loader

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ – ప్రధాని మోడీ భేటీ

SCO సదస్సులో ప్రధాని మోడీని కలవడం, స్వాగతం పలకడం ఆనందంగా ఉందని జిన్‌పింగ్ అన్నారు. చైనా-భారత సంబంధాలు మళ్ళీ పుంజుకుంటున్నాయని చైనా, భారతదేశాలు రెండు ప్రాచీన నాగరికతలు, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు, గ్లోబల్ సౌత్‌లో ముఖ్య సభ్యులం” అని, ఈ సంవత్సరం భారత్-చైనా దౌత్య సంబంధాలకు 75వ వార్షికోత్సవం. “రెండు దేశాలు వ్యూహాత్మక దృక్పథంతో, దీర్ఘకాలిక దృష్టితో సంబంధాలను చూడాలి, నిర్వహించాలి” అని జిన్‌పింగ్ అన్నారు. ప్రధాని మోడీ కూడా రెండు దేశాల మధ్య […]

అలా చేయకపోతే వారికి రేషన్ కట్ చేస్తామని అధికారుల హెచ్చరిక…!

తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రేషన్ పంపిణీ ప్రక్రియను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని లబ్ధిదారులకు రేషన్ సదుపాయం తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. సెప్టెంబర్ నెల లోపు తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు. చిన్నపిల్లలను (ఐదు సంవత్సరాల లోపు) ఈ ప్రక్రియ నుండి మినహాయించినట్లు తెలిపారు.

సభలో చర్చ వద్దని మేం చెప్పలేదు: హరీశ్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్‌ నివేదికపై చర్చలో హరీశ్ రావు సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. 660 పేజీల నివేదికపై అరగంటలో చర్చ సాధ్యమా? అని ప్రశ్నిస్తూ.. కనీసం రెండుగంటల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రాజకీయ ప్రేరణతో తయారైన డొల్ల రిపోర్టుగా అభివర్ణించారు. 8బి నోటీసుల్లేకుండా నివేదిక ఇవ్వడం చట్ట విరుద్ధం అని,  కోర్టుకు వెళ్లడం రాజ్యాంగ హక్కు అని సభలో చర్చ వద్దని ఎప్పుడూ చెప్పలేదని, […]

కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసిన రామ్ చరణ్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘పెద్ది’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలోని మైసూర్ లో జరుగుతోంది. ఆదివారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో రామ్ చరణ్ భేటీ అయ్యారు. సిద్ధరామయ్య ఆహ్వానం మేరకు మర్యాద పూర్వకంగా కలుసుకుని ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలో చరణ్ ను కర్ణాటక సీఎం ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ‘పెద్ది’ సినిమా విశేషాలను సిద్ధరామయ్య అడిగి తెలుసుకున్నారు.

అమిత్‌ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మహిళా ఎంపీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు!

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాయ్‌పూర్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి మహువా మొయిత్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. స్థానిక నివాసి, బిజెపి నాయకుడు గోపాల్ సమంతో ఫిర్యాదు మేరకు శనివారం మానా పోలీస్ స్టేషన్‌లో బిఎన్‌ఎస్ సెక్షన్లు 196, 197 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ సెక్షన్లు మతం, జాతి లేదా జన్మస్థలం వంటి కారణాలతో వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, జాతీయ సమైక్యతకు పక్షపాతపూరిత ప్రకటనలు […]

ప్రమోషన్స్ కి అనుష్క అవసరం లేదు.. డైరెక్టర్ క్రిష్ కామెంట్స్ వైరల్

విడుదలకు సిద్ధమవుతున్న ఘాటి సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో సమావేశమైంది. లీడ్ యాక్ట్రెస్ అనుష్క శెట్టి సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోవడంపై వచ్చిన ప్రశ్నలకు క్రిష్ స్పందిస్తూ, “ప్రమోషన్లకు హాజరుకావడం లేదా హాజరు కాకపోవడం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఘాటి చిత్రానికి అనుష్క ప్రమోషన్స్ అవసరం లేదు.. ఆమె నటన ఉంటే చాలు అని క్రిష్ జాగర్లమూడి అన్నారు. ‘శీలావతి’ పాత్రలో అనుష్క తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన […]

జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు..!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం మోగింది. MPTC ,ZPTC ల ఎన్నికలు నిర్వహణకు అయా జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని పేర్కొంది. సెప్టెంబరు 6వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాను సిద్దం చేయాలని ఈసీ కోరింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు […]

దేశంలోనే అతిపెద్ద మానవ తప్పిదం కాళేశ్వరం నిర్మాణం: మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం నిర్మాణం దేశంలోనే అత్యంత పెద్ద మానవ తప్పిదమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో విమర్శించారు. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా.. మేడిగడ్డ సహా మూడు బ్యారేజీలు 20 నెలలుగా పనికిరాకపోవడం రాష్ట్రానికి పెనుభారం అయ్యిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పట్లో నిపుణులు పలు సార్లు హెచ్చరికలు చేసినా.. పట్టించుకోలేదని ఉత్తమ్ మండిపడ్డారు. NDSA నివేదికలో డ్యామ్, బ్యారేజీ మధ్య తేడా గుర్తించకుండా పనులు చేశారని.. ఇది మేడిగడ్డ కుంగిపోవడానికి ప్రధాన కారణమని ఆయన […]

టియాంజిన్‌లో దౌత్యంలో కొత్త అధ్యాయం.. ఒకే వేదికపై మోదీ, పుతిన్, జిన్‌పింగ్

చైనాలోని టియాంజిన్‌లో ప్రపంచ దౌత్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆతిథ్య చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌లు SCO సమ్మిట్ వేదికపై కలిసి కనిపించారు. గ్రూప్ ఫోటో సెషన్ సందర్భంగా, SCO సభ్యులందరూ ఒకే వేదికపై ఉన్నారు. SCO సమ్మిట్ వేదికపైకి ప్రధాని మోదీ వచ్చినప్పుడు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ, పుతిన్ మధ్య తజికిస్తాన్-కిర్గిజ్స్తాన్ అధ్యక్షులు ఉన్నారు. ప్రపంచం […]

ఏఐ సాయంతో హత్య..తల్లిని చంపి..ఆపై ఆత్మహత్య… ప్రపంచంలోనే తొలిసారి

కృత్రిమ మేధస్సు సహాయంతో ఒక వ్యక్తి తన తల్లిని హత్య చేసిన ఘటన అమెరికాలో కలకలం రేపింది. చాట్‌జీపీటీని ఎక్కువగా వినియోగించే అతడు.. . తల్లి అతడిపై గూఢచర్యం చేస్తోందని, సైకెడెలిక్ డ్రగ్‌తో విషం ఇవ్వడానికి ప్రయత్నించవచ్చని చాట్‌బాట్‌ నమ్మించింది. చాట్‌బాట్ చెప్పింది నమ్మి కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రపంచంలోనే ఏఐ సాయంతో జరిగిన తొలి హత్యగా నమోదైంది. ఏఐతో ఆత్మహత్యలు పెరుగుతున్నట్టు నివేదికలు అందుతోన్న […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON