ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో పలువురు ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం జరిగే ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికే ఆయన ఈ పర్యటన చేశారు.చంద్రబాబు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీ బయలుదేరారు. ఆయన రాకతో ఢిల్లీ టీడీపీ నేతలు, మిత్ర పక్ష నాయకులు ఉత్సాహంగా స్వాగతం పలికారు