loader

ఇండియా కూటమి మధ్య కుదిరిన సీట్ల పంపకాలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై విపక్ష ‘ఇండియా’ కూటమి మధ్య అవగాహన కుదిరింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నివాసంలో శనివారంనాడు జరిగిన సమావేశంలో ఈ మేరకు భాగస్వామ్య పక్షాల మధ్య ఒక అవగాహన కుదిరినట్టు పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అహ్లాదకరమైన వాతావరణంలో సమావేశం జరిగిందని, సీట్ల పంపకాలపై భాగస్వామ్య పార్టీలు ఒక విస్తృత అవగాహనకు వచ్చాయని సమావేశానంతరం బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్ తెలిపారు.

5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం కింద 14మంది నర్సింగ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి జర్మనీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఉద్యోగాల కాల్ లెటర్స్ అందాయి. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జర్మనీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (DDUGKY) – విదేశ్ అనుసంధానంతో గ్రామీణ యువతకు అంతర్జాతీయ ప్లేస్ మెంట్స్ […]

యూకేలో సాంప్రదాయబద్ధంగా గణేష్‌ నిమజ్జనం..!

పది రోజుల గణేశోత్సవం నేటితో ముగియనున్న నేపథ్యంలో UKలోని ఓ నదిలో భారతీయులు గణేష్ నిమజ్జనం చేస్తున్నట్లు చూపించే ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఇందులో సాంప్రదాయ దుస్తులు ధరించిన భారతీయ భక్తుల బృందం పడవలో గణేష్ విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేశారు. ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సంప్రదాయం పేరుతో విదేశాల్లో నదులను ప్రజలు ఎందుకు కలుషితం చేస్తున్నారు? అని నెటిజన్‌ ప్రశ్నించగా “మనం ఎక్కడ ఉన్నా భారతీయ సంస్కృతి […]

తిరుమలలో అన్నప్రసాదం పంపిణీ నిలిపివేత.. ఎప్పటి వరకూ అంటే?

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి సోమవారం ఉదయం వరకూ తలుపులు మూసివేయనున్నారు. మరోవైపుచంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంనుంచి తిరుమలలో అన్నప్రసాద వితరణ నిలిపివేయనున్నారు. మరుసటి రోజు అంటే సెప్టెంబరు 8న ఉదయం 8.30 గంటల వరకూ అన్నప్రసాద వితరణ ఉండదు. ఎనిమిది గంటల 30 నిమిషాలకు అన్నప్రసాదాల పంపిణీ పునః ప్రారంభిస్తారు.

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ

ప్రధాని నరేంద్రమోడీ శనివారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. జపాన్, చైనా దేశాల పర్యటన ముగించుకుని విచ్చేసిన ప్రధాని మోడీ తన పర్యటన విశేషాలను రాష్ట్రపతితో ప్రస్తావించారు. షాంఘై సహకార సంస్థ 25 వ వార్షిక సమావేశాలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో షాంఘై సహకార సంస్థ అభివృద్ధి వ్యూహం, గ్లోబల్ గవర్నెన్స్‌లో సంస్కరణలు, ఉగ్రవాద నిరోధక చర్యలు, శాంతి, భద్రత , ఆర్థిక రంగాల్లో సహకారం, సుస్థిర అభివృద్ధిపై […]

గణేశుడికి బిగ్ బీ అమితాబ్ భారీ విరాళం.. తిడుతోన్న నెటిజన్లు..

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ముంబైలోని ప్రసిద్ధ గణపతి లాల్‌బాగ్చా రాజాకు రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చారు. లాల్‌బాగ్ రాజుకు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రూ. 11 లక్షలు విరాళంగా ఇవ్వడాన్ని చాలా మంది ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం బిగ్ బీపై తీవ్ర కోపంతో ఉన్నారు. భారీ వర్షాలు, వరదలతో పంజాబ్ బిక్కు బిక్కుమంటోంది. బిగ్ బీ గారు.. మీరు పంజాబ్ కోసం ఏదైనా చేసి ఉంటే మరింత ఆనందదాయకంగా ఉండేది’ అని చాలా మంది […]

రెండు టెర్రర్‌ గ్రూపులకు మా దేశం నుంచే నిధులు : కెనడా నివేదిక

కెనడా దేశాన్ని వేదికగా చేసుకుని ఖలిస్థానీ ఉగ్రవాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మన దేశం అనేక సందర్భాల్లో ఆరోపించింది. ఆ ఆరోపణలను కెనడా పలు సందర్భాల్లో తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే కెనడా ప్రభుత్వం ‘టెర్రర్‌ ఫైనాన్సింగ్‌’ పై తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ‘రాజకీయ ప్రేరేపిత హింసాత్మక తీవ్రవాదం కేటగిరీలో ఉన్న హమాస్‌, హెజ్‌బొల్లా, ఖలిస్థానీ వంటి ఉగ్ర సంస్థలకు కెనడా నుంచే నిధులు సమకూరుతున్నట్లు అధికారులు గుర్తించారు.

రాజమండ్రి జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదల

వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు మధ్యంతర బెయిల్‌ లభించడంతో శనివారం మధ్యాహ్నం ఆయన జైలు నుంచి బయటికి వచ్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు శనివారం మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తిరిగి 11వ తేదీన సరెండర్‌ కావాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది.

భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. బిసిసిఐ ఫైనల్ నిర్ణయం..

ఆసియా కప్ 2025 టోర్నమెంట్  సెప్టెంబర్ 9వ తేదీన ఈ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడొద్దని డిమాండ్లు వస్తున్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడవద్దని బిసిసిఐపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ, బిసిసిఐ దీనిపై ఇప్పటివరకూ రియాక్ట్ కాలేదు. అయితే కొద్ది రోజుల క్రితం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశంతో భారత్ ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని.. కేవలం మల్టీ నేషనల్ సిరీస్‌లలో […]

రోప్‌వే కూలి ఆరుగురు దుర్మరణం..

గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని పావగఢ్ కొండపై ఉన్న శక్తిపీఠ్ స్థలంలో శనివారం మధ్యాహ్నం కార్గో రోప్‌వే ట్రాలీ కూలిపోవడంతో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. కొండపైకి నిర్మాణ సామాగ్రిని రవాణా చేసే కార్గో రోప్‌వే ట్రాలీ.. కేబుల్స్ తెగిపోయి కూలిపోయింది.. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నాల్గవ టవర్ నుండి పడిపోయినట్లు పోలీసులు తెలిపారు.తాడు తెగిపోవడానికి గల కారణం ట్రాలీ దాని లోడ్ సామర్థ్యానికి మించి వస్తువులను తీసుకువెళుతుందా.. సాధారణ తనిఖీలలో లోపాలు ఉన్నాయా అని అధికారులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON