loader

రష్యా-అమెరికా వాణిజ్యంపై పుతిన్‌ సంచలన ప్రకటన!

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాతో ఏ దేశం వాణిజ్య ఒప్పందం చేసుకోకూడదని.. ఆదేశం నుంచి దిగుమతులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. అలాస్కాలో డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుండి రష్యాతో అమెరికా వాణిజ్యం 20 శాతం పెరిగిందని పుతిన్‌ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రకటన ట్రంప్ పరిపాలనపై ప్రపంచ వాణిజ్య […]

రేపటి నుంచి రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభం

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో జరుగుతున్న “ఓట్ల చోరీ”కి వ్యతిరేకంగా ఒక భారీ యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ యాత్రకు “ఓటర్ అధికార్ యాత్ర” అని పేరు పెట్టారు. ఇది 16 రోజుల్లో సుమారు 1300 కిలోమీటర్లు కొనసాగుతుంది. ఈ యాత్ర రేపు బిహార్‌లోని ససారాంలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వివిధ జిల్లాలు, గ్రామాలు, నగరాల గుండా సాగి, సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే ఒక భారీ ర్యాలీతో ముగుస్తుంది.

ఐఫోన్‌ను హ్యాక్‌ చేస్తే కోట్ల రూపాయలు- ఆపిల్‌

ఐఫోన్‌ను హ్యాక్‌ చేస్తే కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ఆపిల్‌ సంస్థ ప్రకటించింది. యాపిల్ సెక్యూరిటీ బౌంటీ కార్యక్రమంలో భాగంగా ఐఫోన్‌ సిస్టమ్స్‌ను బ్రేక్‌ చేసిన వారికి రూ.16 కోట్ల నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించింది. ఆపిల్ కంపెనీ సెక్యూరిటీ బౌంటీ కింద ఐదు రకాల కేటగిరీల్లో అవార్డ్స్ పొందవచ్చు. లాక్‌స్క్రీన్ బైపాస్ వంటి ఫిజికల్ యాక్సెస్ ద్వారా డివైజ్ అటాక్ యూజర్ ఇంటరాక్షన్‌తో నెట్‌వర్క్ హ్యాక్ చేయడంగా ద్వారా,సింగిల్-క్లిక్‌తో సెన్సిటివ్ డేటాకు అనధికార యాక్సెస్,వన్-క్లిక్‌తో ప్రివిలేజ్ ఎలివేషన్‌తో […]

కడెం ప్రాజెక్టులో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకుడు..!

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద ప్రవాహానికి తిప్పిరెడ్డి గంగాధర్ అనే యువకుడు కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. గంగాధర్ చేపల వేట కోసం వెళ్ళి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. యువకుడిని రక్షించడానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. వరద ఉధృతి అధికంగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం […]

రోడ్డులేక 3KM నరకయాతన.. మార్గమధ్యలోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో వీరాపురం గ్రామానికి చెందిన గర్భిణీ పోడియం ఇరమ్మకు తెల్లవారు జామున 3 గంటల సమయంలో ప్రసవ నొప్పులు వచ్చాయి. ఆమె కుటుంబ సభ్యులు మూడు కిలోమీటర్ల దట్టమైన అడవిలో గర్భిణీను జెట్టీలో మోసుకొచ్చారు. బురదలో జెట్టిని మోయలేక ఒకసారి గర్భిణీతో సహా కింద పడిపోయారు. అనంతరం అడవిలోనే ఇరమమ్మ ఆడపిల్లను ప్రసవించింది. అందుబాటులో ఉన్న ఆశ కార్యకర్త గంగమ్మ  బొడ్డు పేగును కత్తిరించించింది. ఆ తర్వాత తిరిగి జెట్టీ లోనే […]

సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. వీటి ధరలు తగ్గనున్నాయ్‌..!

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ GST నిర్మాణంలో ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతుంది. ప్రస్తుత నాలుగు స్లాబ్‌లు 5%, 12%, 18%, 28%. ఈ స్లాబ్‌లలో 5%, 18% అనే రెండు స్లాబ్‌లను మాత్రమే నిలుపుకోవడమే ఈ చర్య అని నివేదికలు చెబుతున్నాయి. 28% స్లాబ్‌లోని 90 శాతం వస్తువులు 18% స్లాబ్‌కు మారుతాయని, 12% స్లాబ్‌లోని 99 శాతం వస్తువులు 5% స్లాబ్‌కు మారుతాయని వర్గాలు తెలిపాయి. ఈ విధంగా కేంద్రం నిత్యావసరాల వస్తువులతో సహా […]

ఓజీ నుంచి ప్రియాంక మోహ‌న్ ఫస్ట్ లుక్ విడుదల..

తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “ఓజీ” . అగ్ర క‌థానాయ‌కుడు పవన్‌ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా హీరోయిన్ పాత్రను అధికారికంగా పరిచయం చేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తోన్న విషయం ముందే బయటకు వచ్చినప్పటికీ, ఆమె పాత్రకు సంబంధించిన డీటెయిల్స్‌ను ఇప్పుడు రివీల్ చేశారు. ప్రియాంక ఈ సినిమాలో “కన్మణి” అనే ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది

డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. ఏపీలో వారందరికీ నోటీసులు.!

ఏపీలో ఇంటి నిర్మాణాల కోసం ఇళ్ల పట్టాలు పొంది.. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అడ్వాన్సులు పొందిన లబ్ధిదారులకు అధికారులు షాక్ ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు ఇంటి నిర్మాణం కోసం పట్టాలు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన స్థలాలలో వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం ప్రజలకు ఒక్కో ఇంటికి రూ.10 వేలు నుంచి రూ.20 వేలు వరకూ అడ్వాన్స్ రూపంలో అందించారు. ఇంటి పనులు ప్రారంభించాలని.. కుదరకపోతే డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని […]

జెలెన్‌స్కీ కీలక నిర్ణయం: ట్రంప్, పుతిన్ భేటీ తర్వాత వాషింగ్టన్‌కు పయనం

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ స్పందించారు. ఈ చర్చల తర్వాత తాను “నిర్మాణాత్మక సహకారానికి” సిద్ధంగా ఉన్నానని జెలెన్‌స్కీ ప్రకటించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జెలెన్‌స్కీ రాబోయే సోమవారం వాషింగ్టన్‌కు పయనం కానున్నారు. ముఖ్యంగా ట్రంప్‌తో ప్రత్యక్షంగా భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది.

సబ్‌ జైలు నుంచి రిమాండ్‌ ఖైదీ పరారీ.. సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారుల సీరియస్‌

ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్‌ జైలు నుంచి రిమాండ్‌ ఖైదీ పరారీ కావడం సంచలనం సృష్టించింది. పలు దొంగతనాల కేసులో జైలులో ఉన్న దువ్వూరు మండలం జిల్లెలకు చెందిన అంతరాష్ట్ర దొంగ మహ్మద్‌ రఫీ ఒక చోరీ కేసులో ఈనెల 13న అరెస్టు చేసిన రాజుపాలెం పోలీసులు నిందితుడిని ప్రొద్దుటూరు సబ్‌ జైలుకు తరలించగా ఇవాళ ఉదయం సబ్‌ జైలు నుంచి గోడ దూకి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ విచారణ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON