loader

నారాయణ కళాశాలలో విద్యార్థి దవడ విరిగేలా చిత్కొట్టిన ఫ్లోర్ ఇంచార్జ్

హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం వద్ద ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన విద్యాసంస్థల భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. కళాశాల ఫ్లోర్ ఇన్‌ఛార్జ్ మాలి సతీష్ ఇద్దరు విద్యార్థుల మధ్య చిన్న వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా ఒక విద్యార్థిపై క్రూరంగా దాడి చేయడంతో బాధితుడి దవడ విరిగింది. సీసీటీవీ ఫుటేజీలో సతీష్ ఒక విద్యార్థి ముఖంపై గుద్దులు గుద్దడం, నేలకేసి కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. బాధితుడి దవడ తీవ్రంగా విరిగిపోవడంతో వెంటనే […]

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 3కేజీల బంగారం పట్టివేత..

అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడ్డారు ముగ్గురు ప్రయాణికులు, వారి నుంచి 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకన్న అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ముగ్గురు ప్రయాణికులపై అనుమానం రావడంతో ఎయిర్‌పోర్టు అధికారులు వారిని అడ్డగించారు. వారి దగ్గర ఉన్న ఐరన్‌ బాక్స్‌ను తీసి తనిఖీ చేయగా.. అందులో 3.38 కిలోల బంగారాన్ని గుర్తించారు. దీంతో ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.

నిరాశపరిచిన నీరజ్ చోప్రా.. నాలుగో స్థానంలో నిలిచిన సచిన్ యాదవ్..

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రో విభాగంలో పతకం లేకుండానే భారత్‌ కథ ముగిసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన స్టార్ అథ్లెట్, ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా అంచనాలను అందుకోలేక తీవ్రంగా నిరాశపరిచాడు. ఆశలు రేపిన మరో జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా తన ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా 85 మీటర్ల మార్క్‌ను దాటలేకపోయాడు. ఉత్తమంగా 84.03 మీటర్లు […]

అత్యాచారం కేసులో లలిత్ మోదీ సోదరుడి అరెస్ట్..

వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ సోదరుడు సమీర్ మోడీ అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు ఆయన్ను గురువారం సాయంత్రం ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు వెళ్తున్న సమయంలో సమీర్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సమీర్‌తో గతంలో సహజీవనం చేసిన మహిళ ఫిర్యాదు మేరకే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. సమీర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. ఒక రోజు జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు తెలిసింది.

ఐపీఎల్ ఫ్రాంచైజీకి గుడ్ బై.. మెంటర్‌గా వైదొలిగిన యార్కర్ కింగ్..!

ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ముందు కొందరు ఆటగాళ్లు జట్టు మారేందుకు సిద్దమవుతుండగా.. కొందరేమో మేము మీతో కొనసాగలేం అంటూ ఫ్రాంచైజీలను వీడుతున్నారు టీమిండియా పేస్ దిగ్గజం జహీర్ ఖాన్ ఐపీఎల్ జట్టుకు బై బై చెప్పేశాడు. ఏడాది క్రితం లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా నియమితుడైన జహీర్ గురువారం తన బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా, కోచ్ జస్టిన్ లాంగర్‌తో పొసగకే అతడు రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం.

హైద‌రాబాద్‌లో ప‌లు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. భారీ వ‌ర్షం కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో రోడ్ల‌పై వ‌ర‌ద నీరు నిలిచిపోయింది. వ‌ర‌ద నీటి కార‌ణంగా వాహ‌నాలు ముందుకు క‌ద‌లడం లేదు. వ‌ర్షం త‌గ్గిన‌ప్ప‌టికీ ప‌లు చోట్ల వాహ‌నాల రాక‌పోక‌లు స్తంభించిపోయాయి. ఐటీ కారిడార్‌లో ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే నిలిచిపోయాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, గ‌చ్చిబౌలి మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఖైర‌తాబాద్ మెట్రో స్టేష‌న్ కింద భారీగా వ‌ర‌ద నీరు నిలిచిపోయింది. మోకాలి లోతు నీరు […]

బ్రిటిష్‌ హైకమిషనర్‌‌తో సీఎం భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వినతి మేరకు, విద్యా రంగం, ఇతర సామాజిక-ఆర్థిక రంగాల్లో సహకారం అందించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో, భారతదేశంలో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ తాజాగా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ అంతర్జాతీయ స్కాలర్‌షిప్ ప్రోగ్రాంలో తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించనున్నారు.

క్రీడల ద్వారా పర్యాటకానికి, రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు నిర్ణయం: ఆమ్రపాలి

క్రీడల ద్వారా రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇండియా ఖేలో పుట్ బాల్ తో ఏపీ పర్యాటక శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుందని, పర్యాటకం అంటే కేవలం ప్రదేశాలు చూడటమే కాదు, ప్రజల కథలను, వారి సంస్కృతిని గొప్పగా చెప్పడమన్నారు. ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి పర్యవేక్షణలో 45 రోజులపాటు పుట్ బాల్ రోడ్ షో జరుగనుంది. ఏడు ప్రధాన నగరాలకు చేరుకోనున్న రోడ్ షోలో పదికి పైగా చిన్న పట్టణాల్లో పుట్ బాల్ ట్రయల్స్ బాలికలకు సాధికారత […]

ఆన్‌లైన్‌లో ఓట్లను డిలీట్ చేయ‌లేం: కేంద్ర‌ ఎన్నిక‌ల సంఘం

ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు రాహుల్ గాంధీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఇవాళ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఖండించింది. ఆ ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వి, అబ‌ద్ధ‌మ‌ని ఈసీ పేర్కొన్న‌ది. ఓట్ల‌ను ఆన్‌లైన్ డిలీట్ చేయ‌లేర‌ని ఎన్నిక‌ల సంఘం చెప్పింది. ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ప్ర‌జ‌లు ఓట్ల‌ను డిలీట్ చేయడం కుద‌ర‌ద‌ని, రాహుల్ గాంధీ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని, జ్ఞానేశ్ కుమార్ ఆర్నెళ్ల క్రితం సీఈసీగా బాధ్య‌త‌లు చేప‌ట్టార‌ని, కానీ ఏడాది క్రితం అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు రాహుల్ ఆరోపించిన‌ట్లు ఈసీ వ‌ర్గాలు తెలిపాయి.

ఏపీలో ప్రధాన దేవాలయాలకు చైర్మన్ల నియామకం.. 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 17 నెలలకు ప్రముఖ ఆలయాలకు నూతన చైర్మన్లను నియమించారు. శ్రీశైలం మల్లన్నఆలయ చైర్మన్‌గా రమేష్‌ నాయుడును ప్రభుత్వం నియమించింది. శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌గా కొట్టె సాయిప్రసాద్‌, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ చైర్మన్‌గా సురేంద్రబాబు , విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌గా రాధాకృష్ణను, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌గా వెంకట్రాజు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON