loader

ఐఐటీ హైదరాబాద్‌తో ఆటా ఒప్పందం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ IIT Hyderabad తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంజినీరింగ్‌లో దేశంలోనే 7వ ర్యాంక్, ఆవిష్కరణల్లో 6వ ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్‌తో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలుగు డయాస్పోరాకు చెందిన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం. ఇటీవల వాషింగ్టన్ డీసీ లో జరిగిన కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ […]

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ..

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చించినట్లు సమాచారం. ఏపీలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. సమారు 40 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.

బిజెపితో పొత్తు పెట్టుకునే కంటే.. రాజీనామా చేస్తా: ఒమర్ అబ్దుల్లా

కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను వేగవంతం చేయడానికి బిజెపితో పొత్తు పెట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే శ్రేయస్కరం అని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్ర హాదా కోసం ఎటువంటి రాజకీయ రాజీకి తాను సిద్ధంగా లేనన్నారు. ‘మీరు(ప్రజలు) సిద్ధంగా ఉంటే, నాకు చెప్పండి. ఎందుకంటే దీనికి నేను సిద్ధంగా లేను. ప్రభుత్వంలో బిజెపిని చేర్చుకోవల్సిన అవసరముంటే నా రాజీనామా అంగీకరించండి. ఇక్కడి ఏ ఎంఎల్‌ఎనైనా ముఖ్యమంత్రిని చేసి బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు […]

చెన్నై ఎన్నూర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో ప్రమాదం.. తొమ్మిది మంది కార్మికులు మృతి..!

చెన్నైలోని ఎన్నూర్‌లో థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కార్మికులు ఎన్నూర్‌లో పనులు చేస్తున్నారు. ప్లాంట్‌ ముఖభాగంపై ఏర్పాటు చేసిన స్కాఫోల్డింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో తొమ్మిది మంది కార్మికులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులంతా ఉత్తరాదికి చెందిన కార్మికులే. భారీ ఆర్చ్ నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులు చనిపోగా.. మరికొందరు కార్మికులు గాయాలతో చెన్నైలోని రాయపురంలోని స్టాన్లీ ఆసుపత్రిలో చేర్పించి […]

ఆ పథకం కింద ఏపీకి నిధులు ఇవ్వండి…సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పలు నిధులపై నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని కోరారు. పూర్వోదయ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ వివరణాత్మక ప్రాతినిధ్యాన్ని సమర్పించారు.

తిలక్ వర్మను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి..

ఆసియా కప్ -2025 లో భారత జట్టును విజేతగా నిలపడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ చేరుకున్న క్రికెటర్ తిలక్ వర్మ.. మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను, కోచ్ సలాం బయాష్‌ను ముఖ్యమంత్రి సత్కరించారు. తిలక్ వర్మ తన క్రికెట్ బ్యాట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహూకరించారు.

పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఏపీ: సీఎం చంద్రబాబు

ఢిల్లీలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. భారతదేశంలో పెట్టే పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా ఉంటుందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులిస్తామని తెలిపారు. వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. విశాఖలో నిర్వహించే 30వ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక వేత్తలను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు సీఎం […]

అమన్‌జోత్ హాఫ్ సెంచరీ.. మళ్లీ అడ్డుపడిన వరుణుడు

వరల్డ్ కప్ ఆరంభ పోరులో కష్టాల్లో పడిన భారత జట్టు అనూహ్యంగా పుంజుకుంది. అమన్‌జోత్ కౌర్ (50 నాటౌట్), దీప్తి శర్మ(38 నాటౌట్)లు కీలక భాగస్వామ్యంలో జట్టు స్కోర్ 200 దాటించారు. దాంతో.. టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుండగా మరోసారి ఇన్నింగ్స్‌కు వరుణుడు మరోసారి అడ్డుపడ్డాడు. 40వ ఓవర్ పూర్తికాగానే వర్షం మొదలైంది. దాంతో.. ఇరుజట్ల ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌కు పరుగులు తీశారు.

మంజీర నదిలో దూకి యూట్యూబర్ ఆత్మహత్య..

సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం శివంపేట బ్రిడ్జి వ‌ద్ద యూట్యూబ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఓ యువ‌కుడు శివంపేట బ్రిడ్జిపై మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు కారు ఆపాడు. అనంత‌రం కారులో నుంచి దిగి.. రెయిలింగ్‌పై నుంచి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న మంజీరా న‌దిలోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడిని జోగిపేట ఇందిరా న‌గ‌ర్ కాల‌నీకి చెందిన లోకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఏడాది క్రితం నుంచి క్లింక‌ర అనే యూట్యూబ్ చానెల్‌ను […]

ఎయిర్ బస్ బోర్డుతో మంత్రి లోకేష్ భేటీ

ప్రఖ్యాత కంపెనీ ఎయిర్ బస్ కోసం ఏపీ ముందడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎయిర్ బస్ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. విమానాల తయారీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం రాష్ట్రం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశం అయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON