loader

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు- భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగం ఆలోచన, ప్రేరణ రెండింటినీ ప్రతిబింబించే సంప్రదాయాన్ని కొనసాగించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది రాష్ట్రపతి ముర్ము చేసిన నాల్గవ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కావడం విశేషం.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలందరికీ తన సందేశంలో అభినందనలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం పూర్తి ఉత్సాహంతో జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని అన్నారు.

ఓట్ చోరీ క్యాండిల్ ర్యాలీలో షర్మిల ఫైర్

ఓట్ చోరీ ఆరోపణల నేపథ్యంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. దొంగ ఓట్లతో నరేంద్రమోడీ మూడోసారి అధికారంలోకి వచ్చారు. ఓట్లు చోరీ విషయంలో ప్రధాని మోడీనే అసలు గజ దొంగ అని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ లైన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్ జగన్ అనడం హాస్యాస్పదంగా ఉంది అని , జగన్ తన పార్టీలో అరెస్ట్ అయిన నేతలను చూడటానికి వెళ్లి తలకాయలు తొక్కించేసినట్టుగా రాహుల్ గాంధీ […]

మన ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. నిర్మాత అల్లు అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు

మన ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్లదే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటవల ప్రకటించిన నేషనల్‌ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు సినిమాకి ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీ నుంచి కనీసం సత్కారం లేదని అల్లుఅరవింద్‌ అన్నారు. ఇండస్ట్రీ గుర్తించడానికి ముందే సైమా గుర్తించడం ఆనందంగా ఉందన్నారు. తాజాగా గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో `సైమా 2025` ఈవెంట్‌ జరిగింది.

మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన సమీప బంధువులు..

నిజామాబాద్ జిల్లా సింగంపల్లి గ్రామానికి చెందిన మమతకు చెందిన బర్రె సవిత ఇంటి ఎదుట దుర్గంధంగా మారుస్తుంది. పేడ, మాలమూత్ర విసర్జననలతో విసిగిపోయిన సవిత.. ఆ పశువు యజమాని సభ్యులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని బర్రెను గదిలో బంధించింది. దీంతో కోపోద్రిక్తులైన మమత కుటుంబ సభ్యులు తమ పశువుకు మంత్రాలు చేసిందని ఆరోపిస్తూ సవితను హనుమాన్ ఆలయం వద్ద చెట్టుకు కట్టేసి చితకబాదారు. గ్రామస్తుల సమక్షంలో మహిళపై దాడి చేశారు తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆసుపత్రికి […]

ప్రమాదంగా బుడమేరు ప్రవాహం

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వద్ద ఉన్న బుడమేరు నది ప్రవాహం ప్రమాదకరంగా మారిందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎంపీ కేశినేని చిన్ని,ఎమ్మెల్యే బొండా ఉమా సూచించారు. బుడమేరు ప్రవాహం వల్ల తలెత్తే ఇబ్బందులను తాము అర్థం చేసుకున్నామని, ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని కోరారు. ముఖ్యంగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుడమేరు సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని, దీని కోసం అవసరమైన నిధులను కేటాయిస్తామని వెల్లడించారు.

శ్రీశైలం సమీపంలో దారుణం.. 3 ఏళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత

శ్రీశైలానికి 12 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతానికి సమీపంలో చిరుత ప్రవేశించింది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచు గూడెంలో బుధవారం అర్ధరాత్రి ఆరుబయట తల్లి పక్కన  నిద్రలో ఉన్న 3 ఏళ్ల చిన్నారిని నోటకరచుకుని ఈడ్చుకెళ్లింది. తండ్రి అంజయ్య.. ప్రాణాలకు తెగించి చిరుత వెంట పరుగులు పెట్టాడు. అంజయ్య అరుపులకు ఆ చిన్నారిని చెట్ల పొదల్లో పడేసి అక్కడి నుంచి పారిపోయింది. ఆ చిన్నారికి తల, మెడ భాగంలో తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స అందించడంతో.. […]

ఆమె మళ్లీ అరెస్టయింది..జాయ్ జమీమా కేరాఫ్ వైజాగ్

స్పైసీగా వీడియో కాల్స్‌తో పరిచయం పెంచుకుని అందంతో వల వేసి లోకల్ నుంచి ఎన్‌ఐఆర్‌ల వరకు ఉచ్చులో దింపి వసూళ్లకు పాల్పడే జమీమా మళ్లీ అరెస్ట్ అయింది.వెస్ట్ బెంగాల్‌కి చెందిన వ్యక్తిని మోసగించిన కేసులో చాలామంది జమీమాకు సహకరించినట్టు పోలీసులు గుర్తించారు.ఇందులో భాగంగానే ఫారెస్ట్ అధికారి వేణు భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.హనీ ట్రాప్ కోసం జమీమా ప్రత్యేకంగా ఓ గ్యాంగ్‌ను మెయిన్‌టెయిన్ చేస్తోంది.ఇప్పుడా ముఠా మూలాలన్నింటిని వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు.

దర్శన్, పవిత్ర గౌడ అరెస్ట్

రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడలకు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించడంతో బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. కొద్ది గంటల్లోనే పవిత్ర గౌడని, దర్శన్‌ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో వారిద్దరు ప్రస్తుతం బెయిల్‌పై బయటకు ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తీవ్రమైన కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడం మంచిది కాదని అభిప్రాయపడుతూ సుప్రీంకోర్టు వారి […]

ఆపరేషన్ సింధూర్ హీరోలకు గ్యాలంట్రీ అవార్డులు, స్వాతంత్ర దినోత్సవం నాడు సత్కారం

స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ఫైటర్ పైలెట్‌తో పాటు మరొక తొమ్మిది మంది ఐఏఎఫ్ అధికారులకు భారత దేశపు మూడవ అత్యున్నత పతకమైన వీర చక్రను అందించారు. ఆపరేషన్ సిందూర్ నడిపించిన వైస్ చీఫ్ ఆఫ్ హెయిర్ మార్షల్ తివారీ, కమాండర్ ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రా, డిజి ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ అవదేశ్ భారతి సహా నలుగురు సీనియర్ ఐఏఎఫ్ అధికారులకు సర్వోత్తమ యుద్ద సేవ పథకాన్ని అందించనున్నారు.

79వ స్వాతంత్ర దినోత్సవాలకు ముస్తాబైన ఢిల్లీలోని ఎర్రకోట..!

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది.. దేశంలో మొదటగా జెండా ఎగిరే ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎర్రకోటపై 12వ సారి భారత ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సుసంపన్న.. సురక్షిత.. సాహసోపేత నవ భారత్‌ సాకారమే లక్ష్యంగా భారత్ తన 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరగనుంది. ఎర్ర కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON