కెసిఆర్ దసరా శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలతో పాటు, దేవీ శరన్నవరాత్రుల దుర్గమ్మ పూజల పర్వదినాలకు కొనసాగింపుగా.. విజయ దశమిగా జరుపుకునే దసరా పండుగకు తెలంగాణ ప్రజా జీవనంలో ప్రత్యేక స్థానం ఉన్నదని కేసీఆర్ అన్నారు.