loader

‘మీ విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తి’.. మోహన్‌లాల్‌కు ప్రధాని మోడీ ప్రత్యేక అభినందనలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మలయాళ సూపర్ స్టార్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘మోహన్‌లాల్ బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక.దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీకి దివిటీలా నిలుస్తున్నారు. కేరళ సంస్కృతి పట్ల మక్కువ కలిగిన ఆయన కేవలం మలయాళమే కాకుండా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ అద్భుతమైన పాత్రలు పోషించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు . ఆయన సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి’ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు […]

తిరుమలను వాడుకోవడం చంద్రబాబు, లోకేష్‌కు అలవాటు – వైసీపీ.

తిరుమల క్షేత్రాన్ని రాజకీయ లాభాల కోసం వాడుకోవడం సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు అలవాటుగా మారిందని వైసీపీ  ఆరోపించింది.. దేవాలయాలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలను రాజకీయ వేదికగా మార్చడం అనైతికమని పార్టీ విమర్శలు గుప్పించింది. తిరుమల వంటి జాతీయ స్థాయి ప్రాధాన్యత కలిగిన పవిత్రక్షేత్రాన్ని రాజకీయ దాడులకు వేదిక చేయడం ఆమోదయోగ్యం కాదని, 2023లో తిరుమల పరకామణి ఘటనలో చోరీకి పాల్పడిన రవికుమార్‌ను పోలీసులు పట్టుకున్నారని ఈ సంఘటనలోనూ చంద్రబాబు, లోకేష్‌లు రాజకీయ లాభం దక్కించుకోవాలని ప్రయత్నించడం […]

మోదీ 10 ఏళ్ల పాలన భారత్‌ నష్టపోయిన ఒక దశాబ్దం.. హెచ్‌ 1బీ వీసాలపై ఓవైసీ ఫైర్

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాల ఫీజులను భారీగా పెంచడంపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ.. ఇది భారత విదేశాంగ విధానం వైఫల్యాన్ని సూచిస్తుందని ఆరోపించారు. మోదీ సర్కార్ కేవలం ఘనకార్యాలు, జాతీయాభివృద్ధి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. హెచ్-1బీ వీసాల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం భారతీయులపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ఆయన తెలిపారు. ట్రంప్ కోసం ప్రధాని మోదీ గతంలో చేపట్టిన హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాలను ప్రస్తావించిన ఓవైసీ.

వాళ్లకు కూడా ఇలాంటి షరతులు విధించే ధైర్యం ఉందా?..డీఎంకేపై విజయ్

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) వ్యవస్థాపకులు విజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన రాజకీయ సమావేశాలకు డీఎంకే సర్కార్ అనేక షరతులు విధిస్తుందని ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన సమయంలో కూడా డీఎంకే సర్కార్ ఇలాంటి షరతులను విధించే ధైర్యం చేస్తుందా? అని ప్రశ్నించారు.పుత్తూరులో జరిగిన భారీ ర్యాలీలో విజయ్ ప్రసంగిస్తూ… డీఎంకే ప్రభుత్వం తన కదలికలను నియంత్రిస్తుందని ఆరోపిస్తుందని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ కు..  కోటా వినుత  సంచలన లేఖ.. !

శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి సాయి ప్రసాద్ ఇవ్వడం పై అభ్యంతరాన్ని తెలుపుతున్నాను ఈ విషయం పైన పురాలోచన చేయాలని విజ్ఞప్తి అంటూ వెల్లడించింది.. మహిళలంటే కనీసం గౌరవం లేనటువంటి వ్యక్తి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పదవికి నియమించడం మంచిది కాదని నాపై జరిగిన రాజకీయ కుట్రలకు ప్రధాన నిందితుడు ఈ సాయి ప్రసాద్ ఒకరని, ఆధారాలు కూడా జనసేన కార్యాలయంలో ఉన్నాయని మీ దృష్టికి ఎవరు చేరనివ్వలేదని భావిస్తున్నాను.

రాజీయపేటలో ఉరితాళ్లతో మత్సకారులు ఆందోళన.. ఎందుకంటే..?

పాయకరావుపేట, నక్కపల్లి, రాజయ్యపేట సముద్ర తీరంలో మెడికల్ ఫ్యాక్టరీల వల్ల మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంగలపూడి అనిత స్పందన కోరుతున్నారు. మత్స్య సంపదను తినేస్తున్న మెడికల్ కంపెనీలు మాకొద్దు మహాప్రభో.. అంటూ తీరంలో ఉన్న మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థిని ఇటీవలే ప్రారంభమైనది కాదని.. ఎన్నో సంవత్సరాలుగా దీని కారణంగా తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో మరో భారీ సంస్థ రావడం ఏంటని వారు […]

శింగనమల అభివృద్ధిపై పవన్‌కు ఎమ్మెల్యే శ్రావణి వినతి

శింగనమల నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసినట్లు టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వెల్లడించారు. శింగనమల నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి పూర్తిగా దిగజారిందని తెలిపారు. చాలా గ్రామాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమై, వర్షాకాలంలో గమ్యం కాకుండా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రోడ్ల నిర్మాణానికి మరియు అప్పటికే ఉన్న రోడ్ల మరమ్మతులకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని పవన్ కళ్యాణ్‌ను కోరినట్లు తెలిపారు.

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నాగలక్ష్మి ఆర్‌ & బీ (రోడ్లు & భవనాలు) డైరెక్టర్‌గా ప్రశాంతి | ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా శ్రీధర్ | సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్‌గా భార్గవ్ | స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ ఐజీగా డా. బి.ఆర్. అంబేద్కర్ | కృష్ణా జిల్లా జేసీగా నవీన్ | ఖాదీ గ్రామీణ […]

మోహన్‌లాల్‌కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

భారతీయ సినీ రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే పురష్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’. 2023 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు ప్రకటించింది.నాలుగున్నర దశాబ్దాలుగా భారతీయ చిత్ర పరిశ్రమలకు ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించనున్నారు. భారతీయ చలన చిత్రరంగానికి మోహన్‌లాల్‌ ఆదర్శవంతమైన సేవలను అందించారని.. ఆయన అద్భుతమైన ప్రతిభ, కృషి, పట్టుదల సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కేంద్ర సమాచార శాఖ కొనిడియాడింది.

సింగ‌రేణి లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు ఇవ్వాల‌ని సీఎం రేవంత్‌కు విన‌తి

ఆర్ధిక సంవత్సరంలో 2024-2025 సింగ‌రేణి సంస్థ‌కు వచ్చిన వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ యూనియన్ గౌరవాధ్య‌క్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఏఐటీయూసీ యూనియన్ సీఎం రేవంత్‌రెడ్డికి విన‌తిప‌త్రం అంద‌జేశారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేసి దసరా పండుగ అనంతరం సంబంధిత మంత్రులు, యాజమాన్యంకి, గుర్తింపు సంఘం యూనియన్ ను సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయం తీసుకుంటామ‌ని సీఎం హామీ ఇచ్చిన‌ట్లుగా తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON