loader

భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు సిద్ధం.. ట్రంప్ ట్వీటుకు మోడీ ఓకె

భారత్-అమెరికా సహజ భాగస్వామ్యపక్షాలు. ఈ చిరకాల, నిజమైన బంధం ప్రాతిపదికననే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా వెలువరించిన స్పందన ఇరుదేశాల ఇప్పటి అనిశ్చితత నడుమ అత్యంత కీలకం అయ్యాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు పరిష్కారించుకునేందుకు అన్ని విదాలుగా దౌత్యచర్చలు జరుగుతున్నాయని ట్రంప్ వెలువరించిన వ్యాఖ్యలకు స్పందనగా మోడీ ట్రేడ్ డీల్ గురించి ప్రస్తావించారు.

గణపతి చందా ఇవ్వలేదని నాలుగు కుటుంబాల బహిష్కరణ..

జగిత్యాల జిల్లా రూరల్ మండలం కల్లెడ గ్రామంలో జరిగిన.. ఓ సంఘటన, గణపతి నిమజ్జనం కోసం రూ.1,116 చందా ఇవ్వలేదని కారణం చూపుతూ గ్రామ కుల పెద్దలు నాలుగు కుటుంబాలను బహిష్కరించారు. ఇంతటితో ఆగకుండా, ఆ కుటుంబాలతో ఎవరైనా మాట్లాడినా, పలకరించినా లేదా ఏ విధంగానైనా సంప్రదించినా, సహాయం చేసినా రూ.25,000 జరిమానా విధిస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకటనను డప్పులు మోగిస్తూ గ్రామమంతా ప్రచారం చేయడం చూసి అందరూ షాక్ అయ్యారు.

యూఏఈపై భారత్ ఘన విజయం…

ఆసియా కప్ 2025 టోర్నీని భారత జట్టు ఘనంగా ఆరంభించింది. దుబాయ్ వేదికగా ఆతిథ్య యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది భారత్. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు, 13.1 ఓవర్లలో 57 పరుగులకి ఆలౌట్ కాగా.. ఈ లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి ఛేదించింది భారత జట్టు.. వరుసగా 15 మ్యాచుల్లో టాస్ ఓడిన భారత జట్టు, ఎట్టకేలకు దాన్ని బ్రేక్ చేసింది. టాస్ […]

సీఎం చంద్రబాబు దసరా కానుక.. వారికి ఏటా రూ.15000 సాయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అనంతపురంలో జరిగిన ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభలో ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా రూ.15,000 ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో, వారికి భరోసా కల్పించేందుకు ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. దసరా రోజున ఈ సహాయం నేరుగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో జమ […]

సోషల్ మీడియా పోస్టులపై అక్రమ కేసులు చెల్లవు..ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

సోషల్ మీడియా పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెడుతున్న తీరుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో పాటు చట్టాల స్ఫూర్తితోనే పోలీసులు పని చేయాలని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోస్టులు చేసినందుకు కేసులు పెడతామంటే చెల్లదని, కేసులు పెట్టే ప్రతి వ్యక్తి ఏ విధంగా తనకు వ్యక్తిగతంగా నష్టం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత ఉంటుందని అప్పుడే ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని కఠినమైన […]

ఆ విషయంలో ఎక్కడివరకైనా వెళ్తాం.. పాక్‌, స్విట్జర్లాండ్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌..!

జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) 60వ సెషన్ 5వ సమావేశంలో పాకిస్తాన్‌, సింగపూర్‌ దేశాలకు భారత్‌ ఘాటుగా జవాబు ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని.. ఎవరి నుంచి నేర్చుకోవాల్సిన, సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదని భారత దౌత్యవేత్త క్షితిజ్‌ త్యాగి స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్‌ ప్రకటనపై స్పందిస్తూ.. తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడానికి బదులుగా తన దేశం(స్విట్జర్లాండ్‌)లోని సమస్యలైన జాత్యహంకారం, వివక్ష, విదేశీయులపై ద్వేషం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని’ […]

టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతల స్వీకరణ

టీటీడీ ఈవో గా రెండోసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. టీటీడీ ఈవోగా బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ పూర్వపు ఈవో శ్యామలరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు మెంబెర్ సెక్రటరీ ఎక్స్ ఆఫీసియోగా కూడా ప్రమాణం చేశారు.

తొలి రౌండ్‌లోనే సింధు నిష్క్రమణ.. ప్రణయ్, లక్ష్యసేన్ ముందంజ..!

గత ఏడాది కాలంగా మేజర్ టైటిల్‌ కోసం నిరీక్షిస్తున్న పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో డెన్మార్క్‌కు చెందిన లినే క్రిస్టోఫెర్సెన్‌ చేతిలో సింధు అనూహ్యంగా కంగుతిన్నది. గతంలో లినేను ఐదుసార్లు చిత్తు చేసిన భారత స్టార్ ఈసారి మాత్రం చేతులెత్తేసింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ ముందంజ వేశారు.

పిడుగుపాటుకు ముగ్గురు మృతి..మరో నలుగురికి గాయాలు

జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐజ మండలం భూమ్‌పురం గ్రామంలో తిమ్మప్ప అనే రైతు పొలంలో సీడ్ పత్తి క్రాసింగ్ పనులకు ఏడుగురు కూలీలు వెళ్లారు. సాయంత్రం వర్షం కురయడంతో కూలీలు అందరూ పొలంలో ఉన్న వేప చెట్టు కిందకు వెళ్లగా అదే సమయంలో ఉరుములు, మెరుపులతో చెట్టుపై పిడుగు పడింది.

టాస్ గెలిచిన భారత్..

డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలోయూఏఈని టీమిండియా ఢీకొడుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌పై తేమ ఉన్నందున ఆతిథ్య జట్టును తక్కువ స్కోర్‌కే కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే బౌలింగ్ తీసుకున్నట్టు సూర్య వెల్లడించాడు. యూఏఈ కెప్టెన్ వసీం సైతం తాము టాస్ నెగ్గినా బౌలింగ్ తీసుకునేవాళ్లమని చెప్పాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON