మహిళల ఆసియా కప్ హాకీలో భారత్ శుభారంభం
మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన పోరులో భారత మహిళా టీమ్ 11-0 గోల్స్ తేడాతో థాయిలాండ్‌ను చిత్తు చేసింది. ఇందులో విజేతగా నిలిచే టీమ్ బెల్జియం వేదికగా జరిగే మహిళల ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తోంది. ముంతాజ్ ఖాన్ ఏడో నిమిషంలోనే తొలి గోల్ చేసింది. 49వ నిమిషంలో ముంతాజ్ తన రెండో గోల్‌ను సాధించింది.ఉదిత, బ్యూటీడంగ్ డంగ్‌లు కూడా రెండేసి గోల్స్ చేశారు. దీంతో భారత్ […]