loader

చేతగాని పాలకుల వల్ల యూరియా సంక్షోభం: కెటిఆర్

రైతులను అరిగోస పెడుతున్న ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల పతనం ప్రారంభమైందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. యూరియా సంక్షోభం పైన ఆయన స్పందిస్తూ, చిల్లర రాజకీయాలు తప్ప పరిపాలన తెలియని అసమర్థులు రాజ్యమేలడం వల్లే రైతులకు ఈ కష్టాలు, కన్నీళ్లు వచ్చాయని ధ్వజమెత్తారు. ఒకవైపు బూతులు మాట్లాడడం తప్ప చేతలు రాని ఢిల్లీ పార్టీల నాయకులకు, మరోవైపు వందేళ్ల విజన్‌కు నిలువెత్తు రూపమైన కెసిఆర్‌కు ఉన్న స్పష్టమైన తేడా నాలుగు కోట్ల తెలంగాణ సమాజానికి ఇప్పుడు […]

విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లు తొలగించాల్సిందే..: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కు తెలంగాణ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లను ప్రమాదకరంగా కడతామంటే చూస్తూ ఊరుకోమనేలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది న్యాయస్థానం. అనుమతి పొందిన కేబుల్స్ తప్ప మిగతావి విద్యుత్ స్తంభాలకు ఉంచకూడదని, ఇష్టం వచ్చినట్లుగా విద్యుత్ స్తంబాలను కేబుల్ వైర్లతో నింపకూడదని హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ ఆదేశించింది. ఇలా విద్యుత్ శాఖ కేబుల్ వైర్స్ తొలగింపుకోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కు హైకోర్టు […]

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులతో వరుసగా సమావేశం అవుతూ రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించవలసిందిగా కేంద్ర ఆర్ధికమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం పథకం కింద రూ. 2,010 కోట్లు లభించాయని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మూలధన ప్రాజెక్టుల కోసం అదనంగా రూ. 5,000 కోట్లు కేటాయించాలని వినతి పత్రం […]

జైలు నుంచి ఎందుకు ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాలి .. ప్ర‌ధాని మోదీ

బీహార్‌లోని గ‌యాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. జైలు నుంచి ఎందుకు ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాలి అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఒక‌వేళ ప్ర‌భుత్వ ఉద్యోగిని 50 గంట‌ల పాటు జైలులో వేస్తే, అప్పుడు ఆ వ్య‌క్తి త‌న ఉద్యోగాన్ని కోల్పోతున్నాడ‌ని, కానీ సీఎం, మంత్రులు.. జైలులోనే ఉంటూ ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నార‌ని, కొంద‌రు జైలు నుంచే ఫైళ్లపై సంత‌కాలు చేసేవార‌ని, జైలు నుంచే ప్ర‌భుత్వ ఆదేశాలు ఇచ్చేవార‌న్నారు. ఒక‌వేళ ప్ర‌జానేత‌కు అటువంటి వ్య‌క్తిత్వం ఉంటే, అప్పుడు మ‌నం […]

బిహార్ ఓటరు జాబితాపై స్పందించిన సుప్రీం కోర్టు

బిహార్‌లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీలు వ్యవహరించిన తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో 85 వేల కొత్త ఓట్లు నమోదైతే, వాటిపై కేవలం రెండు అభ్యంతరాలు మాత్రమే వచ్చాయని కోర్టు వెల్లడించింది. ఓటరు జాబితాలో తమ పేరు లేకపోతే, దానిపై సంబంధిత ఓటర్లే నేరుగా ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఓటరు జాబితాలో పేరు ఉన్నా, ఓటు వేయలేని పరిస్థితి వస్తే, అప్పుడు మాత్రమే రాజకీయ పార్టీల సహాయం […]

కేసీఆర్ పిటిషన్.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు కీలక విచారణ జరిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ వీరు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కేసు యొక్క పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని […]

కేంద్రంలో కొత్త బిల్లులపై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఎద్దేవా

తన ట్వీట్‌ను ప్రారంభిస్తూ ప్రకాశ్ రాజ్, “మహాప్రభూ, ఓ చిలిపి సందేహం” అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రవేశపెట్టబోయే కొత్త బిల్లును ఉద్దేశిస్తూ, దాని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందా అనే ప్రశ్నను లేవనెత్తారు. “మీ మాట వినని మాజీ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిని అరెస్టు చేసి, మీకు నచ్చిన ఉప ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోబెట్టే యోజన ఏదైనా ఉందా?” అని ఆయన నిలదీశారు.

భార‌త్‌లో ఆఫీస్ తెరుస్తోన్న ChatGPT..

అమెరికాకు చెందిన ఓపెన్‌ఏఐ ChatGPT ఈ ఏడాది చివర్లో న్యూఢిల్లీలో తన తొలి కార్యాలయాన్ని ప్రారంభించబోతోంది.ఇది భారత్‌లోని వినియోగదారుల సంఖ్య రెండో అతిపెద్ద మార్కెట్ కావడంతో, దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని మరింతగా విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో దాదాపు ఒక బిలియన్‌కి పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ChatGPTని ఎక్కువగా ఉపయోగించే విద్యార్థులు ఇక్కడే ఉన్నారని కంపెనీ భావిస్తోంది. గత ఏడాదిలో వారానికి యాక్టివ్ యూజర్లు నాలుగు రెట్లు పెరిగారు.

పవన్ కళ్యాణ్‌ను సర్‌ప్రైజ్ చేసిన చిరంజీవి, స్పెషల్ మూమూంట్స్..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి విషెస్ తెలిపారు.. మెగాస్టార్ దీనిపై స్పందించారు.. ఓ ట్వీట్ చేశారు. ‘జ‌న సైన్యాధ్యక్షుడికి విజ‌యోస్తు!.. త‌మ్ముడు క‌ల్యాణ్‌.. ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట‌.. ప్రతీ అక్షరం నా హృద‌యాన్ని తాకింది. అన్నయ్యగా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో.. ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత‌, ప‌ట్టుద‌ల చూసి ప్రతీ క్షణం గ‌ర్వప‌డుతూనే ఉన్నా.

బిహార్‌ లో మహిళల ఓట్లకు ఎసరు…

బిహార్ రాష్ట్రంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌లో ఊహించని అంశం బయటపడింది. ఎస్‌ఐఆర్‌ పరిశీలన ప్రకారం, చిరునామా నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన జాబితాలో 62.6% ఓట్లు మహిళలవే. పురుషుల వాటా కేవలం 37.4% మాత్రమే. అంటే, ప్రతి మూడు మంది తొలగించబడిన ఓటర్లలో ఇద్దరు మహిళలే. ఈ ఏడాది జనవరి 1న విడుదలైన ఓటర్ల జాబితాలో, కొత్తగా ఏడు లక్షల మంది మహిళల పేర్లు మాయమయ్యాయి. ఇది కేవలం ఓ గణాంకం మాత్రమే కాదు — రాజకీయంగా, సామాజికంగా దీని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON