loader

దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత పఖ్వాడా క్యాంపెయిన్‌..

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛత పఖ్వాడా క్యాంపెయిన్‌ నిర్వహించనుంది. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా ముగిసే ఈ దేశవ్యాప్త ఉద్యమం స్వచ్ఛత హి సేవ (SHS) 2025తో సమన్వయం చేయబడుతుంది. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పరిశుభ్రమైన, పచ్చని, ఆరోగ్యకరమైన దేశం కోసం మంత్రిత్వ శాఖ నిబద్ధతను బలోపేతం చేస్తూ శాస్త్రి భవన్, జీవన్ తారా భవనంలో ప్రత్యేక శుభ్రతా డ్రైవ్ చేపట్టనున్నారు.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సిద్ధం

అమరావతి రాజధాని మరోసారి రాజకీయ చర్చలకు వేదిక కానుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి.సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటు ఇతర కీలక అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

పవన్ కల్యాణ్ ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఓజీ సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోకు అనుమతినిచ్చింది. ఈ నెల 25న తెల్లవారుజామున ఒంటిగంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.వెయ్యిగా నిర్ణయించింది. సినిమా విడుదల రోజు నుంచి అక్టోబర్ 4 వరకు అంటే పది రోజుల పాటు టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌లో రూ.150 వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.

విద్యా రంగంపై సంతృప్తి లేదు… స‌మూల ప్ర‌క్షాళ‌నే మా ధ్యేయం:సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ విద్యా విధానం నివేదిక రూప‌క‌ల్ప‌న‌పై తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్‌లో బుధ‌వారం నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ‌లో విద్యా రంగాన్ని స‌మూల ప్ర‌క్షాళ‌న చేయాల‌ని తాము నిర్ణ‌యించుకున్న‌ట్లు సీఎం తెలిపారు. ‘క్షేత్ర స్థాయి ప‌రిస్థితులు, అధ్య‌య‌నం, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం భార‌త‌దేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా

జపాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆటగాడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఈటెను 84.82 మీటర్ల దూరంలో విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్ కోసం నిర్దేశించిన 84.50 మీటర్ల మార్క్‌ను నీరజ్ అలవోకగా అందుకున్నాడు. దీంతో అతను మొదటి ప్రయత్నంలోనే ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగే ఫైనల్లో నీరజ్ స్వర్ణం కోసం పోటీపడనున్నాడు.

దిశాపటాని ఇంటిపై కాల్పులు జరిపిన గ్యాంగ్ ఎన్ కౌంటర్

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానికి సొంత ఊరు అయిన బరేలీలోని వారి ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు గాజియాబాద్‌లో రవీంద్ర అలియాస్ కుల్లు , అరుణ్‌ ఉన్నట్లుగా గుర్తించారు. వారిని పట్టుకునేందుకు వెళ్లారు. అయితే వారిద్దరూ కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎదురు కాల్పులు జరిపి వారిని పట్టుకున్నారు.కానీ బుల్లెట్ గాయాలతో వారు చనిపోయారు.

మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్‌&టీ తప్పుకుంటున్నది సీఎం రేవంత్‌రెడ్డి వేధింపులవల్లే : కేటీఆర్‌

తెలంగాణలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థులు సమావేశం కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉందని ఆరోగ్యశ్రీ సేవలు రద్దు చేయడంతో హాస్పిటళ్లు స్తంభించాయని విమర్శించారు. ముఖ్యమంత్రి బెదిరింపులు, ముడుపుల కోసం వేధింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్‌&టీ సంస్థ వైదొలుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఎల్‌&టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ను జైల్లో పెడతానని బెదిరించారని, ఇలాంటి దుర్మార్గమైన చర్యలవల్ల ప్రైవేట్ కంపెనీలు రాష్ట్రం […]

కొంతమందిని జైలుకు పంపండి.. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం సీరియస్

ఏటా శీతాకాలంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం దీనికి ఓ కారణమనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనంపై దాఖలైన పిటిషన్లపై తాజాగా మరోసారి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి పాల్పడుతున్న కొంతమందిని జైలుకు పంపితేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది.

అమరావతిలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ

గతంతో పోలిస్తే మంచు లక్ష్మీ ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే సేవా కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది మంచు వారమ్మాయి. టీజ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన ఆమె పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని డెవలప్ చేస్తోంది. స్కూల్స్ లో డిజిటల్ తరగతుల ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోది. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుని డెవలప్ చేస్తోంది మంచు లక్ష్మి. ఇప్పుడు అమరావతిలోనూ […]

పిఠాపురంలో కలకలం.. బావిలో మృతదేహాలు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా హాట్‌సీట్‌గా మారిన పిఠాపురం నియోజకవర్గంలో.. ప్రస్తుతం ఓ ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామ పంట పొలాల మధ్య ఉన్న ఓ బావిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పరిశీలించగా.. అవి తాటిపర్తి గ్రామానికి చెందిన తోలేటి సూరిబాబు, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON