ఏపీకి NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి
ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. మంత్రి నారాయణ, ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత ఆయన తొలిసారిగా ఏపీకి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.