హైదరాబాద్ లో దంచికొట్టిన వాన
హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. కేవలం గంట వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 7 నుంచి 12 సెం.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 12.3 సెం.మీ, ఖైరతాబాద్‌లో 11.13 సెం.మీ, సరూర్‌నగర్‌లో 10.6 సెం.మీ వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం జలమయం అయింది. బస్తీలు, కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట, గచ్చిబౌలి, ఖైరతాబాద్, బేగంపేట్, మెహిదీపట్నం, గచ్చిబౌలి వరకు […]