup తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చిన్నారులకు దగ్గు మందును పరిమితంగా వాడాలని డీజీహెచ్‌ఏ ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల్లో దగ్గు మెడిసిన్‌ వాడకపోయినా వాటంతట అదే తగ్గతుందని […]

ఐబొమ్మ వార్నింగ్: వాస్తవం ఏంటి?

సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన “ఐబొమ్మ వెబ్‌సైట్ తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది” అన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఈ సమాచారం అసత్యమని, ప్రజలు నమ్మరాదని సూచించింది.ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, సోషల్ మీడియాలో పంచుకుంటున్న స్క్రీన్‌షాట్‌లు 2023 నాటివి. అంతేకాకుండా, ఆ హెచ్చరికలు పోలీసులకు కాకుండా సినిమా పరిశ్రమను ఉద్దేశించినవి మాత్రమేనని స్పష్టం చేసింది. తెలంగాణ పోలీసులకు ఐబొమ్మ నుంచి ఎలాంటి బెదిరింపులు అందలేదని అధికారికంగా తెలిపింది.

ఫ్రెండ్‌ను కాల్చి చంపి.. సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌..

స్నేహితుడిని కాల్చి చంపి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగు చూసింది.ఇది కాస్తా వైరల్‌గా మారి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వైరల్‌ అవుతున్న వీడియోలో అదిల్‌ అనే యువకుడిపై ఒక యువకుడు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. అందుకు సంబంధించిన దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డ్ చేసుకొని ఆ తర్వాత ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో క్షణాల్లో […]

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో 21 అంశాల మీద మంత్రివర్గం చర్చించింది. అనంతరం పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌ (లిఫ్ట్‌) పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు సంబంధించి పలు పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.15000 ఆర్థిక సాయం,కారవాన్‌ పర్యటకానికి, అమృత్‌ పథకం 2.0 పనులకు, […]

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల – ఫిబ్రవరి నుంచే

ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ఇం టర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE) 2026 షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసారి ఫిబ్రవరి నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. థియరీ పరీక్షలు 23 ఫిబ్రవరి 2026 నుంచి 24 మార్చి 2026 వరకు జరుగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ మార్పులతో విద్యార్థులు CBSEతో సమానంగా సిలబస్ పూర్తి చేసి, ఏప్రిల్ నుంచే కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభం చేయవచ్చు.

కరూర్‌ తొక్కిసలాట ఘటన.. మద్రాస్‌ హైకోర్టులో టీవీకే పార్టీకి చుక్కెదురు

మద్రాస్‌ హైకోర్టు లో టీవీకే పార్టీ కి చుక్కెదురైంది. కరూర్‌ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ నటుడు విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీ వేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌పై శుక్రవారం మదురై బెంచ్‌ విచారణ జరిపింది. ఈ సందర్భంగా విజయ్‌ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కరూర్‌ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది. ఈ సందర్భంగా […]

ఏపీలో భారీ వర్షాలు, వరదలు.. రూ.4లక్షల పరిహారం ప్రకటించిన సీఎం

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిస్థితులను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు అధికారులు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON