loader

లండన్ లో హరీష్ రావు..ఇదేం ట్విస్ట్..?

ఆదివారం అర్థరాత్రి వరకూ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై తీవ్రంగా పోరాడిన హరీష్ రావు, సోమవారం సాయంత్రానికే లండన్‌లో ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై చర్చించేందుకు ఉదయం ఫామ్‌హౌస్‌కు వెళ్లిన నేతల్లో హరీష్ రావు లేకపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే లండన్ విమానాశ్రయంలో ఆయనకు ఎన్నారై కార్యకర్తలు స్వాగతం పలికిన ఫోటోలు బయటకు రావడంతో ఆయన విదేశాల్లో ఉన్న సంగతి స్పష్టమైంది.

హరీష్‌రావుకు మద్దతుగా కేటీఆర్ ట్వీట్..! ఎమ్మెల్సీ కవిత ఆరోపణల తర్వాత..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు అప్రతిష్ట రావడానికి కారణం హరీష్‌ రావు అని ఆరోపణలు చేసిన తర్వాత కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. డైనమిక్ లీడర్ హరీష్‌ ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ BRS పెట్టిన పోస్ట్‌ను కేటీఆర్‌ రీ పోస్ట్ చేశారు. నీటిపారుదల గురించి కాంగ్రెస్ నేతలకు హరీష్‌ రావు ఒక్కరే క్లాస్‌ పీకారంటూ ఓ వీడియోను బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారిక ఎక్స్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీష్ శంకర్..

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో దర్శకుడు హరీష్ శంకర్ మార్క్ కనబడుతుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో త్రీ పీస్ సూట్, టోపీతో పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి పవన్ కళ్యాణ్ చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హరీశ్ రావు, సంతోష్ తనపై కుట్రలు చేసారన్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి హరీశ్ రావు మరియు మాజీ ఎంపీ సంతోష్ తమపై రాజకీయ కుట్రలు పన్నారని ఆమె ఆరోపించారు. ఆ కుట్రల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపిస్తూ, వారంతా కలిసి లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తాం : రాహుల్ గాంధీ

ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇటీవల తాము అణుబాంబు పేల్చామని, త్వరలో మరింత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు పేలుస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గడ్డు పరిస్థితులు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు. బీహార్‌లోని పాట్నాలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సిన్క్లేర్ సీఈఓ చేతుల మీదుగా ఇండియా డిజైన్ చేసిన చిప్ ఆవిష్కరణ

సెమికాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్‌కు ముందు, అమెరికాకు చెందిన సిన్క్లేర్ సంస్థ భారతదేశంలో తయారైన డైరెక్ట్ టు మొబైల్ (D2M) చిప్‌ ఆధారిత టాబ్లెట్‌ను ప్రదర్శించింది. ఈ చిప్‌ను సాంక్య ల్యాబ్స్ అభివృద్ధి చేయగా.. ఇది ఇంటర్నెట్ లేకుండానే టీవీ ప్రసారాలను నేరుగా మొబైల్ ఫోన్‌లకు అందించగలిగే ప్రపంచంలోనే మొదటి టెక్నాలజీ. చిప్‌లో ఉపయోగించిన ప్రుత్వి-3 ATSC 3.0 చిప్‌సెట్ భారత శాస్త్రవేత్తల తేజస్సుకు గొప్ప ఉదాహరణ.

ఒకే కారులో ప్రయాణించిన మోదీ, పుతిన్

తింజియన్ షాంఘై సహకార సదస్సు ప్రొసీడింగ్స్ ముగిసిన తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారంనాడు ఒకే కారులో ప్రయాణించారు. ‘ఎస్‌సీఓ సదస్సు వేదిక వద్ద ప్రొసీడింగ్ పూర్తయిన తర్వాత అధ్యక్షుడు పుతిన్, నేను కలిసి ఒకే కారులో ద్వైపాక్షిక భేటీ వేదికకు చేరుకున్నాం. ఇద్దరి మధ్య ఎప్పుడూ చాలా లోతైన చర్చలు ఉంటాయి’ అని మోదీ తెలిపారు. ఇద్దరూ కారులో ప్రయాణిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు.

ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోంది: సుదర్శన్ రెడ్డి

భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోందని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం అత్యున్నతమైన వ్యవస్థ అని ఉద్ఘాటించారు. ఇవాళ(సోమవారం) తాజ్ కృష్ణాలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని.. ప్రతిపక్షాల అభ్యర్థినని నొక్కిచెప్పారు సుదర్శన్ రెడ్డి.

మహారాష్ట్ర నుంచి తెలంగాణకు నకిలీ డిటర్జెంట్ అక్రమ రవాణా

మహారాష్ట్ర నుంచి నకిలీ ఘడీ బ్రాండ్ డిటర్జెంట్ పౌడర్ ను తరలిస్తున్న వాహనాన్ని జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష విలువైన 15 క్వింటాళ్ల డిటర్జెంట్ పౌడర్ ను మహారాష్ట్ర అమరావతి నుంచి ఆదిలాబాద్ కు చెందిన రూపేష్ అగర్వాల్ కు విక్రయించే క్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని తాంసీ బస్టాండు వద్ద పోలీసులు పట్టుకున్నట్లు పేర్కొన్నారు జిల్లాలో నకిలీ ఉత్పత్తులను తరలించి విక్రయించే వారి సమాచారం తెలిస్తే పోలిసులకు సమాచారం ఇవ్వాలని వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. […]

297 శాతం పెరిగిన ప్రపంచకప్ ప్రైజ్ మనీ..

మహిళల ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం, ఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైజ్ మనీని 297 శాతం పెంచింది. ఐసీసీ చీఫ్ జై షా మహిళల ప్రపంచ కప్ బహుమతి డబ్బును 13.88 మిలియన్ డాలర్లు అంటే రూ. 122 కోట్లకు పైగా నిర్ణయించారు. ఐసీసీ చీఫ్ అయిన వెంటనే, జై షా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మహిళల క్రికెట్‌ను వేరే స్థాయికి తీసుకెళ్లడానికి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON