loader

చివరికి గూగుల్‌లో కూడా లే ఆఫ్స్‌! AI కారణంగా

గూగుల్ క్లౌడ్ డివిజన్‌లో 100 మందికి పైగా డిజైన్ ఉద్యోగులను తొలగించింది. ఏఐ రంగంలో పెట్టుబడులను పెంచుతూ, వ్యయాలను తగ్గించుకునే పునర్నిర్మాణంలో భాగంగా ఈ కోతలు జరిగాయి. ఇది ఐటీ రంగంలో విస్తృతంగా కొనసాగుతున్న లేఆఫ్స్ ధోరణిని, ఏఐ సాంకేతికత వల్ల ఉద్యోగ భద్రతపై పెరుగుతున్న ఆందోళనను ప్రతిబింబిస్తుంది. కొన్ని క్లౌడ్ డిజైన్ బృందాలు దాదాపు సగానికి తగ్గించబడ్డాయని, కొంతమంది ప్రభావిత ఉద్యోగులకు Googleలో ప్రత్యామ్నాయ జాబ్‌లు వేతికేందుకు డిసెంబర్ ప్రారంభం వరకు సమయం ఇచ్చింది కంపెనీ.

తీరం దాటిన వాయుగుండం.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సుమారు సాయంత్రం5గంటల సమయంలో గోపాల్‌పూర్ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6గంటల్లో గంటకు 17కి.మీ వేగంతో కదిలిందని చెప్పింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయంకి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా.. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల […]

ఏపీపై మరో కర్ణాటక మంత్రి సెటైర్లు

మాధ్యూఫిలిప్ అనేవ్యక్తి బెంగళూరు నార్త్ సైడ్ ఎక్కువ ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉందని అన్నారు. దీనికి లోకేష్ స్పందించారు. బెంగళూరు నార్త్ సైడ్ కు సమీపంలోనే అనంతపురం ఉంటుందని .. పెట్టుబడులకు ఆహ్వానించారు. ఇదే ప్రియాంక్ ఖర్గేకు కోపం తెప్పించింది. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఏపీని కించపరుస్తూ ఓ ట్వీట్ పెట్టారు. బెంగళూరు ఆర్థిక ప్రగతి GDP 8.5% వృద్ధి, ఆస్తి మార్కెట్ 5% పెరుగుదల ఉందని.. . ఆంధ్రప్రదేశ్‌ను దెబ్బతిన్న ప్రాణులు బలమైనవాటి […]

ఉగ్రవాదం అనే రావణుడిపై మానవత్వం విజయానికి అది ప్రతీక : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దేశమంతటా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ లో శ్రీధార్మిక్‌ లీల కమిటీ ఆధ్వర్యంలో రామ్‌లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముర్ము రామబాణం ఎక్కుపెట్టగా.. రావణ దహనం నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సింధూర్‌ ఉగ్రవాదం అనే రావణుడిపై మానవత్వం సాధించిన విజయానికి ప్రతీక అన్నారు. దేశ రక్షణ కోసం పాటుపడుతున్న భారత సైనికులకు ఆమె దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

దుర్గామాత నిమజ్జనంలో అపశృతి.. పది మంది మృతి

మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత నిమజ్జనంలో అపశృతి జరిగింది. గురువారం ఖండ్వా జిల్లాలో దుర్గామాతను నిమజ్జనం కోసం తీసుకెళుతుండగా ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. నీటిలోకి వెళ్లిన తర్వాత ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ట్రాలీ కింద చిక్కి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 8 మంది బాలికలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

భారత్‌లో ప్రజాస్వామ్యంపై హోల్‌సేల్ దాడి: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. దక్షిణ అమెరికా దేశం కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో మాట్లాడిన ఆయన ‘ప్రస్తుతం భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడే దేశానికి అతి పెద్ద ముప్పు. భారత్ అంటే వివిధ సంస్కృతులు, మతాలు, భావాల సమాగమం. వీటి మధ్య చర్చకు చోటు ఉండాలి. ఇది ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యంపై హోల్‌సేల్‌గా దాడి జరుగుతోంది. అది పెద్ద ముప్పు’ అని అన్నారు.

ఇగ్నో ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు.. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మరో ఛాన్స్

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) జూలై 2025 సెషన్‌లో కొత్తగా ప్రవేశం తీసుకోవాలనుకునే విద్యార్థులకు మరోసారి శుభవార్తను అందించింది. ఇగ్నో ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం, ఆన్‌లైన్ దూరవిద్య (ODL) మరియు ఆన్‌లైన్ మోడ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం గడువును మళ్లీ పొడిగించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు ఇప్పుడు అక్టోబర్ 15, 2025 వరకు తమ అప్లికేషన్లను సమర్పించే అవకాశం పొందనున్నారు.

విజయవాడలో ఖాదీ సంత కార్యక్రమం.. ముఖ్య అథితిగా హాజరైన సీఎం చంద్రబాబు

విజయవాడలోని యస్.యస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఖాధీ సంత కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ఖాధీ సంతలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి, అక్కడ ఉన్న చేతి వృత్తుల వారితో మాట్లాడి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వదేశీ సంత ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారికి […]

‘మన శంకరవరప్రసాద్ గారు’ సర్ ప్రైజ్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం నుండి దసరా కానుకగా మొదటి సింగిల్ ‘మీసాల పిల్ల’ ప్రోమో విడుదలైంది. చిరంజీవి నయనతారను టీజ్ చేసే సందర్భంలో వచ్చే ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఇప్పటికే రిలీజైన మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్, ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దసరా స్పెషల్ గా లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్ […]

చార్మినార్ నీడలో గంజాయి బ్యాచ్ ఆగడాలు.. అడ్డోస్తే దాడులు..

ైదరాబాద్‌లో గంజాయి వినియోగం పెరిగిపోతోంది. ముఖ్యంగా పాతబస్తీ, చార్మినార్ ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రమవుతోంది. ఈ ప్రాంతాలలో గంజాయి బ్యాచ్‌లు విచ్చలవిడిగా తిరుగుతూ అరాచకం సృష్టిస్తున్నారు. స్థానిక ప్రజలతో పాటు వ్యాపారులను బెదిరిస్తూ.. అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ.. రెచ్చిపోతున్నారు. ఈ బ్యాచ్‌లు తమకు మామూలు డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేయడం, పదేపదే బెదిరించడం, రోజూ వచ్చి వసూళ్లకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది.  పలు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని.. వసూళ్ల కోసం గుంపులుగా కూర్చుంటున్నారు. దీంతో పర్యాటకులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON