loader

నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు – కాజల్

రోయిన్ కాజల్ అగర్వాల్ తనకు యాక్సిడెంట్ జరిగిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చూస్తుంటే నవ్వు వస్తుందని, చాలా ఫన్నీగా అనిపిస్తాయని ఆమె అన్నారు. దేవుడి దయవల్ల తాను ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నానని, ఆరోగ్యంగా ఉన్నానని ఆమె అభిమానులకు భరోసా ఇచ్చారు.ముఖ్యంగా సెలబ్రిటీల గురించి వచ్చే వార్తలను నిజమని నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని ఆమె సూచించారు.

నేపాల్లో హింస.. హోంమంత్రి రాజీనామా

నేపాల్‌లో ఇటీవల జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశ హోంమంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ప్రధానమంత్రికి పంపారు. దేశంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడం, ముఖ్యంగా యువత ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా, అలాగే సోషల్ మీడియాపై నిషేధం విధించడంపై నిరసన వ్యక్తం చేస్తూ నేపాల్‌లో యువత ఆందోళనలో పోలీసు కాల్పుల్లో 19 మంది మరణించగా, 250 మందికి […]

ఆపిల్ ఐఫోన్-17 గ్రాండ్ లాంచింగ్ రేపే

టెక్నాలజీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ మెగా ఈవెంట్ సమయం దగ్గరపడింది. సెప్టెంబర్ 9న కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ‘ఆవ్ డ్రాపింగ్’ పేరుతో ఈవెంట్ జరగనుంది. ఈసారి ఆపిల్ నాలుగు కొత్త మోడళ్లు తీసుకురానుంది. అవి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్. వీటిలో అత్యధిక చర్చనీయాంశం ఐఫోన్ 17 ఎయిర్. కేవలం 5.5 మిల్లీమీటర్ల మందంతో ఇది ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలో అత్యంత సన్నగా […]

‘కాంగ్రెస్ వారికే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు’

బోనకల్లు మండల పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన 60 నిరుపేద కుటుంబాలు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ గ్రామ కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశార‌ని, అనేక ఏళ్లుగా పూరి గుడిసెల్లో నివాసం ఉంటూ సెంటు భూమి కూడా లేని వారికి ఇల్లు మంజూరు చేయలేదని వినతి పత్రంలో […]

పాతనగరంలో మెట్రో పనులకు త్వరలోనే శ్రీకారం

హైదరాబాద్ మెట్రో రైల్ పాతనగరం కారిడార్ నిర్మాణ పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ అఫ్ వే కీలక దశకు చేరుకున్నాయని మొత్తం ఏడున్నర కిలోమీటర్ల ఈ కారిడార్ లో ప్రభావిత ఆస్తుల స్వాధీనం, వాటి కూల్చివేతలు, రోడ్డు విస్తరణ పనులు రైట్ ఆఫ్ వే కు సరిపడేదశకు వచ్చాయన్నారు.విస్తరణ పనులు శరవేగంగా చేస్తున్నామని, వీలైనంత త్వరగా పాత నగరం ప్రజల చిరకాల స్వప్నమైన మెట్రో రైల్ పట్టాలెక్కించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని […]

నియోపోలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభించిన సీఎం

కోకాపేట వద్ద నియో పోలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్‌ను సోమవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హెచ్ఎండీఏ నిర్మించిన నియోపోలిస్, కోకాపేట్ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేస్తూ ట్రంపెట్‌ను నిర్మించారు. నియో పోలిస్ ప్రాంతంలో భారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. దీంతో నియోపోలిస్, కోకాపేట ప్రాంతంలో భారీగా ఐటీ కంపెనీలు తరలి రానున్నాయి. ఫ్యూచర్ ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ ట్రంపెట్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ట్రంపెట్ జంక్షన్‌తో మోకిల, […]

అక్కడ బెల్ మోగించిన బాలకృష్ణ…

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో (ఎన్‌ఎస్‌ఈ) బెల్ మోగించారు. తద్వారా ఎన్‌ఎస్‌ఈ బెల్‌ను మోగించిన తొలి దక్షిణాది నటుడిగా బాలకృష్ణ రికార్డు సృష్టించారు. వివరాలు… నందమూరి బాలకృష్ణ సోమవారం రోజున ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ను సందర్శించారు. బాలకృష్ణ వెంట బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే నందమూరి బాలకృష్ణకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై ఆయన అభిమానులు […]

బీఆర్ఎస్ బాటలో బీజేడీ.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం

ఉప రాష్ట్రపతి ఎన్నికల కు దూరంగా ఉండనున్నట్టు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ (BJD) ప్రకటించింది. మంగళవారంనాడు జరుగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తమ పార్టీ ఎంపీలు దూరంగా ఉంటారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర ఢిల్లీలో తెలిపారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే, కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి తమ పార్టీ సమానదూరం పాటించాలనే విధానంలో భాగంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

అల్లు కనకరత్నమ్మకు కేటీఆర్‌ నివాళులు

దివంగత లెజెండరీ నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి, క‌న‌క‌ర‌త్న‌మ్మ (94) ఇటీవ‌లే కన్నుమూసిన విషయం తెలిసిందే. నేడు అల్లు అరవింద్‌ కుటుంబసభ్యులు కనకరత్నమ్మ దశదినకర్మ నిర్వహించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరయ్యారు. కుటుంబసభ్యులను పరామర్శించిన కేటీఆర్‌.. అనంతరం కనకరత్నమ్మ చిత్రపటంపై పూలు చల్లి నివాళులు అర్పించారు.

నేత్రదానానికి ఆర్టీసీ తోడ్పాటు.. సరోజినిదేవి కంటి ఆస్పత్రితో ఒప్పందం

సామాజిక బాధ్యత‌లో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ఆర్టీసీ తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేక‌రించిన నేత్రాల‌ను ఉచితంగా త‌మ బ‌స్సుల్లో హైద‌రాబాద్‌కు త‌ర‌లించాల‌ని నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలోనే ‘నెట్‌వ‌ర్క్ టు సైట్’ పేరుతో స‌రోజిని దేవి కంటి ఆస్పత్రితో టీజీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైద‌రాబాద్ మెహిదిప‌ట్నంలోని స‌రోజిని దేవి కంటి ఆస్పత్రి ప్రాంగ‌ణంలో సోమ‌వారం జ‌రిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జనార్, ఆస్పత్రి సూప‌రింటెండెంట్ డాక్టర్ మోదిని ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేసి ప‌ర‌స్పరం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON