loader

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయ కమిటీ నియామకం

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయ కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దుర్గ గుడి ఆలయ బోర్డు సభ్యులుగా 16 మందిని నియమిస్తూ కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణని నియమించింది ఏపీ ప్రభుత్వం.

ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ.. హైద‌రాబాద్‌లో ఇండ్లు ఖాళీ చేస్తున్న ప్ర‌జ‌లు..

ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో పాటు జంట జ‌లాశ‌యాలు ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్ గేట్లు ఎత్త‌డంతో మూసీ న‌ది ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తుంది. భ‌యంక‌ర‌మైన రీతిలో న‌ది ఉధృతంగా ఉర‌క‌లేస్తోంది. దీంతో మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని ప‌లు కాల‌నీల్లోకి వ‌ర‌ద నీరు చేరింది. ముఖ్యంగా చాద‌ర్‌ఘాట్ ప్రాంతంలోని మూసాన‌గ‌ర్, శంక‌ర్ న‌గ‌ర్ ప్రాంతాల్లో ఇండ్ల‌ను మూసీ వ‌ర‌ద ముంచెత్తింది. దీంతో స్థానికుల‌ను రెవెన్యూ అధికారులు, పోలీసులు అప్ర‌మ‌త్తం చేశారు. పోలీసుల హెచ్చరిక‌ల నేప‌థ్యంలో స్థానికులు క‌ట్టుబ‌ట్ట‌ల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

5 నుంచి EAPCET బైపిసి కౌన్సెలింగ్

ఇంటర్మీడియట్లో బైపీసీ చదివిన విద్యార్థులు EAPCET-2025 ద్వారా బి ఫార్మసీ, పార్మా-డి, బైయో టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి కౌన్సెలింగ్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబం ధించిన షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన గురువారం ప్రకటించారు. విద్యార్థులు ఆన్లైన్లో తమ వివరాలను తెలుపుతూ స్లాట్ బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 5 నుంచి 8 వరకు అవకాశం కల్పించారు.

తెలంగాణ‌కు రెడ్ అల‌ర్ట్.. రాగల 24 గంట‌ల్లో అతి భారీ వ‌ర్షాలు..!

వాయువ్య మ‌ధ్య బంగాళాఖాతం స‌మీపంలో వాయుగుండం ఏర్ప‌డింది. పూరీ తీరానికి దక్షిణ ఆగ్నేయంగా 60 కిలోమీట‌ర్ల దూరంలో, గోపాల్‌పూర్‌కు తూర్పు దిశ‌గా వాయుగుండం కేంద్రీకృత‌మైంది. వాయుగుండం ప్ర‌భావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. తెలంగాణ‌లో రాగ‌ల 24 గంట‌ల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో అన్ని జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 సెం.మీ.కు పైగా వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే […]

కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన మాగంటి సునీత

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ను ప్రకటించడంపై పార్టీ అధినేత కేసీఆర్ గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “నా మీద విశ్వాసం ఉంచి ఈ బాధ్యత ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఞతలు. జూబ్లీహిల్స్ ప్రజల మద్దతు, ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు.

ముదిరిన వివాదం.. బరేలిలో ఘర్షణలు, పోలీసుల లాఠీచార్జి

కొద్దివారాల క్రితం మొదలైన ‘ఐ లవ్ మహమ్మద్’ పోస్టర్ వివాదం ఉత్తరప్రదేశ్ లోని  బరేలిలో ఒక్కసారిగా భగ్గుమంది. ‘ఐ లవ్ మహమ్మద్’ ప్రచారానికి మద్దతుగా ప్రదర్శన నిర్వహించేందుకు స్థానిక మౌలానా, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజా పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రార్థనలు ముగియగానే ఆ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున బరేలిలోని ఇస్లామిక్ గ్రౌండ్ సమీపంలో గుమిగూడారు. కొందరు అభ్యంతరకరమైన నినాదాలు చేయడంతో పాటు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు […]

ఇటు విరాట్, రోహిత్.. అటు రిజ్వాన్, ఇబ్రహిం.. దిగ్గజాలకే దడ పుట్టించిన అభిషేక్..

ఆసియా కప్‌లో టీమిండియా డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక భారీ రికార్డును సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతోన్న సూపర్ ఫోర్ మ్యాచ్‌లో 34 పరుగులు చేసిన వెంటనే అభిషేక్ శర్మ, టీ20 ఆసియా కప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఘనత సాధించడానికి అతను పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులను అధిగమించాడు. అభిషేక్ ఇప్పటివరకు టోర్నమెంట్‌లో 282 పరుగులు చేశాడు.

ఒక్క ఉత్తరంతో దుర్మార్గుల నోరు మూయించినందుకు చిరంజీవికి అభినందనలు

మాజీ మంత్రి పెర్ని నాని, చిరంజీవి రాసిన ఒక లేఖను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. చిరంజీవి లేఖ దుర్మార్గుల నోరు మూయించిందని నాని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తరం ద్వారా తప్పుడు మాటలు మాట్లాడే వారిని, నిందలు వేసేవారిని చిరంజీవి నిశ్శబ్దం చేశారని పెర్ని నాని అన్నారు. కామినేని శ్రీనివాసు, బాలకృష్ణ వంటి వారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇటువంటి ఆరోపణలు కొనసాగుతున్నాయని పెర్ని నాని పేర్కొన్నారు.

సింగరేణి, కోల్ ఇండియా కార్మికులకు గుడ్ న్యూస్…

కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లోని కార్మికులకు పనితీరు ఆధారిత రివార్డు అందజేయనున్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కార్మికుల నిరంతర ప్రయత్నాలు, కృషికి గుర్తింపు, ప్రశంస, కృతజ్ఞతగా… కోల్ ఇండియా , దాని అనుబంధ సంస్థలకు చెందిన 2.09 లక్షల మంది కార్మికులకు, అలాగే సింగరేణి కాలరీస్‌లోని 38,000 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1,03,000 చొప్పున అందించబడుతుందని చెప్పారు.

హైకోర్టు కోర్టు ఉత్వర్వులపై డీవీవీ హేళనకరమైన పోస్ట్..

ఓజీ సినిమా టికెట్ రేట్లుపెంపుని సవాల్ చేస్తూ పిటీషన్ వేసిన పిటీషనర్‌ను హేళన చేస్తూ పోస్ట్ పెట్టింది డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.ఇది పిటిషనర్ బార్లా మల్లేష్ యాదవ్‌కు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి మేము అతనికి ఏదైనా నిజాం థియేటర్‌లో టికెట్‌పై రూ.100 తగ్గింపును అందిస్తున్నాము. మల్లేష్ గారూ.. మా అభిమానులు ఆస్వాదించినట్లే మీరు ఓజీ సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ లవ్ సింబల్ ❤️ ఎమోజీని షేర్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON