loader

పుతిన్‌ను కలవడానికి ముందు, ప్రధాని మోదీతో జెలెన్‌స్కీ ఫోన్ కాల్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవడానికి ముందు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 30 ) ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో మాట్లాడారు. ఆగస్టులో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన రెండవ టెలిఫోన్ సంభాషణ ఇది. జెలెన్‌స్కీతో జరిగిన సంభాషణ గురించి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్ నాయకుడి పిలుపునకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి పునరుద్ధరణకు భారతదేశం మద్దతును పునరుద్ఘాటించారు.

వరద బాధితులకు బాలకృష్ణ భారీ విరాళం

టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన మంచి మనసు చాటుకున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి ముందుకొచ్చారు. కామారెడ్డిలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురష్కారాన్ని అందుకున్న బాలయ్య.. ఈ సందర్భంగా ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.

ప్రజాస్వామ్యంలో హింస పనిచేయదని.. జెండా కర్రే ఆయుధంః పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌కు స్థిరత్వం కావాలని, కూటమి సర్కారు బలంగా ఉండాలని కోరుకుంటున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏమైనా తప్పులు చేస్తే ప్రజలు, రాష్ట్రం నష్టపోతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో హింస పనిచేయదని, జెండా కర్రే ఆయుధం, గుండెల నుంచి వచ్చే మాటే తూటా కావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జనసైనికులకు పిలుపునిచ్చారు. అలా చేస్తే కచ్చితంగా మార్పు వస్తుందని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం దసరా తర్వాత త్రిశూల్‌ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు […]

మామూలు ట్విస్ట్ కాదుగా.. జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్ అభ్యర్థి అతనేనా..

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫారసు చేస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే లిస్ట్‌లో అమీర్ అలీ ఖాన్ పేరు తొలగించి..అజారుద్దీన్‌కు స్థానం కల్పించింది ప్రభుత్వం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి మజ్లిస్ అభ్యర్థిగా పోటీచేసిన నవీన్ ​యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉన్న నేపథ్యంలో మజ్లిస్ పార్టీ మద్దతు కూడా తప్పనిసరి. ఈ క్రమంలోనే.. నవీన్ యాదవ్ పేరు తెరపైకి […]

అయ్యో ఎంత కష్టం..! చెట్టు కిందే గర్భిణి ప్రసవం..

రామభద్రపురం మండలం రొంపిల్లి పామాయిల్ తోటలో నివసిస్తున్న తొమ్మిది నెలల నిండు గర్భిణీ అయిన పార్వతీకి అకస్మాత్తుగా పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే మార్గమధ్యలోనే నొప్పులు ఎక్కువ కావడంతో మండల కార్యాలయం ఆవరణలో చెట్టు క్రిందే ఆరుబయట ప్రసవం జరిగి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ సమయంలో తోడుగా ఉన్న పదకొండేళ్ల కూతురే సపర్యలు చేసి తల్లికి సేవలు చేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు 108 అంబులెన్స్‌ ద్వారా ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలను ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యులు మెరుగైన […]

చైనాలో మోదీకి ఘన స్వాగతం

షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి చైనాకు చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి అద్భుతమైన స్వాగతం లభించింది. శనివారం సాయంత్రం టియాంజిన్‌లోని బిన్హాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకోగానే అక్కడి ప్రవాస భారతీయులు సంబరాలు జరుపుకున్నారు. భారతీయ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో మోదీని ఆహ్వానించారు. “వందేమాతరం”, “భారత్ మాతా కి జై” నినాదాలతో విమానాశ్రయం పరిసరాలు మార్మోగాయి.

తాడిపత్రి పర్యటనకు పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి కి తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంపై స్థానిక టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పెద్దారెడ్డి రాకను తాను అడ్డుకోవడం లేదని, కానీ గతంలో ఆయన అక్రమాలకు, దౌర్జన్యాలకు బలైన బాధితులే వ్యతిరేకిస్తున్నారని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతోమంది టీడీపీ కార్యకర్తలపై పీడీ యాక్ట్ కింద అక్రమ కేసులు నమోదు చేయించి, జిల్లా నుంచి బహిష్కరించాడు” అని విమర్శించారు.

టీడీపీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర అంతా నాటకం..ఆ రౌడీలంతా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనుషులే

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి హత్యకు కుట్ర వీడియోపై మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. అదంతా కోటంరెడ్డి ఆడుతున్న పెద్ద నాటకమని.. రౌడీ గ్యాంగ్‌లను పెంచి పోషించిందే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తులంతా ఎమ్మెల్యే కోటంరెడ్డి, మరో టీడీపీ నేత రూప్‌కు సంబంధించిన మనుషులేనని, పెరోల్ ఇప్పించే విషయంలో అడ్డంగా దొరికిపోయినందునే…ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ కొత్త డ్రామాకు తెరలేపారని […]

వెంకన్నపై భారం వేసి రాష్ట్ర అభివృద్ధిలో బుల్లెట్‌లా దూసుకెళతా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వెంకన్నపై భరోసా ఉంచుకుని, రాష్ట్ర అభివృద్ధి కోసం అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతానని ధీమా వ్యక్తం చేశారు. కరవు బారిన పడే రాయలసీమను సస్యశ్యామలంగా, రత్నాల సీమగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని ఆయన పేర్కొన్నారు. “మేము 2014 నుంచి 2019 మధ్య రాయలసీమ ప్రాజెక్టులకు ₹12,500 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ గత ఐదేళ్లలో వైసీపీ కేవలం ₹2,000 కోట్లతోనే సరిపెట్టింది. అభివృద్ధి, సంక్షేమంలో దమ్ముంటే పోటీ పడాలి” […]

కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డ కఠిన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక రేపటి నుంచి అసెంబ్లీలో చర్చకు రానుందని తెలిపారు. ఆ చర్చకు కేసీఆర్ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పులను ఆయన స్వయంగా అంగీకరించినట్టేనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON