తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయమంటే?
వారాంతపు సెలవులు, వరుస హాలీడేస్‌తో కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో కంపార్ట్‌మెంట్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు నిండిపోవడంతో భక్తులను ఆక్టోపస్ భవనం నుంచి క్యూ లైన్‌లోకి అనుమతిస్తున్నారు.