loader

ప్రోకబడ్డి 12వ సీజన్‌ విన్నర్‌గా దబాంగ్ ఢిల్లీ..

ప్రోకబడ్డీ 2025 టైటిల్‌ను దక్కించుకుంది దబాంగ్‌ ఢిల్లీ, శుక్రవారం ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌పై రెండు పాయింట్ల తేడాతో విక్టరీ సాధించి రెండోసారి ప్రోకబడ్డీ చాంపియన్ గా నిలిచింది. నువ్వా నేనా అన్నట్టు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 30-28 పాయింట్ల తేడాతో పుణేరి పల్టాన్‌ను ఢిల్లీ ఓడించింది. టైటిల్‌ను నెగ్గేందుకు చివరి వరకు పోరాడి ఓడిన పుణేరి పల్టాన్ జట్టు ర‌న్నర‌ప్ గా నిలిచింది.

చెస్ దిగ్గజానికి అరుదైన గౌరవం.. వరల్డ్ కప్ చెస్ ఇకపై ఆనంద్ కప్..!

భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు అతిపెద్ద గౌరవం లభించింది. మనదేశపు తొలి గ్రాండ్‌మాస్టర్ అయిన ఆనంద్‌ పేరుతో ట్రోఫీని నిర్వహించాలని ఫిడే నిర్ణయించింది. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చెస్ కప్ టోర్నీకి ఆనంద్ పేరు పెట్టింది. చదరంగంలో ఆయన కృషి, సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవం కల్పిస్తున్నట్టు భారత చెస్ సమాఖ్య అధ్యక్షుడు నితిన్ నారంగ్ వెల్లడించారు. పురాతన ఆటలో ఒకటైన చదరంగం వైభవాన్ని ఈ ట్రోఫీ ప్రతిబింబిస్తుంది అని వెల్లడించారు.

శనివారం లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు దంపతులు

మరోసారి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. శనివారం రాత్రి సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ వ్యక్తిగత పర్యటనకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. అయితే ఇటీవలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ 2025కు సీఎం సతీమణి నారా భువనేశ్వరి ఎంపికయ్యారు. ఈ పర్యటనలో భాగంగా నవంబర్ 4వ తేదీన జరిగే అవార్డుల కార్యక్రమంలో పాల్గొనిఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్‌లో హెరిటేజ్ ఫుడ్స్ గోల్డెన్ పీకాక్ అవార్డును ఆమె అందుకోనున్నారు.

బీఆర్ఎస్ దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి

వెంగళరావు నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన రోడ్‌షోలో.. ఆయన బీఆర్‌ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. పీజేఆర్. ఆయన అకాల మరణానంతరం పీజేఆర్ కుటుంబంపై పోటీకి అభ్యర్థిని నిలబెట్టి.. ఉప ఎన్నికల్లో దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ఉన్న సంబంధాన్ని ‘ఫెవీకాల్ బంధం’గా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. మన తరపున పోరాడే నాయకుడిని గెలిపించకపోతే అది చారిత్రక తప్పిదమే అవుతుంద అని ఓటర్లకు హితవు పలికారు. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని […]

ఘనంగా అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం..

కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అల్లు శిరీష్, నయనిక ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. నయనిక రెడ్డి హైదరాబాద్ కి చెందిన అమ్మాయే. ఆమె బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరికి చాలా రోజులనుంచి పరిచయం ఉండడం, అది ప్రేమగా మారడం జరిగింది. ఈ వేడుకకి అల్లు ఫ్యామిలీతో పాటు.. చిరంజీవి సురేఖ దంపతులు, రాంచరణ్ ఉపాసన దంపతులు, నాగబాబు పద్మజ దంపతులు, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి, […]

క్రికెట్‌లోనే కాదు రాజకీయాల్లోనూ ఫిక్సరే: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ క్రికెట్‌లోనే కాదు రాజకీయాల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఫిక్సరేనని బజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అజహరుద్దీన్‌ను భారత దేశ క్రికెట్ కెప్టెన్‌గా చేస్తే, ఆయన దేశం కోసం కాకుండా డబ్బుల కోసం కక్కుర్తితో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌కు మైనారిటీ ఓట్లు మాత్రమే కావాలి కానీ వారి బాగోగులు పట్టించుకోదని   రెండేళ్ళుగా మంత్రివర్గంలోకి మైనారిటీ నాయకునికి ప్రాతినిథ్యం ఎందుకు […]

ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు

కర్నూలు జిల్లా చిన్నటేకురు గ్రామ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై అసత్య ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సీవీ రెడ్డి, ఆరే శ్యామల, 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత వైసీపీ నేతలు, సోషల్ మీడియా ద్వారా ‘బెల్ట్ షాపుల్లో విక్రయించే కల్తీ మద్యం వల్లే ప్రమాదం జరిగింది’ అని ప్రచారం చేశారు. బి. తాండ్రపాడుకు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు కర్నూలు తాలుకా అర్భన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు […]

భారతీయ విలువల గురించి ఏమాత్రం భయపడకుండా మాట్లాడిన సంస్థ ఆర్యసమాజ్‌ : మోదీ

భారతీయ విలువల గురించి ఏమాత్రం భయపడకుండా మాట్లాడిన సంస్థ ఆర్యసమాజ్‌ అని, ఆర్య సమాజ్‌ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి దార్శనికుడని, మహిళల విముక్తి కోసం కృషి చేశారని కొనియాడారు. దిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య సమ్మేళనంలో ప్రధాని పాల్గొన్నారు. ఆర్యసమాజ్‌ 150వ వార్షికోత్సవం కేవలం సమాజంలోని ఒక భాగానికి లేదా ఒక వర్గానికి సంబంధించిన సందర్భం కాదని, యావత్‌ దేశానికి చెందిన అంశమని ప్రధాని మోదీ చెప్పారు.

4 కోట్ల మంది తెలంగాణ ప్ర‌జ‌ల గోస తీర్చాలి : కేటీఆర్

షేక్‌పేట్ డివిజ‌న్‌లో నిర్వ‌హించిన రోడ్‌షోలో కేటీఆర్,కేటీఆర్,అభ్య‌ర్థి మాగంటి సునీత‌ పాల్గొన్నారు. 4 ల‌క్ష‌ల మంది జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు 4 కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల గోస తీర్చే అవ‌కాశం మీ చేతికి వ‌చ్చింది. మీరు జూబ్లీహిల్స్‌లో గ‌ట్టి తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జ‌ప్తు చేస్తే క‌చ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంది. కాంగ్రెస్ డిపాజిట్ గ‌ల్లంతు కావాలి. పెన్ష‌న్లు, తులం బంగారం, స్కూటీలు, 2500 రావాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాల‌ని […]

మొంథా తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రాథమిక నివేదిక

మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా నష్టం సంభవించిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. నివేదిక ప్రకారం, 17 శాఖలు, రంగాలకు సంబంధించిన మొత్తం నష్టం రూ.5,244 కోట్లుగా అంచనా చేశారు. మొత్తం 249 మండలాల పరిధిలోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలు తుపానుతో ప్రభావితమయ్యాయి. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.  4,794 కి.మీ. ఆర్ అండ్ బీ రహదారులు, 311 కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON