loader

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంత‌రం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్రత్యేక పూజ‌లు నిర్వహించి పుట్టమన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు

అస్సాం సంగీత ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన జుబీన్ గార్గ్ మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆయన అంత్యక్రియలకు హాజరైన జనసంద్రం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద అంత్యక్రియల గ్యాదరింగ్‌గా దీనిని గుర్తించారు. మైఖేల్ జాక్సన్, పోప్ జాన్ పాల్ II, క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఇంతటి పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక కళాకారుడి అంతిమ వీడ్కోలు కార్యక్రమానికి హాజరవడం విశేషమని లిమ్కా బుక్ పేర్కొంది.

విద్యార్థినులకు ఏటా రూ.30 వేల స్కాలర్‌షిప్

అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అందిస్తోన్న తెలంగాణలో 15 వేల మంది విద్యార్థినులకు ఏడాదికి రూ.30 వేల స్కాలర్‌షిప్ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పూర్తి చేసి ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, నర్సింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. మొదటి విడత ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రెండో విడత జనవరి 10 నుంచి 31 వరకు,వివరాలకు https://azimpremjifoundation.org లేదా […]

కాళేశ్వరం కమిషన్‌ నివేదికను కొట్టేయండి.. హైకోర్టుకు స్మితా సబర్వాల్‌

కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఏఐఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిషన్ ఇటీవల పూర్తి రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రిపోర్టును సవాల్ చేస్తూ మంగళవారం స్మితా సబర్వాల్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిసి ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.

తిరుమల దేశంలో తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్

తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలో తొలిసారిగా AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ (ICCC)ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో ఏర్పాటు చేసింది. Rs 30 కోట్ల ఖర్చుతో ఎన్.ఆర్.ఐ.ల దాతృత్వంతో ఈ ఆధునిక సదుపాయాన్ని సిద్ధం చేశారు. భక్తులు దర్శనానికి వేచి ఉండే సమయం తగ్గించడం, సౌకర్యవంతం, సురక్షితంగా మార్చడానికి, రియల్-టైమ్ రద్దీ అంచనా, ఫేస్ రికగ్నిషన్, 3D మ్యాప్స్, సైబర్ థ్రెట్ మానిటరింగ్ వంటి AI ఫీచర్లతో ఈ సెంటర్, శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో […]

స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఆ 23 గ్రామాల్లో స్టే..

ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మండలంలోని 23 గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ గ్రామాలు గిరిజన పరిధిలో లేవని పిటిషనర్లు వాదించారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో, హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఈ 23 గ్రామాల్లో ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్

ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారు. గత రెండ్రోజులుగా ఆయన అనారోగ్యంతో ఇబ్బందిపడుతూనే వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. నిన్న కూడా ఆయన జ్వరంతోనే అసెంబ్లీ సమావేశాలకు, అధికారులతో సమీక్షలకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇలా విరామం లేకుండా పనిచేయడంతో రాత్రికి జ్వరం తీవ్రత పెరిగినట్లు సమాచారం. దీంతో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించి వైరల్ ఫీవర్ గా నిర్దారించారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డు నమోదు చేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం వైద్యారోగ్యశాఖపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి వ్యక్తికి 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్‌ రికార్డు నమోదు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.

తెలుగు సినిమాకి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు

71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినీ ప్రముఖులు తమ చిత్రాలతో సత్తా చాటి నేడు రాష్ట్ర చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. భగవంత్ కేసరి చిత్రం టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రం గా ఎంపికైంది. ఈ అవార్డుని డైరెక్టర్ అనిల్ రావిపూడి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. దర్శకుడు సాయి రాజేశ్ “బేబీ” సినిమాకు ఉత్తమ కథా రచయిత విభాగంలో గాయకుడు పీవీఎన్‌ఎస్ రోహిత్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా, “హనుమాన్” చిత్రం అత్యుత్తమ యానిమేషన్ & […]

GST 2 .0 పై కేంద్రానికి ఫిర్యాదుల వెల్లువ!

దేశవ్యాప్తంగా కొత్త GST శ్లాబులు అమలులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులకు తక్షణ ప్రయోజనం అందకపోవడం వివాదంగా మారింది. కొన్ని ప్రముఖ ఇ-కామర్స్ సైట్లు ఉత్పత్తుల ధరల్లో తగ్గింపులను ప్రతిబింబించకపోవడం వల్ల కేంద్రానికి అనేక ఫిర్యాదులు చేరుకున్నాయి. వినియోగదారులు తక్కువ GST చెల్లించినప్పటికీ, ఆ లాభం ధరల్లో కనిపించకపోవడం అసంతృప్తికి దారితీస్తోంది. ఈ ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వం గమనించి ఆరా తీస్తోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి..

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON