loader

సర్‌పై సర్వ హక్కులు మావే… కాదనలేరు

దేశంలో క్రమం తప్పకుండా విరామాల నడుమ ప్రత్యేక విస్తృత ఓటర్ల జాబితా సవరణ (సర్) చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల సంఘానికి ఇటువంటి చర్యకు దిగే అధికారం అనేక విధాలుగా సంక్రమించి ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారు. అత్యున్నత న్యాయస్థానానికి ఈ మేరకు తమ కౌంటర్ అఫిడవిట్‌తో కూడిన ప్రతివాదనను తెలియచేశారు. ఏ ఇతర అధికారిక వ్యవస్థలకు సంబంధం లేకుండా, వాటి పరిధి రాకుండా కూడా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేసే అధికారం సంతరించుకుని […]

ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అంటే ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పెట్టిన నటుడు విజయ్ దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టిన ఆయన అరియళూర్ సభలో శనివారం రాత్రి పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన విజయ్.. కేంద్రంలోని తాజాగా మరోసారి భారతీయ జనతాపార్టీపై నిప్పులు చెరిగారు. కేంద్రం అమలు చేయాలనుకుంటున్న ఒకేదేశం – ఒకే ఎన్నిక విధానం అనేది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం లాంటిదేనని తమిళగ వెట్రీ కజగం (TVK) పార్టీ అధినేత అన్నారు.

ఓజీ లాస్ట్ డే షూట్, చిత్ర యూనిట్ తో పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా They Call Him OG (ఓజీ) షూటింగ్ పూర్తయింది. తాజాగా మూవీ యూనిట్ నుండి వచ్చిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ చివరి రోజు తీసిన ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య, సినిమాటోగ్రాఫర్ రవికే చంద్రన్, ఇతర సిబ్బంది ఉన్నారు. అభిమానులను ఉత్సాహపరిచిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 18న […]

మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలి..

మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇవాళ(శనివారం) మంత్రులతో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ఐదేళ్ల వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని తెలిపారు. ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే కొత్త టీమ్‌‌లను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడి ప్రభుత్వ పథకాలను వివరించినట్లు వెల్లడించారు.

ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారినవ్‌?.. గద్వాల ఎమ్మెల్యేను నిలదీసిన కేటీఆర్‌

గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ..మరి ఇవాళ ఎవరి అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లావని కృష్ణమోహన్‌ రెడ్డిని కేటీఆర్‌ ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసమా? ఎందుకు పార్టీ మారవని నిలదీశారు. ఈ 22 నెలల్లో గద్వాలలో ఏం అభివృద్ధి జరిగిందని అడిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బీఫాంతో పోటీచేసి గెలిచాక  కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా.. అధికార పార్టీకి పెద్ద ఎత్తున పలువురు నాయకులు గుడ్‌బై చెప్పి కేటీఆర్‌ […]

మహిళా సాధికారికత… నేపాల్ ప్రధాని సుశీలా కార్మికి మోడీ శుభాకాంక్షలు

మణిపూర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇంఫాల్ సభ నుంచే నేపాల్ నూతన ప్రధాని సుశీలా కార్కికి శుభాకాంక్షల సందేశం వెలువరించారు. ఇరు దేశాల మధ్య చిరకాలపు చరిత్ర, విశ్వాసం, సాంస్కృతిక పలు ప్రత్యేకతల బంధం ఉందని చెప్పారు. నేపాల్‌లో తొలిసారిగా మహిళా ప్రధాని బాధ్యతలు స్వీకరించడం నేపాల్ మహిళా సాధికారికత వెల్లివిరిసిన ఘట్టానికి తార్కాణం అన్నారు. నేపాల్ పరివర్తన దశలో భారత్ ఎల్లవేళలా తోడుగా నిలిచిన విషయాన్ని ఈ నేపథ్యంలో ప్రధాని గుర్తు చేశారు.

మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు.. మోడీపై విమర్శలు

జాతుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వయనాడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో ఘర్షణలు జరిగిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ అక్కడ పర్యటనకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. భారత్‌లో ప్రధాన మంత్రుల సంప్రదాయం ఇది కాదంటూ విమర్శించారు. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే అక్కడికి వెళ్తార్నారు.

సింగరేణి ఓపెన్ మైన్స్‌లో మహిళా ఆపరేటర్లు

సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు జనరల్ అసిస్టెంట్లుగా, ట్రాన్స్‌ఫర్ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలు ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి సింగరేణి యాజమాన్యం అవకాశం కల్పించేందుకు నిర్ణయించింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తునన్నామని, దీనిపై ఇప్పటికే సర్కలర్ విడుదల చేసినట్లు తెలిపారు.

మధ్యప్రదేశ్ సిఎంకు తృటిలో తప్పిన ప్రమాదం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కేందుకు సిద్ధమవుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేయడంతో సీఎంకు ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

యూరియా దొరకడం లేదని పురుగుల మందు తాగిన రైతు

కొత్తగూడ మండలం బుర్కగుంపునకు చెందిన మల్యాల నరసయ్య తనకు ఉన్న కొంత భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. అయితే యూరియా బస్తాల కోసం గత నెల రోజులుగా చెప్పులరిగేలా తిరుగుతున్నాడు. కానీ ఒక్క బస్తా కూడా యూరియా దొరకడం లేదు. దీంతో కళ్ల ముందే పంట ఆగమవుతుంటే నరసయ్య తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో శనివారం నాడు తన పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON