loader

తీవ్ర విషాదం.. వర్షపు నీటిలో కొట్టుకుపోయిన బాలిక..

గత 24 గంటలుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయంగా మారాయి. శుక్రవారం సాయంత్రం రాయచోటిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. స్కూల్‌ విద్యార్థులతో వస్తున్న ఒక ఆటో వర్షపు నీటిలో మునిగిపోయింది.దీంతో ఆటోలో ఉన్న విద్యార్థులు, ఆటో డ్రైవర్‌ కాపాడామని కేకలు వేశారు. నీటిలో చిక్కుకున్న ఆటలో ఉన్న ఆరుగురు విద్యార్థులను సురక్షితంగా కాపాడి పైకి తీసుకొచ్చారు. కానీ ప్రమాదవశాత్తు ఒక ఎనిమిదేళ్ల బాలిక వర్షపు నీటిలో కొట్టుకుపోయింది.

ఎగిరెగిరి పడుతున్నావ్…ఓమీకి ‘ఓజీ’ వార్నింగ్- పవన్ హైకూ విన్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మెగా విందు అందించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ ‘ఓజీ’ చిత్ర బృందం ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. జపనీస్ భాషలో పవన్ స్వయంగా పాడిన హైకూ ‘వాషి యో వాషి’ని చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఓమీ… మై డియర్ ఓమీ… ఎగిరెగిరి పడుతున్నావ్! నీలాంటి వాడిని నెలకు ఎలా దించాలో నాకు బాగా తెలుసు’ అంటూ ‘వాషి ఓ వాషి…’ హైకూను ప్రారంభించారు పవన్.

వయనాడ్‌లో ప్రియాంక గాంధీ తులాభారంతో అరటి పండ్ల సమర్పణ

ుక్రవారం రోజున ప్రియాంక గాంధీ ముక్కం మనస్సెరీ ప్రాంతంలోని శ్రీ కున్నత్ మహావిష్ణు ఆలయాన్నిదర్శించుకున్నారు. ఆలయానికి వెళ్లిన ఆమె అరటిపండ్లతో తులాభారం వేయించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం, ఆలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన రథాన్ని పరిశీలించిన ఆమె, రథ నిర్మాణంలో పాల్గొన్న శిల్పుల నైపుణ్యాన్ని అభినందించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మోదీ@75 పుస్తకం బహూకరణ

కేంద్ర హోం మంత్రి అమిష్ షాతో ఇంటర్వ్యూ సందర్భంగా నెట్‌వర్క్18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషి ‘మోదీ@75’ (Modi@75) అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని బహూకరించారు. ఈ పుస్తకంలో ప్రధాని నరేంద్ర మోదీ జీవితం, ఆలోచనలు, ముఖ్య ఘట్టాలు ఉన్నాయి. ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు జరుపుకున్న రెండు రోజుల తర్వాత, అమిత్ షా రాహుల్ జోషితో ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం కూర్చున్నప్పుడు ఈ పుస్తకాన్ని ఆయనకు అందించారు.

బిసిలను మోసం చేసిన కాంగ్రెస్: తీన్మార్ మల్లన్న

కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా బిసిలను మోసం చేసిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న విమర్శించారు. హన్మకొండలోని హరిత కాకతీయలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులో పక్కా మోసం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ప్రతియేటా రూ.20 వేల కోట్ల పేరు చెప్పి తొలి బడ్జెట్‌లో రూ.9,200 కోట్లు పెట్ట్టి రూ.2,100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి, నలుగురికి గాయాలు..!

అస్సాం రైఫిల్స్ దళాలు వెళ్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం రాత్రి సాయంత్రం మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తులు సైనికులే లక్ష్యంగా మెరుపు దాడి చేశారు. తుపాకులతో పలు రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయాల కారణంగా ఇద్దరు సైనికులు మరణించారు. గాయపడిన మరో నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని భారత సైన్యం తెలిపింది.

యూరియా కోసం జ‌రిగిన తోపులాట‌లో గాయ‌ప‌డ్డ‌ మహిళా రైతు మృతి

అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు చెందిన మహిళా రైతు పాతులోతు దస్సి (55) వారం క్రితం రైతు వేదిక వ‌ద్ద యూరియా కోసం వరుసలో నిలబడింది. ఈ క్ర‌మంలో జ‌రిగిన తోపులాట‌లో ద‌స్సి కిందపడ‌డంతో కాలు విరిగింది. వెంటనే ఆమెను చికిత్స కోసం మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. గత ఐదు రోజులుగా ఇక్కడ చికిత్స పొందుతు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ద‌స్సి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాల‌ని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాల‌ని […]

వైసీపీకి బిగ్‌షాక్‌.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు

వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్‌ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే వారు వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉందని కల్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. తమ రాజీనామా ఆమోదించకుండా మండలి చైర్మన్‌ తమను ఇరకాటంలో పెట్టారని పేర్కొన్నారు. రాజీనామా చేసి ఏడాది అయ్యిందని.. అయినప్పటికీ తమ […]

ఏపీ ఉల్లి రైతులకు హెక్టార్‌‌కు రూ.50వేలు.. పంట వేసిన అందరి అందరికీ సాయం!

ఉల్లి ధరలు పడిపోవడంతో నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ముందుకు వచ్చింది. ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టార్‌‌కు రూ.50వేలు చెల్లించనున్నారు. ఉల్లి సాగు చేసిన రైతులందరికీ ఈ సాయం అందించనున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.రాష్ట్రంలో కుర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీగా ఉల్లి సాగు జరిగింది. రైతులు హెక్టార్‌కు ₹85,000 నుంచి ₹1.23 లక్షల వరకు పెట్టుబడి పెట్టినా గిట్టుబాటు ధరలు రాలేదు.

ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్

ఆసియాకప్‌లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా ఒమాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే షా ఫైజల్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి శుభ్‌మాన్ గిల్(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (15), సంజూ శాంసన్ (1) ఉన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON