loader

ప్రధాని మోదీకి చైనా స్వాగతం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో పాల్గొనేందుకు ఆయన చైనా వెళ్తున్నారు ప్రధాని మోదీ పర్యటనకు చైనా ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలికింది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఒక మంచి అవకాశంగా చైనా భావిస్తోంది. ఎస్‌సీఓ సమావేశం సందర్భంగా పుతిన్, జిన్‌పింగ్‌తో పాటు ఇతర ప్రపంచ నేతలతో మోదీ భేటీ కానున్నారు.

వైసీపీకి వైఎస్సార్‌కు ఏం సంబంధం?… వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.కూటమి ప్రభుత్వానికి వైసీపీపై కోపం ఉంటే, దానిని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల మీద చూపిస్తారా? అని ప్రశ్నించారు. అసలు వైసీపీకి వైఎస్సార్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. నందిగామ గాంధీ సెంటర్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడంపై షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించిన చోటే తిరిగి ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.

పిడుగుపాటుకు మినీ ఎత్తిపోతల నేలమట్టం

నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గం, పెంట్లవెల్లి మండల పరిధిలోని మెరుపులు ఉరుములతో కూడిన వర్షానికి పిడుగు పడింది. పిడుగుపాటుకు ఎంగంపల్లి తండా గ్రామ సమీపంలో కృష్ణ్ణానది తీరాన నిర్మించిన ఎత్తిపోతల పథకం పైపులైన్ దిమ్మెలు నేలమట్టం అయ్యాయి. ఈ మినీ ఎత్తిపోతల పథకాన్ని 1994లో నిర్మించారు. దీని ద్వారా ఎంగంపల్లి తండా మల్లేశ్వరం మంచాలకట్ట కొన్ని గ్రామాలకు దాదాపుగా 650 ఎకరాలకు సాగునీరు సరఫరా జరిగేది.

డ్రైవర్ రాయుడు హత్య కేసు… వినుత కోటకు బెయిల్

శ్రీకాళహస్తికి చెందిన రాజకీయ నాయకురాలు, జనసేన బహిష్కృత నేత వినుత కోటకు బెయిల్ మంజూరు అయింది. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన రాయుడు హత్య కేసులో వినుత కోట ఏ3గా ఉన్నారు. ఈ కేసులో వినుత కోటకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు బెయిల్ ఇటీవల మంజూరు చేసింది. అయితే ప్రతిరోజు ఉదయం 10 గంటలలోపు సీ3 సెవెన్ వెల్స్ పోలీసు స్టేషన్‌లో సంతకం చేయాలని షరతు విధించింది.

ఈసీకి ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ (ఈసీ) పనితీరుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఐదు ప్రశ్నలతో కూడిన ఒక లేఖను ఈసీకి పంపారు. బీజేపీతో కలిసి ఈసీ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఫేక్ ఓటింగ్‌కు పాల్పడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై తీవ్ర అనుమానాలను రేకెత్తించాయి. డిజిటల్ ఓటర్ జాబితాను ఎందుకు దాచిపెడుతున్నారు, సీసీటీవీ ఫుటేజీలను ఎవరి ఆదేశాల మేరకు తొలగిస్తున్నారు అనేవి రాహుల్ […]

కాళేశ్వరం కమిషన్ నివేదిక.. సచివాలయానికి వెళ్లిన హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు కోరారు. శుక్రవారం ఆయన సచివాలయానికి వెళ్లి సిఎస్ రామకృష్ణరావును కలిశారు. జస్టిస్ ఘోష్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను ఇవ్వాలని కోరుతూ.. కెసిఆర్, హరీష్ రావు పేరుతో వేర్వేరు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం వినతిపత్రాలు ఇచ్చినట్లు రశీదులు తీసుకున్నారు. హరీశ్‌రావు విజ్ఞప్తిని పరిశీలించి చెబుతామని […]

ఈసీపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి కౌంటర్!

రాహుల్‌ ఎలాంటి ఆధారలు లేకుండా ఈసీపై ఆరోపణలు చేశారన్నారు. గతంలో చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని అతనికి ఈసీ లేఖ రాసిందని వాటిపై ఆయన ఇంకా స్పందించలేదని అన్నారు. ఎందుకంటే ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రంమంత్రి ప్రహ్లాద్‌ జోషి ఎద్దేవా చేశారు. ఈ విషయంలో అధికారిక చర్యలను ప్రారంభించడానికి సంతకం చేసిన అఫిడవిట్‌ను సమర్పించాలని మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీని కోరారని.. కానీ ఆయన ఇప్పటివరకు వాటిని సమర్పించలేదని […]

NCERT 8వ తరగతి టెక్ట్స్‌బుక్‌లో మ్యాప్‌‌పై వివాదం

NCERT ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో జైసల్మేర్ రాజ కుటుంబం గురించి తప్పుగా ఉన్న సమాచారంపై పెద్ద వివాదం చెలరేగింది. NCERT 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలోని యూనిట్ 3, పేజీ నంబర్ 71లో ఉన్న ఒక మ్యాప్ జైసల్మేర్‌ను మరాఠా సామ్రాజ్యంలో భాగంగా చూపించారని, ఇలాంటి నిరాధారమైన, చారిత్రకంగా తప్పుగా ఉన్న సమాచారం ఎన్‌సీఈఆర్‌టీ వంటి సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని చైతన్య రాజ్ సింగ్ ఎక్స్‌లో పేర్కొన్నారు

భారత సైన్యం రంగంలోకి..గాల్లోకి ఎగిరిన జేసీబీ

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ధరాళీ గ్రామాన్ని ఖీర గంగానది వరద ప్రాంతంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి రహదారులు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం ద్వారా సంబంధాలు తెగిపోయి సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రోడ్డు మార్గంలో జేసీబీలను ఘటనా స్థలికి తరలించడం సాధ్యం కాకపోవడంతో ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్ చినూక్ సాయంతో జేసీబీని అక్కడకు తరలించారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సత్య నాదెళ్లను హెచ్చరించిన మస్క్..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ OpenAI తాజాగా తీసుకొచ్చిన GPT-5 అధికారిక ప్రకటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ స్పందించిన తీరు కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. “ఓపెన్‌ఏఐ… మైక్రోసాఫ్ట్‌ను బతికుండగానే మింగేస్తుంది” అని మస్క్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్య మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఉద్దేశించిందని టెక్ వర్గాల్లో భావిస్తున్నారు. ఈ ట్వీట్ వెనుక ఉన్న వ్యంగ్యం, హెచ్చరిక స్వభావం సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చకు దారితీసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON