ఉచిత కరెంట్ అంటే.. వైఎస్ పేరు గుర్తుకు వస్తుంది-సీఎం రేవంత్ రెడ్డి
రైతులకు వ్యవసాయం దండగ కాదు పండుగ అనే విధంగా దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పని చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా వైఎస్ ప్రభావితం చేశారని తెలిపారు. ఉచిత కరెంట్ అంటేనే వైఎస్ పేరు గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో సీఎం పాల్గొని మీడియాతో మాట్లాడారు.