loader

ఆ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఆపలేరు.. ఎన్టీఆర్

బాద్షా ఈవెంట్ తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోవడం నన్ను ఎంతో బాధపెట్టింది. అందుకే నేను పబ్లిక్ ఈవెంట్స్ అంటే భయపడతాను. 25 ఏళ్ల క్రితం సినిమా ఓపెనింగ్ కోసం వెళ్లినప్పుడు మా నాన్న, మా అమ్మ మాత్రమే ఉంది. కానీ మొట్ట మొదటి సారి మూజీబ్ అనే అభిమాని.. ఇప్పటికీ నాతోనే ఉన్నాడు. ఇంతమంది నా అభిమానులు కావడం నా అదృష్టం.దయచేసి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. డబుల్ కాలర్ ఎత్తాను.. కుమ్మేద్దాం. మళ్లీ సక్సెస్ మీట్ […]

రాహుల్ గాంధీకి కర్ణాటక CEO నోటీసులు

కర్ణాటక ఎన్నికల్లో ఓట్ల అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సంబంధించిన పత్రాలను అందజేయాలని కర్ణాటక CEO ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే, వాటిపై విచారణ జరుపుతామని ఆయన తెలిపారు. షకున్ రాణి లేదా ఇతర ఏ వ్యక్తులు రెండుసార్లు ఓట్లు వేయలేదని  ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి అక్రమాలు జరగలేదని […]

వైఎస్ జగన్ మేనమామపై చర్యలకు సిద్దమైన టీటీడీ..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ, రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్దమైంది. శ్రీవారి ఆలయం ముందు రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ ఆరోపణలు చేశారని విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ ఇటీవల పాలకమండలి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అలాగే శ్రీ‌వారి ఆల‌యం ముందు , మాడ వీధుల్లో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కూడా టీటీడీ హెచ్చరించింది.

హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. మెట్రోలో తెలంగాణ మంత్రి

హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం.. మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకూకట్‌పల్లిలో ఒక వివాహ వేడుకకు హాజరు కావాల్సి ఉండగా.. భారీ ట్రాఫిక్‌ను తప్పించుకోవడానికి వారు తమ కాన్వాయ్‌ను వదిలిపెట్టి.. ఎల్బీనగర్ నుంచి కేపీహెచ్‌బీ వరకు మెట్రోలో ప్రయాణించారు. దీనివల్ల వారు సమయానికి గమ్యస్థానానికి చేరుకోగలిగారు.

జడ్పీటీసీ ఉప ఎన్నికలపై స్పందించిన జగన్

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును అప్రజాస్వామిక, అరాచకవాది అంటూ ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ బరితెగింపు రాజకీయాలు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్ ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన

హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో వాన‌లు దంచికొడుతున్నాయి. ఆదివారం సీఎం ఏ. రేవంత్ రెడ్డి వరద ప్రభావిత బాల్కంపేట ప్రాంతంలో ఆకస్మికంగా పర్యటించారు. ఆయనతో పాటు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఉన్నారు. బుద్ధా నగర్, అమీర్‌పేట్, మైత్రి వనం ప్రాంతాల్లో ప్రజలను కూడా క‌లిసిన సీఎం.. డ్రెయినేజ్ వ్యవస్థను తక్షణం సరిచేయాలని ఆదేశించారు. ఆగస్టు 14 నుంచి 17 వరకు తెలంగాణ అంతటా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

3 వందేభారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ

బెంగళూరు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశవ్యాప్తంగా మూడు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు బెంగళూరు-బెళగావి, అమృత్సర్-శ్రీమాతా వైష్ణో దేవి కత్రా, మరియు నాగ్‌పూర్ (అజ్నీ)-పుణే మార్గాల్లో ప్రయాణిస్తాయి. 19.15 కిలోమీటర్ల పొడవైన ‘ఎల్లో లైన్’ (రాగిగుడ్డ-బొమ్మసంద్ర) మెట్రో మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఈ మార్గం ఎలక్ట్రానిక్ సిటీ వంటి ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతుంది. ప్రధాని ఈ మార్గంలో ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణించారు.

బీహార్ ఉపముఖ్యమంత్రికి రెండు ఓటర్ ఐడీ కార్డులున్నాయి- తేజస్వీ యాదవ్

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు రెండు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు బీహార్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి అవకతవకలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని తేజస్వి యాదవ్ విమర్శించారు. దీనికి విజయ్ కుమార్ సిన్హా స్పందిస్తూ.. తాను లఖీసరాయ్‌కు మారిన తర్వాత బాంకీపూర్ జాబితా నుంచి పేరు తొలగించాలని దరఖాస్తు చేసుకున్నానని.. ఇది తనపై కుట్ర అని కొట్టిపారేశారు.

పాతికేళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక.

వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని పులివెందుల గ్రామీణ, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలని తలపిస్తున్నాయి. మూడు దశాబ్దాల్లో పులివెందుల జెడ్పీటీసీ సీటుకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. 1995, 2006, 2013, 2021లో ఎన్నిక ఏకగ్రీవమైంది. చివరిగా 2001లో మాత్రమే ఎన్నిక జరగడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికలతో ఏకగ్రీవాలకు తెరపడింది. ఇరు పార్టీలూ బేరసారాలకు తెరతీసినట్టు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం. పులివెందుల, ఒంటిమిట్ట సిట్టింగ్ స్థానాలు […]

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌..

ఎప్పుడూ స్టేటస్‌లో కొత్త ఫోటోలు, వీడియోలు పెట్టే వారికి వాట్సాప్ వినియోగదారుల కోసం మరో అదిరిపోయే ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఇకపై ఫోటోలు ఎడిట్ చేయడానికి లేదా థర్డ్ పార్టీ యాప్స్ తో అవసరం లేకుండా చేసింది. యాప్‌లోనే కొలేజ్ రూపొందించుకునే సదుపాయం అందుబాటులోకి రావడంతో, స్టేటస్ అప్‌డేట్ చేయడం మరింత ఈజీగా మారింది. అంటే పుట్టినరోజు పార్టీ, ఫ్యామిలీ గ్యాదరింగ్, ట్రిప్ లేదా ఏదైనా ప్రత్యేక ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలన్నీ ఒకే స్టేటస్‌లో చూపించుకోవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON