loader

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అధికారులు తెలిపిన ప్రకారం ఈ రోజు ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో రద్దీ పెరిగి, సాయంత్రం వరకు 90,002 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసేంత వరకు భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు […]

విజయ్ ర్యాలీలో 33 మంది మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ !

తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో పెను విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఇప్పటివరకు 33 మందికి పైగా మరణించగా, 62 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర సంఘటన “తీవ్ర విచారకరం” అని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం పవన్ […]

విజయ్ సభలో తొక్కిసలాట, 29 మంది మృతి! మరింత పెరిగే అవకాశం

తమిళనాడు కరూర్‌లో తీవ్ర విషాదం  టీవీకే విజయ్‌ కార్నర్‌ మీటింగ్‌లో తొక్కిసలాట 30 మంది మృతి, మరో 50 మంది పరిస్థితి విషమం కరూర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులు ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి తక్షణ సహాయచర్యలకు ఆదేశించిన సీఎం రేపు బాధితకుటుంబాలను పరామర్శించనున్న సీఎం స్టాలిన్.

రేపే గ్రూప్ తెలంగాణ 2 ఫైనల్ ఫలితాలు?

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో.. టీజీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన మొత్తం 783 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు కమిషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రేమించాలని యువకుడి వేధింపులు..ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా పెద్దపేట గ్రామంలో బొడ్డు ఐశ్వరి (17) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అక్కడికి ఆమెను కొండాపూర్ గ్రామానికి చెందిన కొండ్లపల్లి అజయ్ తనను ప్రేమించాలని బలవంతం చేసి వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తనను ప్రేమించకపోతే విషం తాగి చనిపోమని ఆమెను కొట్టాడు. జరిగిన విషయం గురించి ఆ విద్యార్థిని తన ఇంట్లో చెప్పి బాధపడింది. అవమానం భరించలేక గడ్డి మందు సేవించింది,చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి […]

విజయ్ ర్యాలీలో తొక్కిసలాట..

అనుకున్న సమయానికి ఆరు గంటలు ఆలస్యంగా విజయ్ చేరుకోవడంతో ఆయనను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. విజయ్‌ను చూసేందుకు ఒక భవంతి పిట్టగోడపై పలువురు చేరడంతో పిట్టగోడ కుప్పకూలిందని, దీంతో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. దీంతో కొంత గందరగోళం, తొక్కసలాట జరిగిందని తెలుస్తోంది. దీంతో విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపి వేశారు. వేదికపై నుంచి ‘పోలీస్ ప్లీజ్ హెల్ప్’అంటూ విజ్ఞప్తి చేశారు.

విజయ్ దళపతి కరూర్ ర్యాలీలో తొక్కిసలాట.. 10 మంది దుర్మరణం

తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ అధినేత చేపట్టిన ర్యాలీలో భారీ తొక్కిసలాట సంభవించింది. ఈ క్రమంలో భారీగా విజయ్ దళపతిని చూసేందుకు అభిమానులు భారీగా రావడంతో తోపులాట సంభవించింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందగా మరో 30 మంది ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలంలోకి వెళ్లేందుకు కూడా చాలా సమయం పడుతుంది. దీంతో పెద్ద గందర గోళ వాతావరణం ఏర్పడింది.

కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ వ్యాఖ్యలు అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగింపు

వైసీపీ ప్రభుత్వంలో సినిమా నటులకు అవమానం జరిగిందని డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదానికి మూలమైన కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలను రికార్డుల నుంచి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తొలగించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు..

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా, గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ జీవో (జీఓ.ఎంఎస్. నెం.09/2025) జారీ చేయడం చట్టవిరుద్ధం అని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆదేశించిన ధర్మాసనం, అవసరమైతే ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా మెరిట్ ఆధారంగా విచారిస్తామని హైకోర్టు హెచ్చరించింది.

సభలోనే కామినేని క్షమాపణ చెప్పాలి – YCP

కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలకు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ముఖ్యంగా, జగన్ సినీనటుల పట్ల చూపిన గౌరవాన్ని చిరంజీవి వంటి ప్రముఖులు ఇప్పటికే బహిరంగంగా వెల్లడించారని వారు గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్, విరూపాక్షి, శివప్రసాద్ రెడ్డి తదితరులు అసెంబ్లీలోనే కామినేని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON