loader

ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జరిపిన చర్చలు ఫలించాయి. ఈ మేరకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా ముగిసినట్లు ఉపముఖ్యమంత్రి భట్టితెలిపారు. బంద్ విరమణకు ప్రైవేట్ కాలేజీలు అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం నుంచి ఇంజనీరింగ్ కళాశాలలు యథావిధిగా తెరచుకోనున్నట్లు తెలిపారు. అయితే ఈ వారంలో రూ.600కోట్లు, దీపావళికి మరో రూ.600కోట్ల నిధులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద విడుదల చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ […]

ఘోర ప్రమాదం..జనాన్ని కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన లారీ..

ఇండోర్‌లోని విమానాశ్రయ పోలీస్ స్టేషన్ ప్రాంతం సమీపంలో ఒక ట్రక్ డ్రైవర్ మద్యం మత్తులో అధిక వేగంతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులను ఒక కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లాడు. ట్రక్ క్యాబిన్ కూడా మంటల్లో చిక్కుకుంది.కాలిపోతున్న ట్రక్కు కింద నుండి ఒక బైక్ రైడర్ కూడా ట్రక్కు కింద చిక్కుకున్నాడు. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని ట్రక్ మంటలను ఆర్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడి […]

రష్యా వెళ్లిన పంజాబ్‌ వ్యక్తి.. బలవంతంగా ఆర్మీలో చేరిక

పంజాబ్‌కు చెందిన వ్యక్తి స్టూడెంట్‌ వీసాపై రష్యా వెళ్లాడు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో అతడ్ని బలవంతంగా ఆర్మీలోకి చేర్చుకున్నారు. ఎలాంటి మిలిటరీ ట్రైనింగ్‌ లేని ఆ వ్యక్తిని యుద్ధభూమికి పంపారు. అతడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన 25 ఏళ్ల బూటా సింగ్‌ 2024 అక్టోబర్ 24న ఢిల్లీకి చెందిన ఏజెంట్ ద్వారా రష్యా వెళ్లాడు. ఆ ఏజెంట్‌ అతడి కుటుంబం నుంచి రూ. 3.5 […]

ఆ ప్రాంతంలో నక్సలిజం అంతమైంది: అమిత్ షా

ఉత్తర జార్ఖండ్‌లోని బోకారో ప్రాంతంలో నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం అన్నారు. సోమవారం ఉదయం జార్ఖండ్‌కు చెందిన హజారీబాగ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోవడంతో నక్సలిజం ఈ ప్రాంతంలో తుడిచిపెట్టుకపోయినట్లేనని పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో సహదేవ్ సోరెన్ అలియాస్ పర్వేశ్, రఘునాథ్ హేంబ్రమ్ అలియాస్ చంచల్, బీర్‌సేన్ గంఝు అలియాస్ రామ్‌ఖేలవన్ హతయ్యారని పోలీసులు తెలిపారు

నేపాల్ మంత్రివర్గ విస్తరణ.. ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణం

నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సోమవారం నియమితులైన ముగ్గురు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆ ముగ్గురిని కొత్తగా నియమితులైన తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి(73) తన మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. కర్కి నేపాల్ తొలి మహిళా ప్రధానిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆమె కుల్మాన్ ఘీసింగ్, రామేశ్వర్ ఖనాల్, ఓం ప్రకాశ్ ఆర్యల్‌ను మంత్రులుగా చేర్చుకున్నారు.

భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు.. ఢిల్లీకి అమెరికా బృందం!

భారత్‌తో వాణిజ్య చర్చలకు సిద్ధమయ్యారు. అమెరికా ప్రతినిధి బృందం భారత్‌లో అడుగుపెట్టనుండగా, రేపటి నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్, సోమవారం రాత్రికి భారత్‌కు చేరుకోనున్నారు. భారత వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్‌తో బ్రెండన్ లించ్.. చర్చలు జరపనున్నారు. వ్యవసాయ, పాల ఉత్పత్తుల విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ చర్చలు ఇరు దేశాల వాణిజ్య సంబంధాలను ఎలా ముందుకు తీసుకెళ్తాయో వేచి చూడాలి.

వరుసగా రెండో ‘గ్రాండ్ స్విస్’ టైటిల్.. చరిత్ర సృష్టించిన గ్రాండ్‌మాస్టర్

ప్రపంచ చదరంగాన్ని భారత యువ గ్రాండ్‌మాస్టర్లు శాసిస్తున్నారు. రమేశ్‌బాబు వైశాలి చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక గ్రాండ్ స్విస్‌ టైటిల్‌న నిలబెట్టుకున్న తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. సోమవారం జరిగిన ఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్ టాన్ జొంగ్యీ కు ముచ్చెమటలు పట్టించింది వైశాలి. అసమాన పోరాటంతో మ్యాచ్ డ్రా చేసుకున్న భారత చెస్ క్వీన్.. అత్యధిక పాయింట్లతో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. వచ్చే ఏడాది జరుగబోయే క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించిందీ చెస్ క్వీన్.

ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్: రాష్ట్రంలో నిలిచిపోయిన వైద్యఆరోగ్య సేవలు

సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్ వర్క్ ఆస్పత్రుల ప్రకటించాయి.ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రూ.2,500 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. రూ.2500 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా డిమాండ్లు చేస్తున్నామని అయితే తమ విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ […]

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

‘హిందూ మతంలో సమానత్వం ఉంటే ఎవరైనా ఎందుకు వేరే మతంలోకి మారతారు..? ‘హిందూమతంలో సమానత్వమే ఉంటే అంటరానితనం ఇంకా ఎందుకు మిగిలి ఉంది..? అంటరానితనాన్ని మనం సృష్టించామా..? ఇస్లాం, క్రైస్తవం, ఇతర ఏ మతాల్లోనైనా అసమానత్వం ఉండొచ్చు. మేముకానీ బీజేపీకానీ ఎవరినీ మతం మారమని కోరం, ప్రజలే మతం మారుతుంటారు, అది వారి హక్కు కూడా’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

లేటుగా వచ్చాడని బయట నిలబెట్టారు.. అక్కడి గోడ కూలడంతో

కర్నూలు నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కవాడి వీధిలోని కీర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గోడ కూలి ఓ చిన్నారి మృతి చెందగా.. మరో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఉదయం పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన కొంతమంది విద్యార్థులను యాజమాన్యం బయట నిలబెట్టింది. ఈ సమయంలో పాఠశాల గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో విద్యార్థులు దాని కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఐదేళ్ల రకీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON