loader

ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నలుగురు ప్రమాణం

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు బుధవారం ప్రమాణం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్‌ శాశ్వత న్యాయమూర్తులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరి నియామకంతో ఏపీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తుల సంఖ్య 24కు చేరుకుంది.

సమీపంగా వచ్చి ఢీకొన్న రెండు కార్లు.. క్షణాల వ్యవధిలో

ఖమ్మం జిల్లాకు ఏనుకూరు మండలం జన్నారం గ్రామం సమీపంలో బుధవారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్న మరో కారు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. సకాలంలో అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి బయటపడి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో మరో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరికొన్ని గంటల్లో పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల కౌంటింగ్.

ఉద్రిక్తతలు, ఉత్కంఠగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. పులివెందులలో మొత్తం ఓట్లు 10 వేల 601 కాగా.. 8 వేల 103 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో మొత్తం 24 వేల 606 ఓట్లు ఉండగా.. 20 వేల 681 ఓట్లు పోలయ్యాయి. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు ఒక రౌండులో లెక్కింపు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా 2 రౌండ్లలో లెక్కింపు […]

గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిన భారత సంతతికి చెందిన సీఈఓ

టెక్ ప్రపంచంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్‌ పర్‌ప్లెక్సిటీ ముందుకొచ్చింది. అమెరికన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ పర్‌ప్లెక్సిటీ AI వ్యవస్థాపకుడు, CEO అరవింద్ శ్రీనివాస్ గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేయడానికి $34.5 బిలియన్ల (రూ. 3,02,152 కోట్లకు పైగా) ఆఫర్ ఇచ్చారు.

కీచక ఎస్సై.. మహిళకు బట్టలిప్పి వీడియోకాల్‌.. లైంగికంగా వేధింపులు

ఏపీలో ఓ కీచక ఎస్సై బాగోతం బయటకొచ్చింది. న్యాయం కోసం ఓ గిరిజన మహిళ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయిస్తే.. ఆమె అవసరాన్ని అవకాశంగా చేసుకుని ఓ ఎస్సై లైంగికంగా సుఖపెట్టాలని వేధింపులకు దిగాడు. ఆమెకు రోజూ రాత్రి వీడియో కాల్స్‌ చేసి.. నగ్నంగా మారి అసభ్యంగా ప్రవర్తించేవాడు.రోజురోజుకీ ఎస్సై రాజశేఖర్‌ వేధింపులు మితిమీరుతుండటంతో తట్టుకోలేకపోయిన సదరు మహిళ.. వీడియో కాల్‌ చేసినప్పుడు రికార్డ్‌ చేసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఎస్సైని వీఆర్‌కు బదిలీ చేస్తూ […]

ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ నియామకంపై స్టే

2023లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తమ నామినేషన్లను అప్పటి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణలు తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకాల కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. అయితే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉన్నప్పుడు కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని సుప్రీం ధర్మాసనం తాజాగా […]

పులివెందులలో అరాచకాలు జరగలేదని అసహనంగా ఉన్నాడు.. జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు సెటైర్లు

పులివెందుల జడ్పీటీసీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికను రద్దుచేసి, రీపోలింగ్‌ జరిపించాలన్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ డిమాండ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైఎస్‌ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని.. ఈసారి అరాచకాలు జరగలేదనే జగన్‌ అసహనంలో ఉన్నారని విమర్శించారు. రెండు పోలింగ్‌ బూత్‌ల్లో ఎప్పుడైనా రీపోలింగ్‌ జరిగిందా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి కాబట్టే ప్రజలు ధైర్యంగా ఓటేశారని తెలిపారు.

వరుణగండం.. వాళ్లకు వర్క్‌ఫ్రమ్‌ హెమ్‌ ఇవ్వాలని సూచన!

గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  గురువారం కూడా హైదరాబాద్‌లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే హైదారాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఐటీ కంపెనీస్‌ ఎక్కువగా ఉండే హైటెక్‌ సిటీ, రాయదుర్గం, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లోభారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు ఆయా ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు గురువారం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అమలు […]

ఆగస్టు 15 నాడు మాంసం తింటే ఏమవుతుంది, నిషేధం రాజ్యాంగ విరుద్ధం: అసదుద్దీన్ ఓవైసీ

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర పరిధిలో మాంసం దుకాణాలు, వధశాలలు మూసివేయాలని ఆదేశాలనే జారీ చేశాయి. ఈ నిర్ణయంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఉత్తర్వులను అవివేకమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవిగా అభివర్ణించారు. మాంసం తినడానికి, స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సంబంధం ఏమిటని ఓవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగర పాలక సంస్థ కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

వారం రోజుల్లో లొంగిపోవాలంటూ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

ఒలింపిక్ పతక విజేత, భారత రెజ్లింగ్ స్టార్ సుశీల్ కుమార్ జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌కడ్ హత్య కేసులో సుప్రీంకోర్టు గతంలో సుశీల్ కుమార్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేసింది. ఈ తీర్పు దేశంలో రెజ్లింగ్, న్యాయ వ్యవస్థలో సంచలనం మారింది. సుశీల్ కుమార్ గతంలో మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు కూడా ఒక కీలక సాక్షిని బెదిరించిన అనుమానం ఉంది. ఆయన ఈ విషయం సుప్రీంకోర్టులో ప్రస్తావిస్తూ, ఈ స్థాయిలో సుశీల్ కుమార్‌కు మళ్ళీ బెయిల్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON