loader

GSTలో ఇక 5 శాతం 18 శాతం పన్ను శ్లాబులే, ఈ నిర్ణయం ఎప్పటి నుండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో GST స్లాబ్‌లను 5 శాతం, 18 శాతం, మూడవ స్లాబ్ ప్రత్యేకంగా ఉంటుంది. 28 శాతం స్లాబ్‌ను GST నుంచి తొలగించారని ఆయన అన్నారు. కొత్త GST  22సెప్టెంబర్ 2025 నుంచి అమలులోకి వస్తాయి. రోటీ, పరాటా, ఛెనా పనీర్‌పై పన్ను ఉండదు. ఉప్పు కారంగా ఉండే బుజియా  సాస్ పాస్తా చాక్లెట్ కాఫీపై 18% బదులుగా 5% పన్ను విధిస్తారు. ఎయిర్ కండిషనర్లు, టీవీలు, […]

జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం.. ఆ రెండు శ్లాబ్‌లు తొలగింపు

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం నాలుగు శ్లాబ్‌లు ఉండగా..ఇకపై రెండు శ్లాబ్‌లు మాత్రమే ఉండనున్నాయి. 12శాతం, 28శాతం శ్లాబ్‌లు తొలగింపుకు జీఎస్టీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై కేవలం 5, 18శాతం శ్లాబ్‌లు మాత్రమే ఉండనున్నాయి.

కేంద్ర కేబినెట్‌ సమావేశం.. 70వేల మందికి ఉపాధి అవకాశాలు..!

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. దేశంలో కీలకమైన ఖనిజాల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి రూ. 1,500 కోట్ల ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 సంవత్సరం వరకు ఆరు సంవత్సరాల కాలానికి వర్తిస్తుంది.ఈ పథకం దాదాపు రూ.8,000 కోట్ల పెట్టుబడిని తీసుకువస్తుందని.. దాదాపు ప్రత్యక్షంగా, పరోక్షంగా 70వేల ఉద్యోగాలను తీసుకువస్తాయని భావిస్తున్నారు. ఈ పథకం నేషనల్ క్రిటికల్ […]

డీఎంకే కౌన్సిలర్ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరిన దళిత అధికారి..

దళిత ప్రభుత్వ అధికారి డీఎంకే కౌన్సిలర్‌ కాళ్లు పట్టుకున్నాడు. ఆమెను బతిమాలడంతోపాటు క్షమాపణ కోరాడు. విల్లుపురం జిల్లా తిండివనం మున్సిపాలిటీలో దళిత ప్రభుత్వ ఉద్యోగి మునియప్పన్‌ను ఒక పత్రం కోసం కౌన్సిలర్ రమ్య, ఆమె భర్త రాజా డిమాండ్‌ చేశారు. ఆలస్యం చేయడంతో తనను కులం పేరుతో దూషించినట్లు ఆయన ఆరోపించాడు. ఈ నేపథ్యంలో కొందరు అధికారుల బలవంతంతో కౌన్సిలర్ రమ్య కాళ్లపై పడి క్షమాపణ చెప్పినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెలవు

తెలంగాణ ప్రభుత్వం గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 6వ తేదీ సెలవు ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది. అక్టోబర్ 11వ తేదీ(0ct 11) రెండో శనివారం అయినప్పటికీ, దాన్ని పనిదినంగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లో జరిగే గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి GHMC భారీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి రావచ్చని భావిస్తున్నారు.

బీఆర్ఎస్‌కు కవిత కౌంటర్.. ఎక్స్ వేదికగా ట్వీట్

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎవరికోసమో.. హరీష్ రావును టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే తేల్చుకోవడానికి పద్ధతులు వేరే ఉన్నాయని, శత్రువులకు బలం చేకూర్చేలా మాట్లాడటంలో ఎజెండా ఏంటో ప్రజలు గమనిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేయగా… నిజం మాట్లాడినందుకు ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తే.. తెలంగాణ ప్రజల కోసం ఇంతకు వందరెట్లు ఎక్కువైనా భరిస్తా అని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్‌కు కవిత కౌంటర్ ఇచ్చారు.

పంపకాల్లో తేడాలొచ్చే కొట్లాటలు..సీఎం రేవంత్‌రెడ్డి

లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. పంపకాల్లో తేడాలు వచ్చి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అక్క, అన్న, చెల్లి, బావ ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారు. దోపిడీ సొమ్ము వాళ్లింట్లో చిచ్చు పెట్టింది. సంపాదించుకున్న టీవీలు, పేపర్ల కోసం కొట్టుకుంటున్నారు. వాళ్లు వాళ్లు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారు. మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు. చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకేముంది. బీఆర్ఎస్ ను ప్రజలే బొందపెట్టారని సీఎం రేవంత్ మండిపడ్డారు.

సీట్ల పంపకాలపై అమిత్‌షా కీలక సమావేశం

త్వరలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్రం హోం మంత్రి అమిత్‌షా బుధవారంనాడు కీలక సమావేశం జరిపారు. ఈ సమవేశంలో బిహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 74 సీట్లు గెలుచుకుంది. జేడీయూ 115 సీట్లలో నిలబడి 43 చోట్ల గెలిచింది. ఎల్జేపీ 135 అసెంబ్లీ స్థానాలకు […]

వైసీపీకి అసలు బుద్ధుందా ? చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు పలు అంశాలపై వైసీపీ వైఖరిని తప్పుబట్టారు. వైఎస్‌ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. అసలు ఆ పార్టీ నాయకులకు బుద్ధుందా అంటూ మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు.. తాము కాదని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫేక్‌ రాజకీయాలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని, ఎరువుల కొరత సృష్టించినా తప్పుడు ప్రచారం చేసినా కేసులు […]

ఖైర‌తాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్‌.. ఇబ్బందులు ప‌డుతున్న వాహ‌న‌దారులు

ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్ప‌డింది. భ‌క్తుల వాహ‌నాల‌ను పార్కింగ్ చేసుకునే సదుపాయం లేక‌పోవ‌డం మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. సోమాజిగూడ‌, రాజ్‌భ‌వ‌న్ రోడ్డు, ల‌క్డీకాపూల్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్‌, స‌చివాల‌యం మార్గాల్లో కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. వాహ‌నాలు నెమ్మ‌దిగా క‌దులుతున్నాయి. ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేసేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON