కొత్త జీఎస్టీ స్లాబ్స్.. తెలుగులో జీవోలు విడుదల చేసిన సీఎం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్స్ సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. తద్వారా అనేక ఉత్పత్తులపై ధరలు భారీగా తగ్గబోతున్నాయి. దీని వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8వేల కోట్ల ప్రయోజనం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు జీఎస్టీ 2.0కి సంబంధించిన జీవోలను సీఎం విడుదల చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జీఎస్టీకి సంబంధించి తెలుగు జీవోల బుక్‌లెట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో రాష్ట్ర పన్నుల విధానంపై సమీక్షించారు.