బీ అలర్ట్.. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి 9.30 గంటల సయమంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగర వ్యాప్తంగా వాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ.. శనివారం రాత్రి మాత్రం ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్‌లో వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి హైదరాబాద్ – విజయవాడ హైవేపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. పెద్ద అంబర్‌పేట్ నుంచి హైదరాబాద్ సిటీలోకి వెళ్లే రోడ్లపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది.