loader

ఏపీ మెగా డీఎస్సీ 2025 ఫలితాలు విడుదల

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెగా డీఎస్సీ 2025 తుది ఫలితాలను ప్రభుత్వం సోమ‌వారం విడుదల చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలతో పాటు స్కోర్‌కార్డులు కూడా అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఓటుకు పది వేలు ఇస్తున్నారు: పేర్ని నాని

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటు కోసం డబ్బులు పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, ఎర్రిపల్లి, నల్లగొండువారిపల్లెలలో టీడీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్‌ స్లిప్‌లను లాక్కుంటున్నారని ఆరోపించారు.ఓటుకు పది వేల రూపాయలు ఆశ చూపుతున్నారు. స్లిప్‌లు ఇవ్వకపోతే ఓటర్లను బెదిరిస్తున్నారు. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడతామని టీడీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నట్టు సమాచారం […]

ఎయిమ్స్‌లో చేరిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు తరలించారు. వైద్యులు వెంటనే ఆయనను పరీక్షించి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. జైశంకర్ ప్రస్తుతానికి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని స‌మాచారం. ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

లోయలో పడిన పికప్ వ్యాన్… ఏడుగురు మహిళలు దుర్మరణం…

పూణెలోని చకన్‌ ప్రాంతంలో పికప్‌ వ్యాను అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. పాపల్‌వాడి గ్రామానికి చెందిన పలువురు మహిళలు, చిన్నారులు శ్రావణమాసం సోమవారం సందర్భంగా కుందేశ్వర్‌ ఆలయానికి బయల్దేరారు. అయితే చకన్ ప్రాంతానికి వచ్చేసరికి వాహనం అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కన 30 అడుగుల లోతులోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పుణె ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు […]

ఏపీ ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌..

భీమవరంలో జరిగిన ఈవెంట్‌కు నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనంలో వచ్చిందంటూ వీడియోలు బాగా వైరలయ్యాయి. దీనిపై నిధి అగర్వాల్‌ ఎక్స్‌ వేదికగా వివరణ ఇచ్చారు. ఈవెంట్ నిర్వాహకులు నా కోసం కల్పించిన వాహనం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిది. అయితే దానిని ఏర్పాటు చేసే విషయంలో నా పాత్ర లేదు. ప్రభుత్వ అధికారులెవరూ నా కోసం ఎలాంటి వాహనం ప్రత్యేకంగా పంపలేదు. డ్రైవర్ తన తప్పును ఒప్పుకుంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ప్రభుత్వ వాహనం ప్లేట్‌ పెట్టుకున్న […]

మహిళల వరల్డ్ కప్ కౌంట్‌డౌన్ స్టార్ట్..

ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఈసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు భార‌త్ ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా క్రికెట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ వేడుకలో భాగంగా ఐసీసీ ట్రోఫీ టూర్‌ను అధికారికంగా ప్రారంభించింది. ట్రోఫీ ముంబై నుంచి మొదలై, టోర్నమెంట్ హోస్ట్ నగరాలన్నింటినీ సందర్శిస్తుంది. ఢిల్లీతో పాటు పలు ముఖ్య ప్రదేశాల్లో అభిమానులకు ట్రోఫీని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది.

కార్గో హ్యాండ్లింగ్ కోసం లాజిస్టిక్స్ కార్పోరేషన్: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల సరకు రవాణాను నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను ఈ కార్పోరేషన్ ద్వారానే నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు.సోమవారం రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు.

శ్రీశైలంలో ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు..

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుల మధ్య జరిగిన ప్రమాదం పలువురిని భయానికి గురి చేసింది. ఈ సంఘటన దోర్నాల మండలానికి సమీపంలో చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపై ఎక్కుతుండగా రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే అదృష్టవశాత్తూ బస్సుల్లో ఉన్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు కాకుండా స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మూడు గంటలు గడిచినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, ఘాట్ రోడ్డు పై సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ […]

కొండా సురేఖ ఇంటి ముందు మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

హన్మకొండలో మంత్రి కొండా సురేఖ నివాసం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. అక్షయపాత్ర సంస్థకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కార్మికులు నినాదాలు చేశారు. ప్రైవేట్ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగిస్తే వేలాది మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదముందని వారు పేర్కొన్నారు. కార్మికులు తమ పనిభద్రతకు హామీ ఇవ్వాలని, అలాగే 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతన బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ షోరూమ్ లో టెస్లా ప్రారంభం

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన నెల రోజుల లోపే, సోమవారం దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో తన రెండవ షోరూమ్‌ను ప్రారంభించింది. ఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఏరోసిటీలోని వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో ఈ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON