loader

డ్రంక్ డ్రైవ్ లో ట్టుపడితే రూ.10వేల జరిమానా..!

విజయనగరం నగరంలో డ్రంక్ డ్రైవింగ్‌పై పోలీసులు, కోర్టు కఠిన చర్యలు తీసుకుని 115 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ నిర్వహించగా, మద్యం తాగి వాహనాలు నడిపిన 115 మంది డ్రైవర్స్‌ను పట్టుకుని కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచగా, అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్. తేజ చక్రవర్తి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. మొత్తం రూ.11.50 లక్షలు […]

అమరావతి భూసేకరణపై సీఎం చంద్రబాబు క్లారిటీ..

హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుందన్నారు. అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రైతులకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధి కంటిన్యూగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే ఉన్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

నేపాల్‌ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. మొదటి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన సుశీల

గత నాలుగైదు రోజులుగా అట్టుడికిన నేపాల్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. ఆ దేశ చరిత్రలో తొలి ప్రధాన మంత్రిగా మాజీ జస్టిస్ సుశీల కర్కి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం తాత్కాలిక ప్రధానిగా ఎంపికైన ఆమె రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. రాత్రి 9:00 గంటల తర్వాత శీతల్ నివాసంలో అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ఆమెతో పదవీ ప్రమాణం చేయించారు.

కాంగోలో భారీ పడవ ప్రమాదం.. 86 మంది మృతి..

మధ్య ఆఫ్రికాలోని కాంగో దేశం మరోసారి విషాదంలో మునిగిపోయింది. ఈక్వెటర్ ప్రావిన్స్‌లోని బసన్‌కుసు పరిధిలో ఓ భయంకరమైన పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 86 మంది దుర్మరణం పాలయ్యారని స్థానిక మీడియా వెల్లడించింది. సెప్టెంబర్ 10న రాత్రి ఈ ప్రమాదం జరగగా, శుక్రవారం అధికారికంగా వివరాలు బయటకు వచ్చాయి.అధికారులు తెలిపిన ప్రకారం

నటి దిశా పటానీ ఇంటిపై కాల్పులు..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో బాలీవుడ్ నటి దిషా పటానీ ఇంటిపై కాల్పులు జరిగాయి. ఆమె నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ దాడి వెనుక ఆమె సోదరి ఖుష్బూ పటానీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కారణం సోషల్ మీడియాలో ధేలనా సోదరులు తామే ఈ దాడికి పాల్పడ్డామని ప్రకటించుకున్నారు. అంతేకాకుండా, దిషా పటానీ “సాధువులను అవమానించిందని” ఆరోపిస్తూ, సినిమా పరిశ్రమకు మరిన్ని చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

యూరియా దొరకలేదనే మనస్తాపంతో యువ రైతు ఆత్మహత్య

యూరియా బస్తాలు దొరకపోవడంతో పంట చేను చేతికి రాదన్న మనస్థాపంతో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సేవ్యాతండాకు చెందిన కున్సోత్ యాకయ్య కుమారుడు సుమన్ (35) యూరియా బస్తాల కోసం సహకార సంఘం చుట్టూ తిరిగి వేశారిపోయాడు. అయినా దొరకపోవడంతో పంట చేను చేతికి రాదన్న మనోవ్యధతో గురువారం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతనిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.

హైదరాబాద్‌ మెట్రోపై ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ

హైదరాబాద్‌ మెట్రో రైలు నిర్వహణలో తీవ్ర నష్టాలు వస్తున్నాయని ఎల్‌అండ్‌టీ స్పష్టం చేసింది. కేంద్రం, రాష్ట్రం ఎవరికైనా ఈ ప్రాజెక్ట్‌ను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్టు లేఖలో పేర్కొంది. ప్రస్తుతం నడుస్తున్న మూడు కారిడార్‌లలో ఒక్కటి కూడా లాభాల్లో లేనట్టు తెలిపింది. ఉద్యోగుల జీతాలు, విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికే సరిపోతుందని, ఆపరేషన్ల ఖర్చులను మించిన ఆదాయం రాకపోవడం వల్ల , 2020 నాటికి ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం,అలాగే కేంద్రం నుంచి రావాల్సిన ఫండింగ్ కూడా రాకపోవడంతో […]

తిరుమలలో అన్నప్రసాదం వడ్డించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ దర్శించుకున్నారు. శ్రీవారి అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె భక్తులను పలకరించారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. భక్తులను ఆప్యాయంగా పలకిరిస్తూ.. ఇంకొంచెం వేసుకోండి.. అంటూ ఒక్కొక్కరికీ వడ్డించారు.

చార్లీ కిర్క్ హంతకుడు చిక్కాడు- ట్రంప్ ప్రకటన

అమెరికాలో కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ హత్య కేసులో పెద్ద మలుపు చోటుచేసుకుంది. హత్య కేసులో ఒక అనుమానితుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో సహాయం చేసింది అతని సన్నిహితుడేనని, అతనే పోలీసులకు అప్పగించాడని ట్రంప్ చెప్పారు. మేము వెతుకుతున్న వ్యక్తిని పట్టుకున్నామని మేము భావిస్తున్నాము.” న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, చార్లీ కిర్క్ హత్య కేసులో అనుమానితుడు టైలర్ రాబిన్సన్ అని గుర్తించారు.

చేనేతలకు తీపికబురు.. అకౌంట్లోకి డబ్బులు..

చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నేతన్నలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చేనేత కార్మికుల కోఆపరేటివ్‌ సొసైటీ (ఆప్కో) బకాయిలు పడిన డబ్బుల చెల్లింపులు ప్రారంభించింది. మొదటి విడతగా రూ.2 కోట్లకు పైగా బకాయిలను చెల్లించారు. 7 డివిజన్లలోని 84 సొసైటీల ఖాతాల్లో బకాయిల సొమ్ము జత చేసినట్లు ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. త్వరలోనే మిగిలిన బకాయిలు చెల్లిస్తామని వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON