loader

అక్టోబర్ 6న రూ.15 వేల కోట్లతో టాటా క్యాపిటల్ ఐపీఓ

భారత స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల మార్కెట్ హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇప్పుడు టాటా గ్రూప్ నుంచి భారీ IPO రాబోతుంది. ప్రముఖ NBFC కంపెనీ అయిన టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్లను సేకరించేందుకు IPOను (Tata Capital IPO 2025) ప్రారంభించనుంది. ఈ ఇష్యూ అక్టోబర్ 6-8, 2025 వరకు ఉంటుంది, ఒక్కో షేరుకు ధర రూ.310-326గా నిర్ణయించారు. ఇది భారతదేశ మార్కెట్లో అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తాం: నేపాల్‌ ప్రధాని కర్కి

తమ మధ్యంతర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం సకాలంలోనే సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి కట్టుబడి ఉందని నేపాల్ ప్రధాని సుశీలా కర్కి వెల్లడించారు. నేపాల్‌లో అత్యంత వైభవంగా జరుపుకునే పండగల్లో విజయదశమి ఒకటి. బడాదషైన్ అని ఈ పండగను పిలుస్తారు. ఈ సందర్భంగా ప్రధాని కర్కిల్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ షెడ్యూల్ తేదీకే ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య

గోపీ, ప్రియాంక ఇద్దరూ నరసరావుపేటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నారు. గత కొన్నేళ్లు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఇరువురు ఇళ్లలో తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వాళ్లు ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు. ఇక వీళ్లు ఎప్పటికీ తమ పెళ్లి ఒప్పుకోరని నిర్ణయించుకున్న ఇద్దరూ ఈ నెల 5వ తేదీన రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాలు వాళ్ల పెళ్లిని నిరాకరించాయి దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరూ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు.

టిజిఎస్‌ఆర్టీసి కొత్త ఎండిగా నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్టీసి) నూతన వైస్ చైర్మన్, ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి వై.నాగిరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మధ్య ప్రభుత్వం చేపట్టిన ఐపిఎస్‌ల బదిలీల్లో ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా సేవలందిస్తున్న సజ్జనార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నాగిరెడ్డిని ప్రభుత్వం నూతన ఆర్‌టిసి ఎండిగా నియమించింది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డీజీగా నాగిరెడ్డి పని చేస్తున్నారు.

OG టికెట్ ధరలను వెంటనే తగ్గించండి.. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరలను థియేటర్లు, మల్టీప్లెక్స్‌ లు తక్షణమే తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సింగిల్‌ స్క్రీన్స్‌ తో పాటుగా మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా టికెట్‌ ధరల పెంపును తెలంగాణ హైకోర్టును సస్పెండ్‌ చేయడాన్ని, ఆ తర్వాత పరిణామాలను జీవోలో […]

మోదీ సాబ్!‌ మా ఏరియాలో జీఎస్టీ తగ్గించలేదు! ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు !

వస్తువులు & సేవల పన్ను (GST)లో సంస్కరణలు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. “GST సంస్కరణల తర్వాత నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్(NCH)కి దాదాపు 3 వేల ఫిర్యాదులు అందాయి. వీటిపై చర్యలు తీసుకోవడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ కి ఫిర్యాదులు పంపిస్తాం.”. ప్రయోజనాన్ని కస్టమర్‌లకు అందించకుండా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. వినియోగదారులను మోసం చేస్తున్నారు,అని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు

బాలయ్యపై 300 చోట్ల ఫిర్యాదు చేయాలని ఫ్యాన్స్ నిర్ణయం.. వారించిన చిరంజీవి

హైదరాబాద్‌లో బ్లడ్‌ బ్యాంక్‌ సమీపంలోని ఓ హోటెల్‌లో మెగా అభిమానుల అత్యవసర సమావేశం నిర్వహించారు. మీటింగ్‌లో ఆంధ్రా, తెలంగాణ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 300 పీఎస్‌లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. విషయం తెలుసుకుని అభిమానుల వారించారు చిరు. అలాంటి పనులు చేయొద్దని అభిమానులకు స్పష్టం చేశారు. చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాల్సి వచ్చిందంటున్నారు. అయితే, తమ పోరాటం మాత్రం ఆగదని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేత మోహన్ స్పష్టం చేశారు.

అక్టోబర్ 9 వరకు గడువు.. GATE-2026

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2026కి అప్లై చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. గేట్ 2026 రిజిస్ట్రేషన్ గడువును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి పొడిగించింది. అభ్యర్థులు ఎలాంటి లేటు ఫీజు లేకుండా 2025 అక్టోబర్ 6 వరకు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ఈ గడువు దాటితే, 2025 అక్టోబర్ 9 వరకు లేట్ ఫీజుతో అప్లై చేసుకోవచ్చు. గేట్ 2026 ఎగ్జామ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, […]

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు దుర్గగుడి అధికారులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు పండితులు శాస్త్రోక్తంగా వేదాశీర్వచనం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.

ఢిల్లీ బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన మోదీ

బీజేపీ ఢిల్లీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. దీన్‌ దయాళ్ మార్గ్‌లో కొత్తగా నిర్మించిన ఢిల్లీ బీజేపీ కార్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు ప్రారంభించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఈ కొత్త కార్యాలయం ఏర్పాటు కాగా, ఇప్పటి వరకూ అద్దెకుండటం, తాత్కాలిక కార్యాలయాల్లో పని చేసిన బీజేపీ కార్యాలయానికి ఇప్పుడు సొంత కార్యాలయం రావడం, అదికూడా నవరాత్రి రోజుల్లో ప్రారంభం కావడం పార్టీ శ్రేణుల్లో సంబరాలు నింపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON