loader

లేహ్–లడఖ్ ఘటనపై కేంద్రం సీరియస్.. హింసకు అతడే కారణం..

లేహ్ లడఖ్‌లో బుధవారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. లేహ్, పరిసర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు, ఆస్తుల ధ్వంసంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పరిస్థితులకు స్థానిక కార్యకర్త నమ్ వాంగ్‌చుక్ ప్రేరేపణే కారణమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయన “అరబ్ స్ప్రింగ్” ఉద్యమం, నేపాల్ జెన్-జెడ్ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ యువతను రెచ్చగొట్టారని ఆరోపణలు వచ్చాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రాజ్యాంగ పరిధిలోనే కఠిన చర్యలు తీసుకుంటామని […]

 ఎలాన్ మస్క్ x కు కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ

కర్ణాటక హైకోర్టు తాజాగా ఒక ముఖ్య తీర్పుతో ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’కు (మునుపటి ట్విటర్) పెద్ద దెబ్బ కొట్టింది.చట్ట విరుద్దమైన కంటెంట్ పోస్ట్ చేసే ఖాతాలను తొలగించకుంటే కార్యకలాపాలను నిలిపివేస్తామని ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఎలాన్ మస్క్‌కు చెందిన మైక్రో బ్లాగింగ్ యాప్ ఎక్స్ (ట్విట్టర్) కార్ప్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు బుధవారం తిరస్కరించింది. సమాచారాన్ని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, ఇందులో మీడియాకు […]

స్వదేశీ పరిజ్ఞానంతో బ్రౌజింగ్ యాప్..: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జోహోకు మారాలనే తన ఉద్దేశ్యాన్ని ప్రకటించారు. డాక్యుమెంట్ యాక్సెస్, స్ప్రెడ్‌షీట్‌లు, ప్రెజెంటేషన్‌ల కోసం తాను స్వదేశీ ఉత్పత్తి జోహోకు మారుతున్నట్లు వివరిస్తూ ఇటీవల ఒక వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం (సెప్టెంబర్ 24) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలను జోహో షో ద్వారా వివరించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌. తాను క్రమంగా స్వదేశీ వెబ్ బ్రౌజర్ జోహోకు మారుతున్నానని తెలిపారు.

ఏపీ విద్యా సంస్కరణలపై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను విజయవాడలో కలుసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా కార్యక్రమాలపై వారు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వినూత్న విద్యా పథకాలకు ప్రాధాన్యతనిస్తున్నదని వారు అభిప్రాయపడ్డారు. “ఆంధ్రప్రదేశ్‌ను FLN సాధనలో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబెడతాం” అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష, సాల్ట్ వంటి పథకాలతో రాష్ట్ర విద్యారంగ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు వెళ్తుందని స్పష్టంచేశారు.

లేహ్‌లో ఆందోళనలు హింసాత్మకం.. నలుగురి మృతి

కేంద్ర ప్రాంతం లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాలని, లద్దాఖ్‌ను భారత రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో బుధవారం భారీ ఎత్తున చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనలను అడ్డుకునేందుకు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన భద్రతాబలగాలకు, ఆందోళన కారులకు మధ్య తలెత్తిన సంఘర్షణలు చివరకు కాల్పులకు దారి తీయడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 70 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బీహార్‌లో ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించిన అసదుద్దీన్

మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీహార్ ఎన్నికల నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. మహాఘట్‌బంధన్ కూటమిలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, తన పార్టీకి ఆరు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని స్పష్టంగా డిమాండ్ చేశారు. ఒవైసీ తన ఎన్నికల ప్రచారాన్ని ‘సీమాంచల్ న్యాయ యాత్ర’ పేరుతో ప్రారంభించారు. యాత్రను బీహార్‌లోని కిషన్‌గంజ్ పట్టణంలో ప్రారంభించిన ఆయన, ప్రజల మధ్య పార్టీ సిద్ధాంతాలను వివరించారు.

తెలుగుతల్లి ఫ్లైఓవర్‌కు.. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా నామకరణం

లోయర్ ట్యాంక్ బండ్ నుండి సెక్రటేరియట్ వరకు కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ కు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం – కార్పొరేషన్‌కు సిఫార్సు చేయాలని జీహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదించింది.నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూం లో జరిగింది.

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మీనలగ్నంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

తిరుమలలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి . బుధవారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలను టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడు, ఈవో అశోక్‌ సింఘాల్‌ ఆధ్వర్యంలో పూజల అనంతరం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు సకల దేవతా మూర్తులను శాస్త్రోక్తంగా ఆహ్వానించే కార్యక్రమమైన గరుడ ధ్వజ పటాన్ని ధ్వజస్తంభం ఎగురవేశారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలు, అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రమని […]

డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తాం…రోజా సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్ అంటూ వై‌సీపీ నేతలు, కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం ప్రతాపం చూపిస్తుందని ఆరోపించారు. రెడ్ బుక్ పేరుతో వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న నారా లోకే‌ష్‌, కూటమి నాయకులకు డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో సిగ్గు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON