loader

ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉండాలి: సీఎం చంద్రబాబు నాయుడు

పార్లమెంట్ కమిటీల కూర్పుపై సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి 75 మంది పార్టీ నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ పార్టీ కమిటీల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన త్రి సభ్య కమిటీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. మొత్తం 34 మంది సభ్యులతో పార్లమెంట్ కమిటీలు ఏర్పాటుకానున్నట్లు తెలిపారు. అధ్యక్షునితో పాటు ఏడుగురు చొప్పున ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, కార్య నిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులతో పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

రేవంత్ కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ సీక్రెట్ మీటింగ్..?

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశం రెండు రోజుల క్రితం జరిగినట్లు, ఈ సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి రహస్య సమావేశం తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది.

చెన్నె, లక్నోలో పర్యటించనున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డీ

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన రేపు, ఎల్లుండి చెన్నై, లక్నోలలో పర్యటించనున్నారు. సుదర్శన్ రెడ్డి చెన్నై పర్యటనలో తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకే ఎంపీలతో భేటీ కానున్నారు. చెన్నై పర్యటన తర్వాత సుదర్శన్ రెడ్డి లక్నోకు వెళ్లనున్నారు. అక్కడ ఆయన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశం కానున్నారు.

రిజర్వేషన్లు, ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక సమీక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై సమీక్షలు నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఆయన ఈరోజు పలు సమావేశాలు నిర్వహించారు. కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పీసీసీ కోర్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మీనాక్షి, భట్టి, మహేశ్, ఉత్తమ్, శ్రీధర్ బాబు వంటి కీలక నేతలు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించారు.

ఏపీలో పారిశుధ్య కార్మికులకు గుడ్‌న్యూస్… కొత్త స్కీంను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పెద్దాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రమాద, ఆరోగ్య బీమా స్కీంను లాంఛనంగా ప్రారంభించారు పట్టణాభివృద్ధి శాఖ-ఆక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ స్కీంను అమలు చేసేలా ఒప్పందం కుదిరింది శాశ్వత ఉద్యోగులకు ఒక రూ. 1 కోటి వరకు ప్రమాద బీమా, పది లక్షల లైఫ్ కవర్ లభించనుంది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇరవై లక్షల ప్రమాద బీమా, రెండు లక్షల లైఫ్ కవర్ […]

3 దేశాలు, 54 మ్యాచ్‌లు.. 2027 వన్డే ప్రపంచ కప్ వేదికలు ఖరారు

2027లో జరగనున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఈ టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా 44 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వగా, మిగిలిన 10 మ్యాచ్‌లు జింబాబ్వే, నమీబియాలో జరుగుతాయి. దక్షిణాఫ్రికాలో మ్యాచ్‌లు జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా, కేప్ టౌన్, డర్బన్, గ్కెబెర్హా, బ్లూమ్‌ఫోంటెయిన్, తూర్పు లండన్, పార్ల్‌లలో జరుగుతాయని CSA ఒక ప్రకటనలో తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది, అప్పులు పెరిగాయి…: కూటమి సర్కార్‌పై జగన్ విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి సంబంధించి ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ నివేదిక గణంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి విషయంలో వారి వైఫల్యాలు బయటపడుతున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయంలో (పన్నులు, పన్నేతర వసూళ్లు), అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే కేవలం 3.08 శాతం […]

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ షురూ!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి మీదుగా గ్రీన్‌ ఫీల్డ్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూముల సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. గ్రామాల వారీగా పంట భూముల సర్వే నంబర్లు, ఎల్‌పీఎం నంబర్ల వివరాలను సేకరిస్తున్నారు. వట్టిచెరుకూరు మండలంలో శుక్రవారం అధికారులు భూముల సమాచారం సేకరించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తున్నట్లు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో భూసేకరణ ప్రక్రియకు కసరత్తు జరుగుతోంది. పెదకూరపాడు, అమరావతి మండలాల్లో […]

త్వరలో చంద్రయాన్​-4 వెల్లడించిన శుక్లా

జాతీయ అంతరిక్ష దినోత్సవం 2025 సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇస్రో చీఫ్ వి. నారాయణన్ మరియు వ్యోమగామి శుభాంశు శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తదుపరి అంతరిక్ష మిషన్లపై వివరాలు వెల్లడించిన నారాయణన్, చంద్రయాన్-4లో భాగంగా వీనస్ ఆర్బిటర్ మిషన్ చేపడతామని చెప్పారు. ఇదే సమయంలో, శుభాంశు శుక్లా ప్రస్తుత కాలాన్ని భారత అంతరిక్ష పరిశోధనకు “స్వర్ణ యుగం“గా అభివర్ణించారు. చంద్రయాన్-4 మిషన్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి.2040 నాటికి భారత్ చంద్రునిపై అడుగుపెట్టడం లక్ష్యమని” స్పష్టం […]

కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్ర అరెస్టు

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్రను శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్టు చేశారు. శుక్రవారం, వీరేంద్రకు చెందిన అనేక ప్రదేశాలపై ఏకకాలంలో ఈడీ దాడులు చేసింది. ఈ సందర్భంగా 12 కోట్లకు పైగా నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. ఒక పెద్ద ఆపరేషన్‌లో అక్రమ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ రాకెట్‌ను ఛేదించింది. ఈ కేసు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఎమ్మెల్యే కెసి వీరేంద్ర, అతని సన్నిహితులకు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON