loader

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవం జరగనుంది. ఈ ఉత్సవంలో హోం మంత్రి అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అందులో భాగంగా ముందుగా షెడ్యుల్ కూడా ఖరారు అయింది. కానీ ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పార్టీ ఎంపీలతో కలిసి ఆయన అభ్యాస్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. దీంతో తన హైదరాబాద్ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.

నారా లోకేశ్ ను అభినందించిన ఏపీ కేబినెట్

ఈ రోజు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం చోటుచేసుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పై కేబినెట్ సహచరులు ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఇచ్చిన మాట నిలబెట్టుకుని డీఎస్సీని విజయవంతంగా నిర్వహించారంటూ మంత్రులు లోకేశ్‌ను అభినందించారు. అభ్యర్థుల భవిష్యత్తు దృష్ట్యా లోకేశ్‌ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి గౌరవాన్ని తీసుకువచ్చాయని వారు అన్నారు.

యూఏఈలో.. రూ.35 కోట్ల లాటరీ గెలుచుకున్న భారతీయుడు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నివసిస్తున్న భారతీయుడు జాక్‌పాట్‌ కొట్టాడు. సెప్టెంబర్ 3న జరిగిన అబుదాబి బిగ్ టికెట్ సిరీస్ 278 డ్రాలో సుమారు రూ.35 కోట్లు గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్నాడు. బిగ్ టికెట్ నిర్వహకుల నుంచి ఈ ఫోన్‌ కాల్‌ అందుకున్న సందీప్‌ కుమార్‌ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. భారత్‌లో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి, ముఖ్యంగా తన తండ్రి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపాడు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత సొంత […]

ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూత

లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూశారు. గురువారం (సెప్టెంబర్ 4) తన 91 ఏళ్ల వయసులో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇటలీలోని మిలన్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అర్మానీ మరణ వార్తను ఆయన ఫ్యాషన్ హౌస్ ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించింది. ఫ్యాషన్ ఐకాన్ చిత్రాన్ని పంచుకుంటూ, సంస్థ ఇలా పేర్కొంది. అర్మానీ గ్రూప్ సృష్టికర్త, వ్యవస్థాపకుడు, నిరంతర ప్రేరణ శక్తి అయిన సిగ్నర్ […]

ఆధార్ కార్డ్ చూపిస్తే సబ్సిడీ ధరకే ఉల్లిపాయలు..

ఉల్లిపాయ ధరలు పెరిగిపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. తక్కువ ధరకే ఉల్లిపాయల్ని అమ్ముతోంది. మూడు పెద్ద నగరాల్లో మొబైల్ వాన్లు, స్టాళ్ల ద్వారా ఉల్లిపాయల అమ్మకం మొదలైంది. ప్రభుత్వం రూ.24 కిలో ధరకి ఉల్లిపాయలు అమ్ముతోంది. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో అమ్మకం మొదలైంది. ఇవి మొబైల్ వాన్లు, నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్ అనే సహకార సంస్థల స్టేషనరీ స్టాళ్ల ద్వారా అమ్ముతున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ మొబైల్ వ్యాన్లను జెండా ఊపి […]

వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం..

నగర వ్యాప్తంగా 303 కిలోమీటర్లు మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నగరంలో 13 కంట్రోల్ రూమ్‌‌లు , 30 వేల మంది పోలీసులతో బందోబస్తు రవాణా కోసం 160 గణేష్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేయబడ్డాయని అధికారులు వెల్లడించారు. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను, 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జన స్థలాల్లో సిద్ధంగా […]

తిండి తిప్పలు మానేసి.. యూరియా కోసం రైతుల పడిగాపులు

రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తిండి తిప్పలు, నిద్రాహారాలు మాని, రేయి పగలు అన్న తేడా లేకుండా ఎండ వానను లెక్కచేయకుండా అన్నదాతలు యూరియా కోసం రోజూ పడిగాపులు కాస్తూనే ఉన్నారు. వ్యవసాయ పనులు వదిలేసి మరీ యూరియా కోసం సింగిల్ విండో కార్యాలయాల చుట్టూ ప్ర‌దిక్షిణ‌లు చేస్తున్నా బస్తా యూరియా కూడా దొరకడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధితులను ఆదుకుంటాం.. పంట నష్టపరిహారం చెల్లిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు వరదలకు గురయ్యాయి పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డికి వెళ్లారు. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామానికి చేరుకున్న ఆయన.. వరద బాధితులను కలుసుకుని పరామర్శించారు. వరదల సమయంలో బలహీనంగా మారిన లింగంపల్లికుర్దు ఆర్ అండ్ బి బ్రిడ్జిని సీఎం పరిశీలించారు. పొలాల్లో ఇసుక మట్టిపాలైపోయినట్లు, వరదల వల్ల పంటలు పూర్తిగా నాశనం అయ్యాయని, గృహాలు కూడా మునిగిపోయి జీవనోపాధి దెబ్బతిన్నదని తెలిపారు. బాధాకర […]

ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరికీ ఆరోగ్య బీమా కల్పించేందుకు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పౌరులందరికీ హెల్త్‌ ఇన్సూరెన్స్ కల్పించనుంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. యూనివర్సల్‌ హెల్త్‌పాలసీని అంగీకరించారు. ఇందులో ఎన్టీఆర్‌ వైద్య సేవతోపాటు అన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్‌ పాలసీ అమలుకు నిర్ణయించారు. ఆయుష్మాన్‌ భారత్‌-ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం కింద యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ ఉంటుంది.

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం – ఫేక్ న్యూస్ కట్టడికి కొత్త చట్టం

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం ఎక్కువైపోయిందని ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఫేక్ న్యూస్ కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకు రావాలని నిర్ణయించింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల నివారణకు సీఎం మంత్రి వర్గ సమావేశంలో చర్చించారు. మంత్రులు అనిత, నాదెండ్ల, అనగాని, పార్థసారధితో ఉపసంఘం ఏర్పాటు చేశా. కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనలను రూపొందించనున్నారు. తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలని సీఎం చంద్రబాబు ఉపసంఘ సభ్యులకు సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON