loader

జగన్‌ను వ్యక్తిగతంగా సీబీఐ కోర్టు విచారణకు ఆహ్వానం

తన పిల్లల ఉన్నత చదువుల కోసం యూరప్ వెళ్లేందుకు జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ నెలలో 1 నుంచి 30 వరకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు యూరప్ పర్యటనకు ఆమోదం ఇచ్చింది. పర్యటన పూర్తయ్యాక, జగన్ వ్యక్తిగతంగా సీబీఐ కోర్ట్ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. నవంబర్ 1 నుంచి 14 మధ్యలో జగన్ కోర్ట్‌ ముందు హాజరై తన పరిస్థులను […]

సాహితీ ఇన్ ఫ్రా కేసులో మరో కీలక మలుపు

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. నటుడు జగపతిబాబు ఇడి విచారణకు హాజర య్యారు. భారీ మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్‌ఫ్రా కేసులో భాగంగా, అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన ఇడి కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆ సంస్థ ప్రకటనల్లో నటించినందుకుగాను ఆయనకు అందిన పారితోషికం, చెల్లింపుల మార్గాలపై వివరాలు సేకరించినట్టు తెలి సింది.

బాలకృష్ణపై అంబటి రాంబాబు సంచలన పోస్ట్.. జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని అసెంబ్లీ వేదికగా సైకో అని..  నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. “శ్రీ శ్రీ శ్రీ నందమూరి బాలకృష్ణ.. ప్రపంచంలోనే అతి పెద్ద సైకో..కావాలంటే సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తా!” అంటూ అంబటి రాంబాబు  ఎక్స్ పోస్ట్‌ను వైసీపీ శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నారు. దయచేసి ఆ సర్టిఫికెట్ ఏంటో అప్ లోడ్ చేయండి.. ఎవరు సైకోనో తెలుసు అంటూ అంబటి రాంబాబు పోస్ట్‌కు తెలుగుదేశం […]

పదవిని వదిలేస్తా : జెలెన్‌స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒక సంచలన నిర్ణయం వెల్లడించారు. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాత తాను పదవిని వదులుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్ష పదవిని కొనసాగించడం తన లక్ష్యం కాదని చెప్పారు. ప్రజలకు శాంతిని తీసుకురావడమే తన ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటే పార్లమెంటు చర్చించాలని కూడా కోరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

ఓటుకు నోటు కేసు వేళ రేవంత్ సూసైడ్ చేసుకుంటానన్నాడు : A4 ముద్దాయి సంచలనం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయిగా ఉన్నా జెరూసలెం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఆనాడే తాను సరెండర్ అయి అన్ని విషయాలు బైటపెడదామని అనుకున్నానని… కానీ రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆగిపోయానని మత్తయ్య తెలిపారు. స్వయంగా రేవంత్ భార్య గీతారెడ్డి తనకు ఫోన్ చేసి సరెండర్ కావద్దని… అయితే తన భర్త ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నాడని చెప్పినట్లు మత్తయ్య వెల్లడించారు.

మెగా డీఎస్సీని మెగా హిట్ చేశాం – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ విజయాన్ని “మెగా హిట్”గా అభివర్ణించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “సూపర్ సిక్స్ హామీల్లో మొదటిది మెగా డీఎస్సీ. నేను సీఎంగా చేసిన మొదటి సంతకం ఇదిపైనే. ఉపాధ్యాయ నియామకాలు జరిగి, వేలాది మంది యువతకు ఉపాధి లభించడం గర్వకారణం. ఈ నిర్ణయాన్ని విజయవంతంగా అమలు చేసిన లోకేశ్ టీంకు అభినందనలు” అని అన్నారు. నియామకాల ప్రక్రియలో ఎదురైన ప్రతిబంధకాలను అధిగమించడం ద్వారా ప్రభుత్వం విద్యారంగంపై తన కట్టుబాటును […]

దక్షిణ కొరియా లో విశాఖ LG పాలిమర్స్ బాధితుల ఆందోళన

2020 మే 7న విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ లో సంభవించిన స్టైరిన్ గ్యాస్ లీక్ ప్రమాదం 26 మంది ప్రాణాలను బలిగొన్నది. ఈ ప్రమాదంలో గాయపడిన వందలాది మంది ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కంపెనీ నుండి ఎటువంటి సహాయం లభించకపోవడంతో, బాధితులు దక్షిణ కొరియాలోని సియోల్ లోని ఎల్జీ హెడ్ క్వార్టర్స్ వద్ద ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ఆందోళనకు మద్దతుగా […]

బాలకృష్ణే పెద్ద సైకో.. మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంది ఆయనే: జూపూడి ప్రభాకర్

బాలక‌ష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌.. బాలకృష్ణకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బాలకృష్ణని మించిన సైకో మరొకరు లేరని.. పైగా ఆయనకే మెంటల్ సర్టిఫికెట్ కూడా ఉందని తెలిపారు. అలాంటి వ్యక్తి మెంటల్ బాలకృష్ణ జగన్‌ని సైకో అంటారా అని ప్రశ్నించారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. అలానే గతంలో బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపిన కేసులో […]

అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన చిరు..

నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. ఓ రోజు మంత్రిగారు నాకు ఫోన్ చేసి “ ముఖ్యమంత్రి గారు ముందు మీతో వన్ టూ వన్ కలుస్తానని చెప్పారు. లంచ్ కి రావాలని చెప్పారంటూ” డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే […]

ఐఏఎస్ చదవాలని చెప్పారు.. నేనే రాజకీయాల్లోకి వచ్చాను..

మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డీఎస్సీ వేదికపై టీచర్లు అడిగిన ప్రశ్నకు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనని ఐఏఎస్ చదవాలని కొందరు చెప్పారని గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో అంత ఓపిక తనకు లేదని చెప్పుకొచ్చారు. తన చదువు అంతంత మాత్రమే అని పేర్కొన్నారు. అందుకే తానే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON