ఏపీ సముద్ర తీరానికి కోట్ల పెట్టుబడితో కీలక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ సముద్ర వాణిజ్యంలో భారీ అడుగు వేసింది. తూర్పు తీరాన్ని దేశానికి ప్రధాన మారిటైమ్ గేట్‌వేగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు పడింది.ప్రపంచ ప్రఖ్యాత మాయర్స్క్ గ్రూప్‌లో భాగమైన ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఒప్పందంతో రాష్ట్రానికి రూ.9,000 కోట్ల భారీ పెట్టుబడి రానుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇది పోర్టుల అభివృద్ధిని వేగవంతం చేయనుంది