బతుకమ్మ కుంట పేరు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ప్రాంతంలో దశాబ్దాల పోరాటానికి, సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బతుకమ్మ కుంట పూర్వవైభవం సంతరించుకుంది. అత్యంత కీలకమైన పరిణామంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కుంటకు ‘వి. హనుమంతరావు బతుకమ్మ కుంట’అని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. దాదాపు 35 సంవత్సరాల పాటు కబ్జాదారుల నుండి ఈ కుంటను కాపాడటానికి అవిశ్రాంతంగా పోరాటం చేసిన వి. హనుమంతరావు కు దక్కిన గౌరవం ఇది