loader

జనసేన పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు చేస్తున్నా… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

జనసేన పార్టీ 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన జన సైనికులు, వీర మహిళలు, వివిధ వృత్తి, వ్యాపార, ఉద్యోగ వర్గాల ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం, రోడ్లు బాగుపడాలి అని గుడ్ మార్నింగ్ సీఎం సార్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జనసేన పార్టీ విధానాలు అని పవన్ కల్యాణ్ తెలిపారు. పోరాట యాత్రలో భాగంగా సినిమాలు మానేద్దామని భావించాను. పార్టీని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో సినిమాలు తప్పనిసరై చేస్తున్నాను. ’అని డిప్యూటీ […]

జపాన్ పర్యటనలో మోదీకి ప్రత్యేక కానుక

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో మొదటి రోజునే ఒక ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. జపాన్‌లో ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు ప్రతీకగా భావించే దరుమా బొమ్మను దరుమాజీ ఆలయ ప్రధాన పూజారి రెవ్ సైషీ హిరోసే మోదీకి అందజేశారు. జపాన్‌లో దరుమా బొమ్మను అదృష్టం, పట్టుదల ప్రతీకగా భావిస్తారు. ఈ బొమ్మను సాధారణంగా కాగితపు గుజ్జుతో తయారు చేస్తారు. దీని కింద భాగం గుండ్రంగా ఉండటం వల్ల కింద పడినా వెంటనే లేచి నిలబడుతుంది.

విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాఖలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం రోజున జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు, ప్రజా ప్రతినిదులు డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులు సాగర తీరాల అందాలను వీక్షించేలా బస్సులు ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు మొత్తం 16 కి.మీ మేర ప్రయాణం సాగనుంది. ‘‘పర్యాటకులకు మరింత సౌకర్యం కల్పించేందుకు 24 గంటల టికెట్‌ను రూ.500ను కేవలం రూ. 250కే ప్రయాణం చేసేలా అవకాశం కల్పిస్తుంది’’ అని […]

ఇప్పుడు తలనొప్పి అంటున్నారు.. పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సంచలన ఆరోపణలు

మే నెల నుంచి.. జూలై నెల 31వ తేదీ వరకు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి విచారణ కోసం..3 నెలల్లో తాము 11 సార్లు హైకోర్టుకు వచ్చామని.. సుగాలి ప్రీతి తల్లి వెల్లడించారు. అయితే వచ్చిన ప్రతీ సారి పవన్ కళ్యాణ్‌ను కలవాలని అపాయింట్‌మెంట్ అడిగినట్లు చెప్పారు. కానీ తమను కలిసేందుకు.. అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం.. అసలు సుగాలి ప్రీతి కేసు అంటేనే తలనొప్పి వస్తుందని అంటున్నారని […]

నడిరోడ్డుపై ‘గట్కా’ ప్రదర్శన.. సిక్కు వ్యక్తిని కాల్చి చంపిన పోలీసులు..

రోడ్డు మధ్యలో గట్కా (కత్తితో ప్రదర్శన) ప్రదర్శిస్తున్న భారత సంతతికి చెందిన సిక్కు యువకుడ్ని అమెరికా పోలీసులు కాల్చి చంపారు. అతడ్ని 36 ఏళ్ల గురుప్రీత్ సింగ్‌గా గుర్తించారు. లాస్ ఏంజెలెస్ డౌన్‌టౌన్‌లోని క్రిప్టో.కామ్ అరీనా సమీపంలో ఒక కత్తి పట్టుకుని ఉన్నాడని పోలీసులు తెలిపారు. నచ్చచెబుతున్నా వినిపించుకోలేదు సరికదా పోలీసులపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించడంతో అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.

అనుచరులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అత్యవసర భేటీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు ఉన్న వీడియో వైరల్ కావడం.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తన హత్యకు ప్లాన్ చేస్తూ రౌడీషీటర్లు మాట్లాడుకున్న వీడియో వైరల్‌ కావడంతో దానిపై చర్చించేందుకు నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయంలో తన తమ్ముడు గిరిధర్ రెడ్డి సహా ముఖ్య అనుచరులతో కోటంరెడ్డి శ్రీధర్ […]

విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

విద్యాశాఖ‌పై స‌మీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణ‌లో విద్యా వ్యవ‌స్థను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, ప్రొఫెషిన‌ల్ కోర్సులు బోధించే క‌ళాశాల‌ల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫేషియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్పనిస‌రి చేయాల‌ని సీఎం ఆదేశించారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగ‌వ‌డంతో పాటు ప్రొఫెష‌న‌ల్ విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరిక‌ట్టవ‌చ్చన్నారు.

జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. గాయత్రీ మంత్రం, భజనలతో ఆహ్వానం

ప్రధాని మోదీకి జపాన్‌లో ఘన స్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయంలో జపాన్ మహిళలు.. ఆయనకు ఆహ్వానం పలికారు. గాయత్రీ మంత్రంతో పాటు భజనలతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ మహిళలను ప్రధాని మోదీ అభినందించారు. ఇక తన జపాన్ పర్యటన.. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

తలను నరికి టేబుల్‌ మీద పెట్టాలి.. అమిత్‌షాపై ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారులును ప్రోత్సహించే వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ అన్నారని , కాని చొరబాట్లను అరికట్టడంలో అమిత్‌షా విఫలమయ్యారని అన్నారు. అమిత్‌షా తల నరికి టేబుల్‌పై పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో చొరబాట్లకు బీఎస్‌ఎఫ్‌ కారణమని ఆరోపించారు మహువా మొయిత్రా.. కాగా..తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. […]

బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అవుట్! తాత్కాలిక ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా

సౌరవ్ గంగూలీని బలవంతంగా ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి తప్పించిన బీసీసీఐ, రోజర్ బిన్నీ విషయంలో కూడా ఇదే ధోరణి వ్యవహరించినట్టు సమాచారం. రోజర్ బిన్నీ, బీసీసీఐ ప్రెసిడెంట్ పొజిషన్‌ నుంచి తప్పించినట్టుగా వార్తలు వస్తున్నాయి. రోజర్ బిన్నీ తప్పుకోవడంతో ఆ పొజిషన్‌లో బీసీసీఐ సీనియర్ బోర్డు అధికారి, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.. తాత్కాలిక ప్రెసిడెంట్‌గా వ్యవహరించబోతున్నట్టు సమాచారం..

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON