loader

ప్రధాని మోడీని కలిసిన శుభాంశు శుక్లా..

భారత అంతరిక్ష యాత్రికుడు, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. “శుభాంశు శుక్లాతో విస్తృతంగా చర్చించాను. అంతరిక్షంలో ఆయన అనుభవాలు, విజ్ఞానం-సాంకేతికత అభివృద్ధి, గగన్ యాన్ మిషన్ పురోగతి వంటి అంశాలపై చర్చించాం. ఆయన విజయంపై భారతదేశం గర్విస్తోంది” అని అన్నారు. శుభాంశు శుక్లా తనతో పాటు అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లిన భారత త్రివర్ణ పతాకాన్ని ప్రధానికి అందజేశారు. అలాగే ఆక్సియమ్-4 అధికారిక మిషన్ ప్యాచ్‌ను కూడా […]

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

అమెరికా, ఇజ్రాయెల్‌ తో ఎప్పుడు అయినా యుద్ధం జరిగే అవకాశం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన యాహ్యా రహీమ్ సఫావీ తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ”మేము శాంతి ఒప్పందాల్లో లేము. యుద్ధానికి సిద్ధమవుతున్నాం” అని సఫావీ వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఎలాంటి ఒప్పందాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు యుద్ధమొకటి జరగొచ్చు. దానితోనే అంతం కావచ్చు” అని ఆయన హెచ్చరించారు.

అమెరికాలో భారతీయులకు షాక్..

అమెరికాలోని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్‌లో రాత్రికి రాత్రే ధరలు ఆకాశాన్ని తాకాయి. అదీ కూడా కొత్త టారిఫ్‌లు ఇంకా అమలులోకి రాకముందే ఈ పరిస్థితి వారికి ఎదురయ్యింది. అమెరికాలోని ఎన్నారైలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫ్రోజెన్ పరాఠాలు లాంటి వస్తువుల ధరలు రాత్రికి రాత్రే 11.99 డాలర్లు నుంచి 13.99 డాలర్లకు పెరిగాయట. మామూలుగా ఏదైనా వస్తువు ధర పెరిగితే, రూపాయిలో 10, 20 పైసలు పెరుగుతుంది. మహా అయితే ఒక రూపాయి పెరుగుతుంది. కానీ అమెరికాలో […]

జాతీయ అవార్డు విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి సన్మానం

భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైద‌రాబాద్ ను నిల‌పాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలుగు సినిమా రంగం ప్రోత్సాహాకానికి అవ‌స‌ర‌మైన చేయూత‌నందిస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్సుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్ర‌ముఖులు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆయ‌న నివాసంలో సోమ‌వారం సాయంత్రం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అవార్డు గ్ర‌హీత‌ల‌ను స‌న్మానించారు.

రాహుల్ సిప్లిగంజ్‌కు కాబోయే భార్య.. ఆ టీడీపీ నేత కుమార్తె

టాలీవుడ్ ఫేమస్ సింగర్.. రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. హరిణ్య రెడ్డి అనే యువతితో ఆయన నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది. నిశ్చితార్థం ఫోటోలు బయటకు రావడంతో హరిణ్య రెడ్డి ఎవరు? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది తెలుగు దేశం పార్టీ టీడీపీ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (NUDA)  ఛైర్మన్  కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్య రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోషల్ మీడియా […]

కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం..

దివంగత నటుడు కోట శ్రీనివాసరావు మరణించిన నెల రోజుల వ్యవధిలోనే ఆయన కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రుక్మిణి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఉక్రెయిన్ వార్, ట్రంప్ అలస్కా సమావేశం పై మోడీ-పుతిన్ చర్చలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పుతిన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో గత వారం అలాస్కాలో జరిగిన తన సమావేశం వివరాలను మోడీకి తెలియజేశారు. సంభాషణలో ప్రధానమంత్రి మోడీ ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత పరిష్కారం మాత్రమే మార్గమని మరోసారి స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ, “శాంతియుత చర్చలు, దౌత్యంతో ముందుకు సాగాలని” పుతిన్‌కు తెలిపారు.

జాతరలో ఒక్కసారిగా కూలిన ఫెయిర్ రైడ్‌..

గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలో సోమనాథ్ మహాదేవ్ ఆలయ జాతరలో ఎత్తైన టవర్ రైడ్ దాదాపు 40 అడుగుల ఎత్తుకు చేరుకొని నెమ్మదిగా కిందకు వస్తుండగా 20 అడుగుల ఎత్తు నుండి కూలిపోయింది. ఆ సమయంలో రైడ్‌లో దాదాపు 10 మంది ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. భారీ శబ్దంతో రైడ్ పడిపోవడంతో ఫెయిర్ గ్రౌండ్ అంతటా భయాందోళనలు వ్యాపించాయి. స్థానిక పోలీసులు, బిలిమోరా అగ్నిమాపక సిబ్బంది, చుట్టుపక్కల వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ధర్మస్థల కేసుకు ఊహించని మలుపు.. సిట్ ముందు అసలు నిజం బయటపెట్టిన ఫిర్యాదుదారు

కర్ణాటకలోని ప్రసిద్ధ యాత్రా క్షేత్రం ‘ధర్మస్థల’ కేసులో వందలాది మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించి సంచలనం రేపిన పారిశుద్ధ్య కార్మికుడు తన వాంగ్మూలాన్ని మార్చాడు. తాను కొంత మంది బలవంతంపై ఈ ప్రకటన చేశానని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో కేసు ఊహించని మలుపు తిరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ముందు హాజరైన ఆయన, తాను స్వచ్ఛందంగా ముందుకు రాలేదని, కొందరి ఒత్తిడితో తప్పుడు ప్రకటన ఇచ్చానని సంచలన ఆరోపణలు చేశారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ స్టాలిన్‌ను మళ్లీ సీఎం కానివ్వను

జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ మళ్లీ రాజకీయ వేదికపైకి వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వ పాలనపై శశికళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నాకు రాత్రిళ్లు నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. మేం ప్రజలకు మంచి పాలన అందించాం. అందుకే ఇప్పటి పరిస్థితులు చూస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మాకే తెలుసు. స్టాలిన్, మిమ్మల్ని మరోసారి అధికారంలోకి రానివ్వను” అని ఆమె […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON