loader

జోహోకి మారిన అశ్విని వైష్ణవ్.. స్వదేశీ సాఫ్ట్‌వేర్‌కు ప్రోత్సాహం..

డిజిటల్ ఇండియాలో భాగంగా స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తన అధికారిక పనులకు ఇకపై విదేశీ సాఫ్ట్‌వేర్‌లను కాకుండా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన జోహో ప్లాట్‌ఫామ్‌ను వాడనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియాలో వెల్లడించారు. “నేను జోహోకి మారుతున్నాను – డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్ల కోసం మన స్వదేశీ ప్లాట్‌ఫామ్ ఇది” అని ఆయన తన […]

బండి సంజయ్ కి జగదీష్ రెడ్డి కౌంటర్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్లు ఏ షోరూంలో కొనుగోలు చేశారో.. కెటిఆర్ కూడా అక్కడే కొనుగోలు చేశారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీష్ రెడ్డి చెప్పారు. సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరైనా కొంటారని, వారు ఎక్కడ తెచ్చారో తమకెలా తెలుస్తుందని అన్నారు. తాను కారు అమ్మేస్తా ఎవరైనా కొంటారని చెప్పారు. బండి సంజయ్ హోమ్ మంత్రిగా ఉండి కనిపెట్టింది ఇదేనా..? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఏమైనా వాస్కోడిగామానా లేక కొలంబసా..అంటూ ఎద్దేవా చేశారు.

టిజిపిఎస్‌సి సభ్యులుగా మరో ముగ్గురి నియామకం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కొత్తగా మరో ముగ్గురు సభ్యులు నియమితులయ్యారు. సి.చంద్రకాంత్ రెడ్డి, ఐపిఎస్ అధికారి విశ్వప్రసాద్, ప్రొఫెసర్ ఎల్.బి లక్ష్మీకాంత్ రాథోడ్‌లను టిజిపిఎస్‌సి నూతన సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించి ఆరేళ్ల పాటు లేదా 62 సంవత్సరాల వయస్సు వరకు ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలిపారు. వీరి నియామకం వారు పదవీ బాధ్యతలు స్వీకరించిన […]

సింగరేణి కార్మికులకు బోనస్‌.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్

సింగరేణి కార్మికులకు చెల్లించే బోనస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. దసరా పండుగ వేళ కార్మికులకు తీపి కబురు చెప్పాల్సింది పోయి, చేదు వార్తతో వారిని తీవ్ర నిరాశకు గురిచేశారని మండిపడ్డారు. సంస్థకు వచ్చిన మొత్తం లాభం రూ.6,394 కోట్లను కాకుండా, కేవలం రూ. 2,360 కోట్ల నుంచి మాత్రమే బోనస్ లెక్కించడం దారుణమని అన్నారు. పంచాల్సిన వాటాను తగ్గించి కార్మికులను ప్రభుత్వం […]

‘విజయవాడ ఉత్సవ్’: ప్రారంభించిన మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్

నగర చరిత్రలో మొట్టమొదటి సారిగా గ్రాండ్‌వే లో విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ పండుగను మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రారంభించారు. విజయవాడ ఉత్సవ్ కు సంబంధించి 3 వేల మంది కళాకారులతో అతిపెద్ద కార్నివాల్ అక్టోబర్ రెండో తేదీన ఉండబోతుంది. 11 రోజులపాటు విజయవాడ వైభవాన్ని తెలిపే విధంగా డ్రోన్ షో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. పారా గ్లైడింగ్, హెలిరైడ్, లాంటి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.

ఆ ఓవరాక్షనే వద్దనేది.. హారిస్ రౌఫ్ భార్యకు దిమ్మదిరిగింది !

మ్యాచ్ ఓడిపోయినా తన భర్త చేసిన ప్రదర్శనపై గర్వంగా ఉందని హారిస్ రౌఫ్ భార్య ముస్జా మనూఫ్ కామెంట్స్ చేయడంతో ఈ రచ్చ మరింత ముదిరింది. ఇన్‌స్టాగ్రామ్‌లో “గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం” అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై టీమిండియా అభిమానులు స్పందిస్తూ.. ఆమెకు ఘాటుగానే సమాధానమిస్తున్నారు. మీ బుద్ధి ఎప్పటికీ మారదు అని ఎత్తిచూపారు. అలాగే, యుద్ధమైనా, ఆటైనా గేలిచేది భారత్.. ఓడిపోయేది పాకిస్తాన్ అంటూ చురకలంటిస్తున్నారు. క్రీడల్లో పాకిస్తాన్ ప్లేయర్లు ఇలా చేయడం పై […]

సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు లైన్ క్లియర్

తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు మరో అడుగు ముందుకు పడింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిష్కారం లభించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో మాట్లాడి అనుమానాలు నివృత్తి చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌తో సమావేశమయ్యారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చెల్లించే నష్టపరిహారం ఇచ్చేందుకు తెలంగాణ ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ప్రాజెక్టుకు NOC ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్టు ప్రచారం […]

ఆ లగ్జరీ కార్లు మీ వద్దకు ఎలా వచ్చాయి?.. కెటిఆర్‌ను ప్రశ్నించిన బండి

లగ్జరీ కార్ల కుంభకోణం నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా? అని ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఆ కార్లు కెసిఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిష్టర్ […]

డీఎస్సీ నియామక పత్రాల పంపిణీకి పవన్ ను ఆహ్వానించిన లోకేశ్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల మధ్యలో అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరియు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో, మంత్రి లోకేశ్ రాష్ట్రంలో ఇటీవల పూర్తి చేసిన మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై పవన్ కల్యాణ్‌కు వివరాలు ఇచ్చారు. నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 25న […]

శ్రీశైలంలో దసరా ఉత్సవాలు ప్రారంభం.. శైలపుత్రిగా అలరించిన భ్రమరాంబిక దేవి

శ్రీశైలంలో దసరా మమోత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలు అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా చేపడుతున్న నవదుర్గ అలంకారంలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని శైలపుత్రి స్వరూపంలో అలంకరించారు. ద్విభుజాలను కలిగిన ఈదేవి కుడిచేతిలో త్రిశూలాన్ని, ఎడమచేతిలో పద్మాన్ని ధరించి ఉంటుంది.నవదుర్గలలో ప్రథమ రూపమైన ఈదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగడంతో పాటు సర్వత్రా విజయాలు లభిస్తాయని చెబుతుంటారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON