loader

ఫైటర్ జెట్లపై భారత ఆర్మీ చీఫ్ నిజంగానే ఆ కామెంట్స్ చేశారా? PIB క్లారిటీ

సోషల్ మీడియాలో భారత ఆర్మీకి చెందిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ వీడియోలో..పాకిస్తాన్‌తో యుద్ధంలో ఇండియా ఆరు ఫైటర్ జెట్‌లు, 250 మంది సైనికులను కోల్పోయిందని ఒప్పుకున్నట్లుగా ఉంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ (PIB ఫ్యాక్ట్ చెక్) యూనిట్ఈ క్లిప్ AI ద్వారా సృష్టించారనీ, జనరల్ ఉపేంద్ర ద్వివేది అలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని కన్ఫర్మ్ చేసింది.డీప్‌ఫేక్స్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వీడియోను […]

అలా అయితే పక్కనబెడతాం.. బిహార్ ఓటర్ల జాబితా సవరణపై ఈసీకి సుప్రీం షాక్!

బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఈ సవరణ ప్రక్రియ చట్టవిరుద్ధమని తేలితే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి రెండు నెలల ముందు పక్కనపెట్టాల్సి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని నిర్ధారించడానికి బీహార్ ఓటర్ల నుంచి గుర్తింపు పత్రాలను కోరిన ఈసీ చర్యలకు ఈ విధంగా ప్రతిస్పందించింది.

సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం

దేశంలో సైబర్ నేరాలపై పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో, తాజాగా విడుదలైన గణాంకాల్లో తెలంగాణ రాష్ట్రం అత్యధిక సైబర్ నేరాల నమోదుతో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ రేటు సగటున 4.8 శాతంగా ఉండగా, తెలంగాణలో ఇది 40.3 శాతంగా నమోదైంది. ఇది ఆందోళనకరంగా మారింది.దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో చాలా శాతం తెలంగాణకు చెందినవే కావడం గమనార్హం. ఇది రాష్ట్రానికి అప్రతిష్ఠను కలిగిస్తోంది.

ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రుల్లేరా? నల్గొండకు ముగ్గురుంటే తప్పేంటి?

మంత్రి పదవి విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండగా లేనిది 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్లగొండ జిల్లాకు ముగ్గురు మంత్రులను కేటాయిస్తే తప్పేముంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంకు ఒప్పు..నల్లగొండకు తప్పా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని మృతి

మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా నివాసం ఉంటున్న శ్రీనివాస్ వర్మ కుమార్తె శ్రీజా వర్మ… ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. కొన్నాళ్ల క్రితమే ఎంఎస్ పూర్తి చేసి.. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. సోమవారం నాడు రాత్రి తన అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వచ్చిన శ్రీజా వర్మ భోజనం చేయడం కోసం కారులో రెస్టారెంట్‌కు వెళ్లింది. తిన్న తర్వాత తిరిగి తన అపార్ట్‌మెంట్‌కు తిరిగి వస్తుండగా.. ఆమె కారుని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈప్రమాదంలో శ్రీజా […]

వైజాగ్ బస్టాండ్‌లో విషాద ఘటన.. ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన బస్సు.

విశాఖపట్నం ద్వారకా నగర్ బస్టాండ్‌లో నిన్న భయానక ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, ఒక మహిళను ఢీకొట్టి మృత్యువాతకు గురి చేసింది. బస్సు నియంత్రణ కోల్పోవడంతో ప్లాట్‌ఫామ్ పైకి వెళ్లి అక్కడ ఉన్న మహిళను బలంగా ఢీ కొట్టడం తో బస్టాండ్‌లోని పిల్లర్‌కి, బస్సుకి మధ్యలో ఆ మహిళ చిక్కుకుని సంఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి […]

లిక్కర్ స్కాంలో రెండవ ప్రాధమిక చార్జీషీట్ సిద్ధం

మద్యం కుంభకోణం కేసులో సిట్ రెండవ ప్రాథమిక చార్జీషీటును సిద్ధం చేసింది…. విజయవాడ ఏసీబీ కోర్టులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు సోమవారమే సిట్ దాఖలు చేసింది. రెండవ ఛార్జ్ షీట్లో ముగ్గురి పాత్రపై కీలక ఆధారాలను పొందుపరిచినట్లు అధికారులు పేర్కొన్నారు. కీలక నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల కాల్ డేటా రికార్డు, గూగుల్ టేక్ అవుట్, ఇతర ల్యాప్టాప్ లోని వివరాలను ఛార్జ్ షీట్లో జోడించినట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో బలవంతపు భూ సేకరణ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

రాష్ట్రంలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు లబ్దిచేకూర్చేందుకే బలవంతపు భూ సేకరణ చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర పూర్వ. ప్రస్తుత సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. 2013 భూ సేకరణ, పునరావాసం చట్ట ప్రకారం పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం రైతులు, పేదల ఆమోదంతోనే భూ సేకరణ చేయాల్సి ఉండగా అందుకు విరుద్దంగా ప్రభుత్వాలు బలవంతపు భూసేకరణ చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. అమరావతి రాజధాని పేరుతో లక్షలాది ఎకరాలు భూములు సేకరించారని భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా, వారి పిల్లలకు ఉద్యోగ […]

భారత్​ దౌత్యవేత్తలకు గ్యాస్, వాటర్ కట్ చేసిన పాక్

పాకిస్థాన్ మరోసారి భారత్​​ విషయంలో తన వక్రబుద్ధిని చూపించింది. ఇస్లామాబాద్​ లోని భారత దౌత్యవేత్తల పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దౌత్యవేత్తల నివాసాలకు నీరు, గ్యాస్ వార్త పత్రికలు వంటి నిత్యావసర వస్తువల సరఫరాను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. అంతేకాకుండా భారత రాయబారులపై నిఘాను కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. భారత దౌత్యవేత్తల కార్యకలాపాలను నిశితంగా గమనించడానికి అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది

లోక్‌సభ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలి : అభిషేక్‌ బెనర్జీ

దేశంలో ఓట్ల చోరీ వ్యవహారం దుమారం రేపుతోంది తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ‘గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సరిగ్గానే ఉందని.. పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, తమిళనాడులో మాత్రమే తప్పుగా ఉన్నాయని ఈసీ చెబుతోంది. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ల జాబితా నిర్వహిస్తే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON